E-Paper
Advertisement

Budget Gaming Phones: రూ.25000 బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ ఫోన్స్.. అమెజాన్‌ సేల్‌లో అతి తక్కువ ధరకు

Budget Gaming Phones: రూ.25000 బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ ఫోన్స్.. అమెజాన్‌ సేల్‌లో అతి తక్కువ ధరకు
Advertisement

Budget Gaming Phones| మిడ్ రేంజ్ ధర స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో అద్బుతమైన ఆఫర్స్ ఉన్నాయి. రూ.25,000 లోపు బడ్జెట్‌లో మంచి గేమింగ్ ఫోన్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ టైమ్. డైరెక్ట్ ధర తగ్గింపులు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, నో-కాస్ట్ EMI ఆప్షన్లు ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డుతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అమెజాన్ పే ICICI బ్యాంక్ కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్లతో ప్రీమియం గేమింగ్ ఫీచర్లు చౌకగా దొరుకుతున్నాయి.

గేమింగ్ యూజర్లకు ఈ సేల్ ఎందుకు ముఖ్యం?

ఇప్పుడు మధ్యస్థ ధర ఫోన్లలోనే హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి అద్భుత ఫీచర్లు వస్తున్నాయి. ఎక్కువ సమయం గేమ్ ఆడినా స్మూత్‌గా పని చేస్తాయి. బ్యాటరీ త్వరగా ఛార్జ్ అవుతుంది. iQOO, Motorola, OnePlus, Redmi, Nothing వంటి బ్రాండ్లు రూ.25,000లోపు అద్భుతమైన గేమింగ్ ఫోన్లు ఇస్తున్నాయి.

iQOO Z10 5G

Advertisement

6.77 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ గేమింగ్ అనుభవం ఇస్తుంది. Snapdragon 7s Gen 3 ప్రాసెసర్, ఫాస్ట్ RAM, UFS స్టోరేజ్ ఉన్నాయి. 6000mAh పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్ కేవలం రూ.22,998కు కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా Edge 60 Fusion

6.70 ఇంచ్ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ గేమ్‌ప్లే. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ మల్టీటాస్కింగ్, గేమింగ్‌లో బాగా పని చేస్తుంది. 5,500mAh బ్యాటరీ, 68W టర్బో చార్జ్ సపోర్ట్ ఉంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈ ఫోన్ రూ.24,500కే అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 5

Advertisement

6.77 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లూయిడ్ విజువల్స్. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 7100mAh పెద్ద బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది. ప్రస్తుతం స్పెషల్ సేల్‌లో దీని ధర రూ.24,499.

Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇక ఆ ఆప్షన్ లేనట్లే!

రెడ్మీ నోట్ 14 Pro 5G

6.67 ఇంచ్ FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ స్థిరమైన గేమింగ్, డైలీ యూస్ ఇస్తుంది. 5,500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ గేమింగ్ ఇప్పుడు అమెజాన్ లో కేవలం రూ.21,799కే కొనుగోలు చేయొచ్చు.

నథింగ్ ఫోన్ 3a Lite

6.77 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్, 8GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. నథింగ్ యూనిక్ Glyph ఇంటర్‌ఫేస్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్ రూ.19,848కు లభిస్తోంది.

ఈ సేల్‌లో గేమింగ్ ఫోన్లు చాలా చౌకగా దొరుకుతున్నాయి. త్వరగా అమెజాన్‌లో చెక్ చేసి మీకు నచ్చిన మోడల్ కొనేయండి!

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×