E-Paper
Advertisement

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!
Advertisement

India-Bangladesh Train Services: రెండేళ్లకు పైగా నిలిచిపోయిన భారత్-బంగ్లాదేశ్ రైలు సేవలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిహద్దు రైలు అనుసంధానాన్ని పునరుద్ధరించే అంశంపై ఇరు దేశాలు కీలక చర్చలు జరిగాయి.  ఢాకాలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్-ప్రభుత్వ రైల్వే సమావేశం (IGRM)లో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించారు.

మూడు రైళ్లపై ప్రధాన దృష్టి

2024లో బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల కారణంగా మైత్రి ఎక్స్‌ ప్రెస్, బంధన్ ఎక్స్‌ ప్రెస్, మితాలీ ఎక్స్‌ ప్రెస్ సేవలు నిలిచిపోయాయి. ఢాకా-కోల్‌కతా మధ్య మైత్రి ఎక్స్‌ ప్రెస్, ఖుల్నా-కోల్‌కతా మధ్య బంధన్ ఎక్స్‌ ప్రెస్, ఢాకా-న్యూ జల్పైగురి మధ్య మితాలీ ఎక్స్‌ ప్రెస్ నడిచేవి. 2024 జూలైలో విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జూలై 16న మైత్రి ఎక్స్‌ ప్రెస్‌ను నిలిపివేయగా, జూలై 19 నుంచి మిగిలిన అంతర్జాతీయ ప్రయాణికుల రైలు సేవలు కూడా ఆగిపోయాయి.

రాజకీయ పరిణామాలతో మారిన పరిస్థితులు

Advertisement

బంగ్లాదేశ్‌లో అప్పటి రాజకీయ సంక్షోభం చివరకు షేక్ హసీనా ప్రభుత్వం పతనానికి దారితీసింది. 2024 ఆగస్టు 5న హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. అనంతరం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ఈ పరిణామాల తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాల్లో కొన్ని విభేదాలు కొనసాగాయి. దాని ప్రభావం రైలు ప్రయాణాలపైనా పడింది. అయితే, సరుకు రవాణా రైల్వే కార్యకలాపాలు తిరిగి మొదలైనప్పటికీ, ప్రయాణికుల రైళ్లు మాత్రం ఇంతవరకు పట్టాలెక్కలేదు.

రాజ్‌షాహి-కోల్‌ కతా కొత్త రైలు ప్రతిపాదన

తాజా సమావేశంలో బంగ్లాదేశ్ మరో కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. రాజ్‌షాహిని కోల్‌కతాతో కలిపే కొత్త అంతర్జాతీయ ప్రయాణికుల రైలును ప్రారంభించాలని ఢాకా ప్రతిపాదించనుంది. అలాగే మైత్రి ఎక్స్‌ ప్రెస్ మార్గంలో కూడా మార్పు చేయాలని బంగ్లాదేశ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న మార్గానికి బదులుగా పద్మా వంతెన మీదుగా ఢాకా-కోల్‌కతా రైలు సేవను నడిపే ప్రతిపాదనను సమావేశంలో ఉంచే అవకాశం ఉంది.

త్వరలోనే సేవలు ప్రారంభమయ్యే అవకాశం

Advertisement

నిలిచిపోయిన మూడు రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు భారత రైల్వే అధికారులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు బంగ్లాదేశ్ రైల్వే వర్గాలు వెల్లడించాయి. చర్చలు సానుకూలంగా సాగి ఇరు దేశాలు అంగీకారానికి వస్తే, వచ్చే నెల ప్రారంభం నుంచే కొన్ని రైలు సేవలను పునఃప్రారంభించే అవకాశం ఉంది.  అయితే, దీనికి కేవలం రైల్వే శాఖల మధ్య ఒప్పందం సరిపోదు. విదేశీ వ్యవహారాలు, హోం శాఖలతో పాటు సంబంధిత ఇతర మంత్రిత్వ శాఖల అనుమతులు కూడా అవసరం. అందుకే తుది నిర్ణయం రాజకీయ స్థాయిలోనే తీసుకోనున్నారు.

ప్రయాణికులకు ఊరట

భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఈ రైలు సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ముఖ్యంగా కోల్‌కతా, ఢాకా, ఖుల్నా, న్యూ జల్పైగురి ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఇవి సౌకర్యవంతమైన మార్గంగా నిలిచాయి. రెండేళ్లకు పైగా నిలిచిపోయిన ఈ సేవలపై ఇప్పుడు అధికారికంగా చర్చలు ప్రారంభం కావడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.

Read Also: ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

Tags

Related News

నల్లగొండలో హైటెక్ బస్టాండ్.. ఏకంగా రూ. 54 కోట్లతో నిర్మాణం!

హోస్టెస్, వైఫై, టాయిలెట్.. ఈ ఆర్టీసీ బస్సును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

Big Stories

Advertisement
×