E-Paper
Advertisement

టాలీవుడ్‌లో జాక్వెలిన్ ‘కిక్’.. డార్జిలింగ్ కొండల్లో సీక్రెట్ షూటింగ్! వివాదాల సుడిగుండం నుంచి వెండితెరకు.. రూ. 200 కోట్ల కేసు ఎఫెక్ట్ తగ్గేనా?

టాలీవుడ్‌లో జాక్వెలిన్ ‘కిక్’.. డార్జిలింగ్ కొండల్లో సీక్రెట్ షూటింగ్! వివాదాల సుడిగుండం నుంచి వెండితెరకు.. రూ. 200 కోట్ల కేసు ఎఫెక్ట్ తగ్గేనా?

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్..బాలీవుడ్ గ్లామర్ డాల్ గా క్రేజ్ కొట్టేసిన ఈ శ్రీలంకన్ బ్యూటీ ఇపుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవ్వడం హాట్ టాపిక్ అయిపొయింది.ఇప్పటివరకు హిందీ సినిమాలతో నార్త్ ఇండియాను షేక్ చేసిన ఈ అమ్మడు ఇపుడు ఒక భారీ బడ్జెట్ తెలుగు సినిమాతో సౌత్ ఇండియాలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అయితే, జాక్వెలిన్ పేరు గత కొంతకాలంగా సినిమాల కంటే ఎక్కువగా రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులోనే ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెల్సిందే.అలా కాంట్రవర్సీలతో సావాసం చేసిన జాక్వెలిన్ ఇపుడు టాలీవుడ్ బాట పట్టడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ .

పేపర్ బాయ్’, ‘అరి’ సినిమాలని తీసిన  డైరెక్టర్ జయశంకర్ 

ఇక ఈ సినిమాకి ‘పేపర్ బాయ్’, ‘అరి’ సినిమాలని తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ జయశంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లోని మంచు కొండల్లో సీక్రెట్ గా షూట్ చేసుకుంటుందని,ఇందులోజాక్వెలిన్ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ లని డూప్ లేకుండా చేస్తుందని సమాచారం.

also read:ప్రభాస్ స్టైలిష్ విధ్వంసానికి 17 ఏళ్లు.. మెహర్ రమేష్ ‘ఫాస్టెస్ట్’ రికార్డ్ ఇదే!

10 కోట్ల విలువైన బహుమతులను ఆమె అందుకున్న జాక్వెలిన్

ఇక జాక్వెలిన్ డార్క్ షేడ్ వైపు ఓ కన్నేస్తే సుకేశ్ చంద్రశేఖర్‌తో ఆమెకు ఉన్న రిలేషన్ అటు ఇండస్ట్రీని, ఇటు పాలిటిక్స్ ని ఒక్క సారిగా షేక్ చేసింది.సుకేశ్ తనను తాను పెద్ద రాజకీయ నాయకుడి బంధువునని నమ్మించి, ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ అదితి సింగ్ నుండి సుమారు రూ. 200 కోట్లు వసూలు చేశాడు. ఈ దోచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని జాక్వెలిన్‌కు ఖరీదైన గిఫ్టుల రూపంలో, ఇచ్చాడని ఈడీ (ED) గుర్తించింది.అందులో కోట్లాది రూపాయల డైమండ్ నెక్లెస్ లు, పారిన్ పిల్లులు, రూ. 52 లక్షల కాస్ట్లీ గుర్రంతో పాటు లగ్జరీ కార్లు అంటూ దాదాపు రూ. 10 కోట్ల విలువైన బహుమతులను ఆమె అందుకున్నట్లు ఈడీ ఛార్జ్ షీట్‌లో ఫైల్ చేసింది.

విదేశాలకు వెళ్లాలంటే  కోర్టు పర్మిషన్ కంపల్సరీ

ఇక ఈ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొన్న ఈడీ, సుకేశ్ నేరస్తుడని తెలిసి కూడా ఆమె బహుమతులు స్వీకరించిందని ఆరోపించింది. అయితే, తాను కూడా సుకేశ్ చేతిలో మోసపోయానని జాక్వెలిన్ కోర్టులో వాదించడం విశేషం. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్న జాక్వెలిన్ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం కోర్టు పర్మిషన్ కంపల్సరీ.
అనుమతి తప్పనిసరి.ఏది ఏమైనా ఇన్ని కాంట్రవర్సీ ల మధ్యలో కూడా జాక్వెలిన్ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం టాలీవుడ్ దిక్కు చూడటం విశేషం. మరి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ఆమె సరసన నటించే ఆ ‘స్టార్ హీరో’ ఎవరు? సినిమా టైటిల్ ఏంటి అన్న విషయాలని త్వరలో అయినా రివీల్ చేస్తారేమో చూడాలి !

also read:విడాకులు నిజమేనా శర్వా…? ఇన్‌స్టా నుంచి ఫ్యామిలీ ఫోటోలు అవుట్..!

Related News

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

Big Stories

×