Big Stories

Realme C65 5G Price Leaked: రూ.10వేల లోపే రియల్ మీ నుంచి 5G ఫోన్.. ధర, ఫీచర్స్ లీక్!

Realme C65 5G Price and Features Leaked: ఉదయాన్నే నిద్రలేచి మమ్మీ కాఫీ అనే రోజులు పోయి.. మమ్మీ నా ఫోన్ ఎక్కడా? అనే రోజులు వచ్చేశాయి. అంతలా స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఫోన్ల వినియోగం కూడా వేేగంగా పెరుగుతుంది. స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి ఇంట్లో ఉంటే పెద్దల వరకు స్మార్ట్‌ఫోన్ అవసరంగా మారింది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రియల్ మీ కొత్త ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా కంపెనీ రియల్ మీ C65 5G స్మార్ట్‌ఫోన్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

రియల్ మీ ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. అయితే దీని ప్రారంభ తేదీని ఇంకా తెలియజేయలేదు. అదే సమయంలో Realme ఈ ఫోన్ ధరను వెల్లడించింది. ఇటీవలి ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలను తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎంపిక చేసిన ఆసియా మార్కెట్‌లో ఇప్పటికే Realme C65 4Gను తీసుకురానుంది.

- Advertisement -
Realme C65 5G
Realme C65 5G

Also Read: లిమిటెడ్ డీల్.. రూ. 3499 ధర గల ఇయర్‌బడ్స్.. మరీ ఇంత సవకా..?

Realme C65 5G కోసం కంపెనీ టీజర్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉంటుందని కూడా నిర్ధారించిందిద. ఈ హ్యాండ్‌సెట్ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన ఎంట్రీ-లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ అని కంపెరీ క్లెయిమ్ చేస్తుంది. రియల్‌మీ ఇండియా సైట్‌లో కూడా ఈ ఫోన్ వివరాలు లైవ్‌లో ఉన్నాయి.

ఈ ఫోన్ 4GB, 6GB, 8GB ర్యామ్ వేరియంట్‌లలో లాంచ్ చేయనుంది. దీని ధర రూ. 12 వేల నుండి రూ, 15 వేల మధ్య ఉంటుందని వెల్లడించింది. అయితే దీని బేస్ మోడల్ ధర రూ. 10,000 లోపు ఉంటుంది.  మిగిలిన వేరియంట్లు రూ. 15,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 128GB స్టోరేజ్‌తో రావచ్చు. దీనిని గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయవచ్చు.

Also Read: నాలుగు 50MP కెమెరాలతో టెక్నో ఫోన్!

Realme C65 5G ఫీచర్లు Realme C65 4G మాదిరిగానే ఉండవచ్చు. ఫోన్ 4G వేరియంట్ MediaTek Helio G85 SoC, 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. రిలీజ్ డేట్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News