iPhone 17 Price Hike: సాధారణంగా కొత్త ఐఫోన్ వస్తే పాత మోడళ్ల ధరలు తగ్గుతాయని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. కానీ, యాపిల్ కంపెనీ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఆలోచించింది. మార్కెట్లోకి iPhone 18 Pro సిరీస్ రాగానే.. గత ఏడాది వచ్చిన iPhone 17 సిరీస్ ధరలను భారీగా పెంచేసి అందరికీ పెద్ద షాకిచ్చింది. అసలే భారతదేశంలో ఐఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏకంగా రూ.65,000 వరకు రేట్లు పెరగడంతో యాపిల్ ప్రియులు కంగుతింటున్నారు. ఇంతకీ ఏ ఫోన్ రేటు ఎంత పెరిగింది? ఏవి మార్కెట్ నుంచి మాయమయ్యాయో.. ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 17 బేసిక్ మోడల్ 256GB ధర అప్పట్లో రూ.82,900 ఉండేది. కానీ ఇప్పుడు దీనిపై రూ.17,000 పెంచడంతో దీని కొత్త ధర రూ.99,900కి చేరింది. ఇక 512GB వేరియంట్ విషయానికి వస్తే.. ఇది పాత ధర రూ.99,900 నుంచి ఏకంగా రూ.1,24,900కి పెరిగింది. త్వరలో రాబోయే 1TB మోడల్ ధరలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడానికే భయంగా ఉంది.
Also Read: iPhone 18 Pro వచ్చేసింది భయ్యా.. ఏకంగా 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో యాపిల్ సంచలనం!
యాపిల్ విడుదల చేసిన అత్యంత పలుచని ఫోన్‌గా పేరు తెచ్చుకున్న ఐఫోన్ ఎయిర్ ధర అయితే మరీ దారుణంగా పెరిగింది. ఈ ఫోన్ 1TB వేరియంట్ లాంచ్ అయినప్పుడు రూ.1,59,900 ఉండగా.. ఇప్పుడు దాని ధరను రూ.2,24,900కి పెంచేశారు. అంటే.. ఒక్కసారిగా రూ.65,000 పెంచారన్నమాట. యాపిల్ చరిత్రలోనే భారత్‌లో ఇంత పెద్ద మొత్తంలో ధర పెంచడం ఇదే మొదటిసారేమో. ఇక ఇదే సిరీస్‌లోని మిగతా వేరియంట్ల ధరలు కూడా భారీగానే పెరిగాయి.
సాధారణ బడ్జెట్‌లో యాపిల్ ఫోన్ కోరుకునే వారి కోసం ఈ ఏడాది మార్చిలో ఐఫోన్ 17eని తీసుకొచ్చారు. అప్పట్లో దీనిని రూ.64,900లకే లాంచ్ చేశారు. కానీ, ఇప్పుడు దీని ధరను రూ.20,000 పెంచేసి రూ.84,900కి చేర్చారు. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు యాపిల్ ఫోన్ కొనే కల మరింత దూరమయ్యేలా కనిపిస్తోంది. సాధారణ ఐఫోన్లకు, దీనికి మధ్య ఉన్న ధరల తేడా కూడా చాలా వరకు తగ్గిపోయింది.
కొత్త iPhone 18 Pro సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురాగానే.. కంపెనీ పాత iPhone 17 Pro, Pro Max మోడళ్లను ఆన్లైన్ స్టోర్ నుంచి పూర్తిగా తొలగించేసింది. ప్రతిసారీ కొత్త ప్రో ఫోన్లు రాగానే పాత ప్రో మోడళ్లను నిలిపివేయడం యాపిల్ కంపెనీకి మామూలే. కాకపోతే నాన్-ప్రో మోడల్స్‌ను మాత్రం ఉంచి, వాటి ధరలను విపరీతంగా పెంచేసింది. ఇప్పటికే జపాన్ వంటి దేశాల్లోనూ ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్.. ఇప్పుడు భారత్‌లోనూ అదే బాట పట్టింది.
Also Read: టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!