E-Paper
Advertisement

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..
Advertisement

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు పతనమవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో మదుపరులు అటువైపు మొగ్గుచూపారు. ఫలితంగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. బంగారం మాదిరిగా వెండి రేట్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 10న అంటే గురువారం తెలుగు రాష్ట్రాలతోపాటు మెట్రో నగరాల్లో ధరలను పరిశీలిద్దాం.

పసిడి ప్రియులకు పంగడే

అంతర్జాతీయ పరిణామాలు బులియన్ మార్కెట్‌పై పడింది. ఫలితంగా రోజు రోజుకూ బంగారం-వెండి ధరలు పతనమవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, అదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో పెట్టుబడుదారుల ఆయిల్ వైపు దృష్టిసారించారు. ఫలితంగా బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ విలువ వంటి అంశాలు బంగారం ధరపై పడింది. వెండి గతవారం నుంచి స్థిరంగా కొనసాగుతోంది.

దిగొస్తున్న లోహాల ధరలు

Advertisement

బుధవారం భారీగా దిగివచ్చిన గోల్డ్ రేట్లు ఈరోజు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 23 డాలర్లు పెరిగి 4417 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.64 శాతం పెరిగి 67 డాలర్లను దాటేసింది.హైదరాబాద్‌, విజయవాడ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా తగ్గాయి. అంతకుముందు స్వల్పంగా పెరగడంతో ఆందోళన చెందినవారికి ఒక్కరోజులో రిలీఫ్ లభించింది. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులం రూ.1040 మేరా తగ్గి రూ.1,54,310 వద్దకు దిగివచ్చింది. 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.950 మేరా తగ్గి రూ.1,41,450 వద్దకు చేరుకుంది.

వెండి ధర గడిచిన వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద ట్రేడవుతోంది.ధరల పతనం అనేది ఎన్నిరోజులు ఉంటుందని ఎవరూ అంచనా వేయలేమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలపై స్పష్టత రావడం లేకపోవడంతో బంగారం ధరలో మార్పులు జరగొచ్చని అంటున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు

Advertisement

దేశంలోని ప్రధాన నగరాల్లో బులియన్ ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్లు 10 గ్రాములు మేలిమి బంగారం రూ. 1,54,450 ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,41,590 వద్ద కొనసాగుతోంది. ముంబై, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1,54,300 ఉండగా, 22 క్యారెట్ల బంగారం అయితే రూ. 1,41,440 వద్ద కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు మార్కెట్ ఓపెన్ తర్వాత ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి. వెండి ధరలు కూడా పరిశీలిద్దాం. ఢిల్లీలో కేజీ వెండి రూ.2,49,900 ప్రస్తుతం ఉంది. చెన్నైలో ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.

ALSO READ: ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

Related News

ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే

ఎక్కువ షుగర్, సాల్ట్ ఉన్న ఫుడ్ ప్యాకెట్స్‌పై వార్నింగ్ లేబుల్స్ స్పష్టంగా ఉండాలి.. వినియోగదారుల డిమాండ్

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్, బుకింగ్ సమయం తగ్గింపు

Big Stories

Advertisement
×