Big Stories

Tekkali Politics in AP: మొగుడ్స్ Vs పెళ్లామ్స్..టెక్కలి ఎన్నికల గరంగరం

Tekkali Politics During Elections 2024: వైసీపీ అధ్యక్షుడు జగన్‌‌కి సవాల్‌గా మారిన నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎలాగైనా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఓడించాలని పట్టుదలగా ఉన్నారు జగన్.. ఈ సారి ఆ నియోజకవర్గంలో పాగా వేయడానికి పావులు కదుపుతున్నారు. టెక్కలిలో కింజరపు ఫ్యామిలీ డామినేషన్‌కు చెక్ పట్టాలని చూస్తున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని అచ్చెన్నపై పోటీకి దించారు. అయితే ఇంటి పోరుతోనే సతమతమవుతున్న దువ్వాడకు.. ఇప్పుడు పరిస్థితులు కూడా అనుకూలించడం లేదంట.. అసలు టెక్కలి వైసీపీలో ఏం జరుగుతుంది.

- Advertisement -

శ్రీకాకుళం జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో సైతం తమదైన మార్క్ చూపిస్తుంటుంది కింజరపు కుటుంబం.. శ్రీకాకుళం ఎంపీగా నాలుగు సార్లు గెలిచి, కేద్రమంత్రిగా సైతం పనిచేసిన కింజరపు ఎర్రన్నాయుడు టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరిగా సిక్కోలు రాజకీయాల్ని శాసించారు.. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి కిల్లి కృపారాణి చేతిలో తొలి సారి ఓటమి చవిచూసిన ఎర్రన్నాయుడు తర్వాత మూడేళ్లకు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆయన వారసులుగా తమ్ముడు అచ్చెన్నాయుడు, కొడుకు రామ్మోహన్‌నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.

- Advertisement -

2014 నుంచి అటు శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో రామ్మోహన్‌నాయుడు, ఇటు టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్లో అచ్చెన్నాయుడు వైసీపీకి కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు, మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అటు అసెంబ్లీలో ఇటు బయటా జగన్ టార్గెట్ చేయడంలో ముందుంటారు. జగన్‌పై ఒంటికాలితో లెగిసే అచ్చెన్న పోలీసు కేసుల వేధింపులకు కూడా గురయ్యారు. అలాంటి అచ్చెన్నను ఈ సారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని జగన్ పట్టుదలతో ఉన్నారంట..

Also Read: YS Sharmila: ఏటా జ్యాబ్ క్యాలెండర్ అన్నారే.. ఏదీ ఎక్కడా కనబడదే..?: వైఎస్ షర్మిల

టెక్కలి లో ఈసారి వైసీపీ జెండా ఎగరవేసి అచ్చెన్నను ఇంటికి పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారంట.. వరుస విజయాలతో ఊపుమీదున్న అచ్చెన్నాయుడిపై నిత్యం చిందులేసే.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుని టెక్కిలి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. మరో వైపు శ్రీకాకుళం ఎంపీగా ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించి ఈ సారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న రాంమోహన్‌నాయుడిపై పేరాడ తిలక్‌ని పోటీకి దింపింది వైసీపి.

కింజరపు బాబాయ్ అబ్బాయ్‌లకు చెక్క పెట్టాలని చూస్తున్న జగన్.. శ్రీకాకుళం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు .. అందులో భాగంగా జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి దువ్వాడ శ్రీను, పెరాడ తిలక్‌లని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కి పిలిపించుకుని ప్రత్యేకంగా మంతనాలు జరిపారు … ముగ్గురు కళింగ సామాజిక వర్గం నేతలు కావడంతో ఓట్లు చీలిపోకుండా చూసుకోవాలని హితబోధ చేసారట. టెక్కలి నియోజకవర్గంలో 60 శాతం కళింగ సామాజికవర్గం వారే ఉండటంతో ఈ సారి ఎలాగైనా గెలిచితీరాలని హితబోధ చేశారంట.. గణాంకాల ప్రకారం సెగ్మెంట్లో వెలమ ఓటర్లు 15 శాతం, మత్యకారులు 10 శాతం, 5 శాతం వైశ్యులు 5 శాతం, ఇతరులు 10 శాతం ఉన్నారు.

Also Read: B Forms for TDP Candidates : టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు.. 5 స్థానాల్లో అభ్యర్థులు మార్పు

అందుకే గణనీయంగా ఉన్న కళింగ సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించింది వైసీపీ.. టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్ధి, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిలకు కేంద్ర మాజీ మంత్రి కృపారాణి సహకరిస్తే అచ్చెన్న, రామ్మోహన్‌లకు ఈజీగా చెక్ పెట్టవచ్చని లెక్కలు వేసుకుంది వైసీపీ. అయితే అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అయిదేళ్ల క్రితం తాను వైసీపీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని.. తనకి కేంద్ర కేబినెట్ హోదా స్థాయి పదవి ఇస్తామని చెప్పి జగన్ మాట తప్పారని డాక్టర్ కిల్లి కృపారాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తనకు వైసీపీలో కనీస గుర్తింపు లభించకపోగా.. అవమానాలు ఎదురై ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

పదవుల దగ్గర ఎక్కడ తాను పోటీకి వస్తానోనని జిల్లా నాయకులు తనను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అనేక సార్లు బహిరంగంగానే తన ఆవేదన వెళ్ళగక్కారు. 2009లో కింజరపు ఎర్రన్నాయుడిని ఓడించిన కృపారాణికి కాంగ్రెస్ పెద్దలు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి గౌరవించారు. అలాంటి నేత వైసీపీలో అవమానాలు సహించలేకపోతున్నానంటూ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనను నమ్ముకున్న వారి కోసం పార్టీ మారానని.. కాని తనకిచ్చిన మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి.

వైఎస్ కొడుకు జగన్‌ని సొంత తమ్ముడిలా భావించి నమ్మితే .. తనకు మానసిక క్షోభ మిగిల్చారంటూ కృపారాణి వైసీపీ కి రాజీనామా చేశారు.. తన భర్త రాంమోహనరావు తో వైసీపీ కి బై బై చెప్పేసారు. ఆ పార్టీలో తనకు ఎదురైన అవమానాలు వివరిస్తూ కన్నీటి పర్యంతమైయ్యారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్‌కి తండ్రిలానే ఉన్నత భావాలు ఉన్నాయని భావించానని… తనను కృపమ్మా… కృపమ్మా అంటూనే తీవ్ర అవమానాలకు గురిచేసారని ఆక్రోశం వెళ్లగక్కారు..

Also Read: Stone Attack Case : సీఎం జగన్ రాయిదాడి కేసులో ట్విస్ట్.. అనుమానితుడు రిలీజ్

తన ఇబ్బందులను చెప్పు కోవడానికి తాడేపల్లి వెళితే జగన్మోహన్ రెడ్డిని కలవకుండా ఆయన కోటరీ అడ్డుకుందని.. తనకు అయిదు నిముషాలు అపాయింట్‌మెంట్ ఇవ్వమని కోరుతూ స్పీకర్ సాక్షిగా జగన్‌కు లేఖ ఇచ్చినా పట్టించుకోలేదని ఆమె ఆగ్రహంతో ఉన్నారు.. టెక్కలి వచ్చిన సందర్భంలో కూడా కృపారాణి ని, సి ఎం హిలిప్యాడ్ దగ్గరకి వెళ్లకుండా అడ్డుకోవడం.. ఆ సమయంలో అక్కడే ఉన్న ధర్మాన సోదరుడు కృషదాస్ కనీసం పట్టించుకోకపోవడం ఆమెని తీవ్ర మనస్తాపానికి గురిచేసిందటున్నారు.. మరో వైపు ఇటీవలే జిలా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడం కూడా ఆమె యూటర్న్ తీసుకుని కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి కారణమైందంట..

కృపారాణి తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో తన మాతృ పార్టీ కాంగ్రెస్ లో చేరారు.. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెని టెక్కిలి నియోజవర్గం అభ్యర్ధిగా ప్రకటించింది. అచ్చెంనాయుడికి టెక్కలి నియోజవర్గంలో మంచి పట్టు వుంది… టెక్కలిలో వరుసగా మూడో సారి గెలుపొందడానికి పావులు కదుపుతున్నారు. ఆయన్ని ఎలాగైనా ఓడించాలని చూస్తున్న వైసీపీకి ఇప్పుడు కృపారాణి కూడా ప్రత్యర్ధిగా మారడం ఇబ్బందికర పరిణామమే అంటున్నారు. క‌ృపారాణి ప్రభావంతో చీలే కాళింగ సామాజికవర్గం ఓట్లు.. అచ్చెన్నాయుడికి ప్లస్ అయ్యే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిపిస్తున్నాయి

Also Read: f3 కుటుంబ కథా చిత్రమ్..

ఇది చాలదన్నట్లు ఇప్పటికే టెక్కలిలో వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. దువ్వాడ శ్రీనుకి ఆయన భార్య వాణి కూడా సపోర్ట్ చేయడం లేదు. తనకి టెక్కలి టికెట్ ఇవ్వాలని ఆమె జగన్మోహన్ రెడ్డిని కోరి ఉన్నారు. ఆ క్రమంలో వాణిని టెక్కలి ఇన్చార్జ్‌గా ప్రకటించిన జగన్.. చివరికి శ్రీనివాస్‌నే అభ్యర్ధిగా ప్రకటించారు. దాంతో వాణి టెక్కలి నియోజక వర్గం నుండి ఈ నెల 22న నామినేషన్ వేయడానికి సిద్దమయ్యారు. వైసీపీ బి ఫామ్ ఇస్తే సరే ..లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటున్నారు.

మరో వైవు వైసీపీ ఎంపి అభ్యర్థి తిలక్ కూడా దువ్వాడ శ్రీనుకు పెద్దగా సహకరించడం లేదంటున్నారు. ఇలా ఇంటిపోరుతో సతమవుతున్న దువ్వాడ పరిస్థితి కృపారాణి తీసుకున్న నిర్ణయంతో.. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు తయారైందంట. మరి కింజరవు కోటను బద్దలు కొట్టాలని చూస్తున్న వైసీపీ ఆ టార్గెట్‌ను ఏ మాత్రం రీచ్ అవుతుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News