E-Paper
Advertisement

Zurich Airport : జ్యురిచ్‌కు చేరుకున్న రేవంత్ టీమ్.. ఎయిర్‌పోర్టులో రాయబారి-తెలుగు ప్రజల ఘనస్వాగతం

Zurich Airport : జ్యురిచ్‌కు చేరుకున్న రేవంత్ టీమ్.. ఎయిర్‌పోర్టులో రాయబారి-తెలుగు ప్రజల ఘనస్వాగతం
Advertisement

Zurich Airport: దావోస్‌ వేదికగా మంగళవారం నుంచి ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు-2026 మొదలు కానుంది. ఇప్పటికే ప్రపంచంలోని వ్యాపారవేత్తలు, దేశంలొని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ సిటీకి రేవంత్ టీమ్ చేరుకుంది. అక్కడ వారికి ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు.

జ్యురిచ్‌కు చేరుకున్న రేవంత్ టీమ్

Advertisement

స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ సిటీకి చేరుకుంది రేవంత్ టీమ్. జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో సీఎం రేవంత్‌రెడ్డికి భారత రాయబారి మృదుల్​ కుమార్​ తోపాటు ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రి పొంగులేటి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఒకరోజు ముందుగానే దావోస్ చేరుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ పారిశ్రామికవేత్తలతో సమావేశం ఉంటుంది.

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు రేవంత్ టీమ్ దావోస్‌కు వెళ్లింది. అక్కడ తెలంగాణ విజన్ రైజింగ్-2047 పేరిట గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో కంపెనీల అధినేతలతో సీఎం రేవంత్‌రెడ్డి విడివిడిగా భేటీ కానున్నారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.

Advertisement

ఎయిర్‌పోర్టులో రాయబారి-తెలుగు ప్రజల ఘనస్వాగతం

తెలంగాణలో ప్రస్తుతమున్న పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైనెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. వివిధ రంగాల అభివృద్ధికి అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అంతకుముందు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్​ కుమార్​ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉండే కంపెనీల గురించి ఆరా తీశారు. 2024లో కేవలం 40 వేల కోట్ల పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోగా, గతేడాది లక్షా 78 లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. ఈసారి అంతకంటే ఎక్కువ ఒప్పందాలు జరిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.

ALSO READ:  ఫోన్ ట్యాపింగ్ కేసు.. కాసేపట్లో పార్టీ ఆఫీసుకు హరీష్‌రావు

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×