E-Paper
Advertisement

ఇండియాను చూసేందుకు ఉద్యోగాలు వదిలేసిన యూరప్ అమ్మాయిలు.. వందే భారత్ జర్నీ చూసి..

ఇండియాను చూసేందుకు ఉద్యోగాలు వదిలేసిన యూరప్ అమ్మాయిలు.. వందే భారత్  జర్నీ చూసి..
Advertisement

Foreign Women Praise Vande Bharat: ఇండియాను చూడాలనే కోరికతో ఉద్యోగాలను వదులుకున్న ఇద్దరు యూరోపియన్ మహిళలు.. భారత్ లో రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా భారతీయ రైల్వేలలో తమకు ఎదురైన ఎక్స్ పీరియెన్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ముఖ్యంగా వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లో తొలిసారి ప్రయాణించిన తర్వాత వారు పంచుకున్న అభిప్రాయాలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. రైల్వే స్టేషన్లలో రద్దీ, సామాను పెట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా.. రైలు సౌకర్యాలు, భద్రతపై వారు ప్రశంసలు కురిపించారు.

లగేజీ కోసం ప్రయాణికుల పాట్లు..  

లిథువేనియాకు చెందిన కరీషా తన స్నేహితురాలు క్రిస్టినాతో కలిసి ఇండియా పర్యటనకు వచ్చారు. వీరిద్దరూ గతంలోనూ భారత్‌ను సందర్శించారు. ఈసారి దేశంలోని పలు ప్రాంతాలను చూడాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌ లో పర్యటిస్తున్న ఈ స్నేహితులు తమ ప్రయాణ విశేషాలను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల కరీషా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన తన ఎక్స్ పీరియెన్స్ ను పంచుకున్నారు. రైల్వే ప్లాట్‌ ఫారమ్‌పై ప్రయాణికుల రద్దీని చూసి ఆమె ఆశ్చర్యపోయారు. రైలు ఎక్కడం, సామాను పెట్టుకోవడానికి సరైన స్థలం వెతుక్కోవడం కొంత ఇబ్బందిగా అనిపించిందని చెప్పారు. ఆ పరిస్థితిని ప్రముఖ హాలీవుడ్ సినిమా సిరీస్ ‘ది హంగర్ గేమ్స్‌’తో పోల్చారు. ప్రయాణికులంతా తమ లగేజీకి స్థలం కోసం ప్రయత్నించడం చూస్తుంటే అలా అనిపించిందని చెప్పుకొచ్చింది.

ప్రయాణం అద్భుతం..

Advertisement

ప్రయాణం ప్రారంభించే సమయంలో కొంత గందరగోళం ఎదురైనా, ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ బాగుందని కరీషా చెప్పుకొచ్చింది. వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో సుమారు 10 గంటలు ప్రయాణించిన తర్వాత, టికెట్ కోసం ఖర్చు చేసిన డబ్బుకు తగిన సౌకర్యాలు లభించాయని సంతోషం వ్యక్తం చేసింది. ఏసీ రైలు, నాన్‌ ఏసీ రైలు ప్రయాణాల మధ్య తేడాను కూడా ఆమె వివరించారు. నాన్‌-ఏసీ టికెట్ ధర కొంత తక్కువగా ఉన్నప్పటికీ, తనకు అవకాశం ఉంటే ఏసీ రైలులోనే ప్రయాణిస్తానని చెప్పారు. వందే భారత్‌లో ప్రయాణం తనకు మరింత సేఫ్ గా అనిపించిందని వెల్లడించారు.

టాయిలెట్ డిజైన్ చూసి ఆశ్చర్యం

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లోని బాత్రూమ్‌ ను కూడా కరీషా తన వీడియోలో చూపించారు. అక్కడి శుభ్రతను ప్రశంసించారు. అంతేకాదు, టాయిలెట్‌ లోని వాష్‌ బేసిన్ డిజైన్ ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అద్దం కింద ఉన్న వాష్‌ బేసిన్, టాయిలెట్ సీటుతో పోలిస్తే పెద్దదిగా కనిపిస్తోందని సరదాగా కామెంట్ చేసింది.

నెల రోజుల టూర్ కోసం ఉద్యోగాలను వదిలి..   

Advertisement

క్రిస్టినా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం, ఈ ఇద్దరు స్నేహితులు అక్టోబర్ 16న భారత్‌ కు వచ్చారు. తొలుత న్యూఢిల్లీలో పర్యటించి, ఆటోరిక్షా, మెట్రోలో ప్రయాణించారు. అనంతరం ఆగ్రాను సందర్శించి, అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లారు. సుమారు నెల రోజుల పాటు భారతదేశాన్ని చుట్టి చూడాలని ప్లాన్ చేసుకున్నారు. ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, కాశ్మీర్‌ తో పాటు కేరళను కూడా సందర్శించే అవకాశం ఉంది. ఈ పర్యటన కోసం తమ ఉద్యోగాలను వదులుకున్నట్లు వెల్లడించారు.

Read Also: గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!

Tags

Related News

ట్రాఫిక్‌లో చిక్కుకొని రైలు మిస్ అవుతుందని టెన్షన్ వద్దు.. మీ సమస్యకు పరిష్కారం ఇదే

విమానాల్లో ఫైవ్ స్టార్ రేంజ్ ఫుడ్.. ఎయిర్ ఇండియా క్రేజీ ప్లాన్!

సౌదీలో క్షిపణి దాడులు.. భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరికలు!

రైల్లో క్యాన్సర్ పేషెంట్ మృతి.. 12 గంటల పాటు మృతదేహంతో ప్రయాణికుల అవస్థలు!

గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!

ఢిల్లీలో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి ఆ వెహికల్స్ కు నో ఎంట్రీ!

లోకో పైలట్లకు జీరో ఆల్కహాల్ రూల్.. రైల్వే బోర్డు షాకింగ్ డెసిషన్!

Big Stories

Advertisement
×