E-Paper
Advertisement

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!
Advertisement

iPhone Duo: యాపిల్ నుంచి రాబోతున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది. ఐఫోన్ 18 సిరీస్‌లోని ఇతర మోడళ్లు సెప్టెంబర్‌లోనే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఫోల్డబుల్ ఐఫోన్ (iPhone Duo) మాత్రం వెంటనే అందుబాటులోకి రాకపోవచ్చని తెలుస్తోంది. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ అక్టోబర్‌లో అమ్మకాలకు వచ్చే అవకాశం ఉంది. అంటే సెప్టెంబర్‌లో జరిగే యాపిల్ ఈవెంట్‌లో ఫోన్‌ను ఆవిష్కరించినా, కొనుగోలుదారులు మరికొన్ని వారాలు వేచి చూడాల్సి రావచ్చు.

అక్టోబర్‌లో అమ్మకాలు?

యాపిల్ సాధారణంగా కొత్త ఐఫోన్‌లను సెప్టెంబర్‌లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో పరిచయం చేస్తుంది. ఈసారి ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు కంపెనీ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా అదే వేదికపై చూపించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే ఆవిష్కరణ, అమ్మకాల ప్రారంభం ఒకేసారి ఉండకపోవచ్చు. iPhone Duoగా పిలుస్తున్న ఈ మోడల్‌కు అక్టోబర్‌ను ప్రారంభ విక్రయాల సమయంగా కంపెనీ ఎంచుకునే అవకాశం ఉందని గుర్మన్ పేర్కొన్నారు.

Advertisement

Also Read: యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

ఉత్పత్తి సవాళ్లే ఆలస్యానికి కారణమా?

ఫోల్డబుల్ ఫోన్ తయారీ సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ప్రత్యేకమైన డిస్‌ప్లే, మడితపెట్టే డిజైన్ వంటి అంశాల కారణంగా భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం కంపెనీకి సవాలుగా మారొచ్చు. గతంలో వచ్చిన పలు నివేదికలు కూడా ఉత్పత్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చని సూచించాయి. అందుకే సెప్టెంబర్‌లో ఫోన్‌ను ప్రకటించి, అక్టోబర్‌లో అమ్మకాలు ప్రారంభించడం ద్వారా కంపెనీకి అదనపు సమయం లభించే అవకాశం ఉంది. ప్రారంభ దశలో సరఫరా సమస్యలు రాకుండా ఉత్పత్తిని స్థిరంగా పెంచడమే యాపిల్ లక్ష్యంగా ఉండొచ్చని తెలుస్తోంది.

భారీ ధరలు ఉండే అవకాశం:

Advertisement

ధర విషయంలో ఈ iPhone Duo సాధారణ ఐఫోన్ మోడళ్ల కంటే భారీగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. 256జీబీ బేస్ వేరియంట్ ధర సుమారు రూ.1.76 లక్షలు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎక్కువ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర సుమారు రూ.2.64 లక్షలు వరకు చేరొచ్చని సమాచారం. భారత మార్కెట్‌లో పన్నులు, ఇతర ఖర్చులు కలిస్తే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో యాపిల్ పెన్సిల్‌కు మద్దతు ఉండొచ్చని కూడా గుర్మన్ తెలిపారు. అయితే విడుదల తేదీ, ధర, ఫీచర్లపై ఇప్పటివరకు కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read: ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

Tags

Related News

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s లుక్ ట్రెండ్.. ChatGPTలో ఈ ప్రాంప్ట్‌ తో మీ ఫోటోనూ మార్చుకోండిలా!

ఫోన్ ఛార్జర్‌పై Qi గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఇంత అర్థం ఉందా!

మీ ఫోన్‌లోనూ హిడెన్ యాప్స్ ఇన్‌స్టాల్ అయ్యాయేమో ఇలా చెక్ చేసుకోండి!

మానవ వ్యర్థాలతో.. అత్యంత బలమైన కాంక్రీట్‌.. శాస్త్రవేత్తల నెవర్ బిఫోర్ ప్రయోగం!

జియో రూ.500 vs రూ.550 ప్లాన్స్.. ఉచిత ఓటీటీలు, అపరిమిత 5G.. యూజర్లకు పండగే!

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×