E-Paper
Advertisement

యాపిల్ బంపరాఫర్.. iPhone 17 Pro Maxపై.. ఏకంగా రూ.47,000 తగ్గింపు!

యాపిల్ బంపరాఫర్.. iPhone 17 Pro Maxపై.. ఏకంగా రూ.47,000 తగ్గింపు!
Advertisement

Apple 50th Anniversary Sale: యాపిల్ సంస్థ తన 50వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్ అయిన ఇమాజిన్ స్టోర్ (Imagine Store).. ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు ఐప్యాడ్, యాపిల్ వాచ్‌లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను అందిస్తోంది. కొత్తగా ఐఫోన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇదే బెస్ట్ టైమ్ అని నిపుణులు చెబుతున్నారు.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఆఫర్

సాధారణంగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256GB) అసలు ధర సుమారు రూ. 1,49,900 ఉండగా.. ఈ సేల్‌లో అన్ని ఆఫర్లు పోనూ దీనిని రూ. 1,02,900కే సొంతం చేసుకోవచ్చు. అంటే అసలు ధరపై ఏకంగా రూ.47,000 డిస్కౌంట్ లభించనుంది. రాయితీ వివరాలు పరిశీలిస్తే.. ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ కింద వెంటనే రూ. 1,000 తగ్గనుంది. యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో రూ.4000 క్యాష్ బ్యాక్ రానుంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 6,000.. మీ పాత ఫోన్ కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ. 36,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తుంది.

ఇతర మోడళ్లపై ఆఫర్లు

Advertisement

మరోవైపు ప్రో మ్యాక్స్ తరహాలోనే iPhone 17 Pro మోడల్ పై కూడా అదే విధమైన ఆఫర్లు ఇమాజిన్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అన్ని గరిష్టంగా వర్తిస్తే.. రూ.89,900కే దీనిని సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా iPhone 17 మోడల్‌పై కూడా భారీ డిస్కౌంట్ తో ఇస్తున్నారు. 256GB వేరియంట్ అన్ని గరిష్ట ఆఫర్లతో కలిపి రూ. 37,900కే లభించే అవకాశం ఉంది.

Also Read: ఎయిర్ ఫ్రైయర్ క్లీనింగ్‌లో.. ఈ తప్పులు చేస్తున్నారా? అయితే కొంపకొల్లేరే!

ఐపాడ్, యాపిల్ వాచ్

Advertisement

యాపిల్ వార్షికోత్సవ సేల్ లో ఐపాడ్ కూడా భారీ రాయితీతో లభిస్తోంది. 2025 మోడల్ కు చెందిన 128GB స్టోరేజ్, వై ఫై వేరియంట్ ధర రూ.34,900 కాగా.. డిస్కౌంట్ లో రూ.31,900 సొంతం చేసుకోవచ్చు. మరోవైపు అంతే స్టోరేజ్ కలిగిన వైఫై వై-ఫై + సెల్యులార్ మోడల్ ధర రూ. 49,900 నుండి రూ. 46,900కు తగ్గింది. ఐప్యాడ్ ప్రో (M5) లైనప్‌లోని 11 అంగుళాల (256GB, Wi Fi) మోడల్ రూ.94,900కి తగ్గింది. 13 అంగుళాల వేరియంట్ ధర రూ. 1,24,900కు దిగొచ్చింది. మరోవైపు యాపిల్ వాచ్ అల్ట్రా 3 ధర రూ.89,900 నుంచి ఆఫర్ లో రూ.84,400 లభిస్తోంది. యాపిల్ వాచ్ సిరీస్ 11 రూ. 43,400కు.. యాపిల్ వాచ్ SE 3 మోడల్ రూ.22,900కు అందుబాటులో ఉన్నాయి.

Also Read: ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. డిటాచబుల్ స్పీకర్లతో వచ్చిన.. పవర్‌ఫుల్ ప్రొజెక్టర్!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×