E-Paper
Advertisement

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !
Advertisement

Abdul Razzaq On IND VS PAK : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య మ్యాచ్ లు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ లు జరిగితే, జనాలు ఎగ‌బ‌డి చూస్తూ ఉంటారు. ఏది ఏమైనా టీమిండియాను ఓడించాలని, పాకిస్తాన్ అభిమానులు వాళ్ళ అల్లాను మొక్కితే… ఇండియాలో ఉన్న దాదాపు 120 కోట్ల హిందువులు…త‌మ ఆరాధ్య‌ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు. అయితే అలాంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ గురించి అబ్దుల్ రజాక్ (Abdul Razzaq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒకప్పుడు ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేవని.. ఆ సమయంలో తమతో కలిసి కొంతమంది ఇండియన్ క్రికెటర్లు నమాజ్ చేసే వాళ్ళని బాంబు పేల్చారు. తమతో కలిసి జాలీగా డ్రెస్సింగ్ రూమ్ లో కూడా గడిపే వారని షాకింగ్ నిజాల‌ను బ‌య‌ట పెట్టారు అబ్దుల్ రజాక్.

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య అప్పట్లో ద్వైపాక్షిక సిరీస్ లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ల నేపథ్యంలో పాకిస్తాన్ లో ఇండియన్ క్రికెటర్లు పర్యటించేవారు. పాకిస్తాన్ లో సేఫ్ గానే ఇండియ‌న్ క్రికెట‌ర్లు ఉంటూ, మ్యాచ్ లు ఆడేవారు. అయితే, ఈ క్రమంలో అబ్దుల్ రజాక్ గతంలో జరిగిన సంఘటనల గురించి తాజాగా పంచుకున్నారు. పాకిస్తాన్ లో ( Pakistan Team) పర్యటించిన టీమిండియా క్రికెటర్లు తమతో అప్పట్లో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారని గుర్తు చేశారు. ఇండియన్ ముస్లిం క్రికెటర్లైతే, తమతో కలిసి నమాజ్ చేసే వాళ్ళని వ్యాఖ్యానించారు. అయితే నమాజ్ చేసిన వాళ్ల పేర్లను చెప్పకుండా అబ్దుల్ రజాక్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

తమతో నమాజ్ చేయడమే కాకుండా డ్రెస్సింగ్ రూమ్ లో కూడా సరదాగా గడిపే వారని తెలిపారు అబ్దుల్ రజాక్. హోటల్ రూమ్ లో కూడా తమతో జాలీగా ఉండేవారని గుర్తు చేశారు. అప్పట్లో క్రికెటర్ల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకపోవని.. చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు బీసీసీఐ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఇండియా అలాగే పాకిస్తాన్ క్రికెటర్లు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలు తీసుకువచ్చారని అబ్దుల్ రజాక్ మండిపడ్డారు. క్రికెట్ ను ఒక ఆటగా మాత్రమే చూడాలని కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధంలా చూస్తే… పరిస్థితులు దారుణంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా షేక్ హ్యాండ్ విషయంలో బీసీసీఐ వెనక్కి తగ్గాలని కోరారు. ఇరు దేశాల మధ్య సామరస్యాన్ని పెంపొందించాలని రిక్వెస్ట్ చేశారు అబ్దుల్ రజాక్ (Abdul Razzaq).

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Related News

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లో టీమిండియాకు న‌ర‌కం చూపిస్తాం..రియాజ్ హెచ్చ‌రిక‌

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు

CSKను నాశ‌నం చేసింది ధోనినే…అత‌న్ని గెంటేయండి !

ఆసియా క‌ప్ లో క‌ల‌క‌లం.. స్మృతి మందాన కిట్ దొంగిలించిన పాక్ ప్లేయ‌ర్లు !

న‌న్ను కొనేందుకు ఫిక్స‌ర్ వ‌స్తే..హోట‌ల్ రూంలోనే చిత‌క‌బాదాను

టీమిండియాకు ప్లాట్ పిచ్ లు..పాకిస్తాన్ కు క‌ఠిన‌మైన పిచ్ లా ? ఇంగ్లండ్ పై ఫైర్‌

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?

Big Stories

Advertisement
×