E-Paper
Advertisement

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!
Advertisement

Huawei FreeBuds 7: టెక్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త గ్యాడ్జెట్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ టెక్ కంపెనీ హువాయి మార్కెట్లోకి కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. అవే Huawei FreeBuds 7. కేవలం పాటలు వినడానికే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఎన్నో అధునాతన ఫీచర్లతో చైనాలో వీటిని లాంఛ్ చేశారు. సాధారణ యూజర్లను దృష్టిలో పెట్టుకుని వీటిని చాలా తేలికపాటి డిజైన్‌తో తయారు చేశారు.

ఏఐ చిప్‌తో అదిరిపోయే పవర్:

ఈ Huawei FreeBuds 7లో కంపెనీ కొత్తగా మూడో తరానికి చెందిన ఆడియో ఏఐ చిప్‌ను అందించింది. దీనివల్ల పాత మోడల్స్‌తో పోలిస్తే రెట్టింపు పనితీరు ఉంటుందని కంపెనీ చెబుతోంది. కాల్స్ మాట్లాడే సమయంలో చుట్టుపక్కల ఉండే శబ్దాన్ని సెకనుకు 4 లక్షల సార్లు శాంపిల్ చేస్తుంది. కేవలం 8 మైక్రోసెకన్లలోనే నాయిస్ ప్రాసెసింగ్ జరిగిపోతుంది. దీనివల్ల ట్రాఫిక్ లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా అవతలి వాళ్లకు మన గొంతు స్పష్టంగా వినిపిస్తుంది.

Advertisement

Also Read: గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

స్పష్టమైన కాల్స్ కోసం వీపీయూ టెక్నాలజీ:

ఫోన్ మాట్లాడేటప్పుడు చుట్టూ వచ్చే సౌండ్స్‌ను అడ్డుకోవడానికి ఇందులో మూడు మైక్రోఫోన్లు, వీపీయూ కాల్ నాయిస్ రిడక్షన్ సిస్టమ్ ఇచ్చారు. గంటకు 8 మీటర్ల వేగంతో గాలి వీస్తున్నా సరే గాలి శబ్దం ఇబ్బంది పెట్టకుండా ఏఐ డిఎన్ఎన్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు ఇటువైపు, అటువైపు కూడా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ రాకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

స్మార్ట్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం:

Advertisement

Huawei FreeBuds 7లో మరో ముఖ్యమైన ఫీచర్ స్మార్ట్ ట్రాన్స్‌లేషన్. వేర్వేరు భాషల్లో మాట్లాడుకునేటప్పుడు ఇది టూ-వే ట్రాన్స్‌లేషన్‌లా పనిచేస్తుంది. ముఖ్యంగా చైనీస్, ఇంగ్లీష్ భాషలకు సంబంధించి ఆఫ్‌లైన్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం కూడా ఉంది. విదేశాలకు వెళ్లేవాళ్లకు లేదా వేరే భాషల వాళ్లతో మాట్లాడేవాళ్లకు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

42 గంటల బ్యాటరీ బ్యాకప్:

ఇక డిజైన్ విషయానికి వస్తే.. ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 4.3 గ్రాములు మాత్రమే ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే.. దీని పరిమాణం 15% వరకు తగ్గించారు. ఛార్జింగ్ కేస్ కూడా చాలా చిన్నగా, పాకెట్‌లో ఇమిడిపోయేలా తయారు చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 8.5 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే 5 గంటల బ్యాకప్ వస్తుంది. ఇక ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 42 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని హువాయి వెల్లడించింది. ప్రస్తుతం చైనాలో దీని ధర రూ.14,000 వరకు ఉంది. భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

Tags

Related News

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s లుక్ ట్రెండ్.. ChatGPTలో ఈ ప్రాంప్ట్‌ తో మీ ఫోటోనూ మార్చుకోండిలా!

ఫోన్ ఛార్జర్‌పై Qi గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఇంత అర్థం ఉందా!

మీ ఫోన్‌లోనూ హిడెన్ యాప్స్ ఇన్‌స్టాల్ అయ్యాయేమో ఇలా చెక్ చేసుకోండి!

Big Stories

Advertisement
×