E-Paper
Advertisement

iPhone 18 Pro వచ్చేసింది భయ్యా.. ఏకంగా 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో యాపిల్ సంచలనం!

iPhone 18 Pro వచ్చేసింది భయ్యా.. ఏకంగా 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో యాపిల్ సంచలనం!
Advertisement

iPhone 18 Pro Max: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న iPhone 18 Pro, iPhone 18 Pro Max ఫోన్లను కంపెనీ అఫీషియల్‌గా మార్కెట్లోకి తెచ్చేసింది. ఈసారి ఎలాంటి బేసిక్ మోడల్స్ జోలికి వెళ్లకుండా నేరుగా Pro సిరీస్‌తోనే యాపిల్ అదరగొట్టింది. రోజువారీ వాడకానికి అనుకూలంగా ఉండేలా డిజైన్ నుంచి బ్యాటరీ దాకా ప్రతి విషయంలోనూ భారీ మార్పులు చేశారు. చూడటానికి అద్భుతమైన లుక్‌తో పాటు సరికొత్త ఫీచర్లు ఈ ఫోన్ల ప్రత్యేకతగా నిలిచాయి. ఇప్పుడీ ఫోన్ల పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

ధరలు, స్టోరేజ్ ఆప్షన్లు:

ఈ కొత్త iPhone 18 Pro ప్రారంభ ధర సుమారు రూ.1,02,500 ఉండగా.. Pro Max మోడల్ ధర రూ.1,11,100 నుంచి మొదలవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే అటూఇటూగా రూ.1,14,000 నుంచి రూ..1,23,000 వరకు పలకవచ్చు. సామాన్యులకు ఇది కాస్త ఎక్కువే అనిపించినా.. యాపిల్ లవర్స్ మాత్రం ఈ రేటును లెక్కచేయరు. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్లు కూడా పావు టెరాబైట్ అంటే 256GB బేసిక్ వేరియంట్‌‌తో పాటు 512GB, 1TB, ఏకంగా 2TB వరకు హైఎండ్ స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

చిన్నదైన డైనమిక్ ఐలాండ్:

Advertisement

ఫోన్ ముందు భాగంలో చూస్తే గతంలో కంటే డైనమిక్ ఐలాండ్ సైజును గణనీయంగా తగ్గించారు. దీనివల్ల స్క్రీన్ మరింత స్పేస్‌తో చూడటానికి ఎంతో క్లీన్‌గా కనిపిస్తుంది. iPhone 18 Pro మోడల్ 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇక పెద్ద స్క్రీన్ కోరుకునే వారి కోసం Pro Max మోడల్ దాదాపు 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తోంది. చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీలింగ్ వచ్చేలా డిజైన్ తీర్చిదిద్దారు. బాక్స్ నుంచి బయటకు తీయగానే ఇవి సరికొత్త ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి.

Also Read: బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

ఏ20 ప్రో చిప్‌సెట్:

Advertisement

ఫోన్ లోపల కంపెనీ సొంతంగా తయారు చేసిన సరికొత్త 2 నానోమీటర్ల ఏ20 ప్రో చిప్‌ను అమర్చారు. ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్ ప్రాసెసర్లలో ఇదే అత్యంత వేగవంతమైనదిగా యాపిల్ చెబుతోంది. దీనిలో 6 సీపీయూ కోర్లు, 7 జీపీయూ కోర్లు ఉండటంతో గేమింగ్, మల్టీ టాస్కింగ్ ఎంతో స్మూత్‌గా సాగుతాయి. దీనికి తోడు కంపెనీ సొంత సీ2 మోడమ్ కూడా ఉండటంతో నెట్వర్క్ కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. Siri, AI ఫీచర్లు ఈ ప్రాసెసర్ సాయంతో మరింత వేగంగా పనిచేస్తాయి.

అద్భుతమైన కెమెరా సెటప్:

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈసారి కెమెరా డిపార్ట్‌మెంట్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, మరో 48MP అల్ట్రావైడ్ లెన్స్, అలాగే 2ఎక్స్ జూమ్ అందించే 48MP టెలిఫోటో కెమెరాను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 18MP సెంటర్ స్టేజ్ కెమెరాను పొందుపరిచారు. ఈ కెమెరా సెటప్ ద్వారా రాత్రి సమయంలోనూ, మూవ్‌మెంట్‌లోనూ అద్భుతమైన క్లారిటీతో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.

ఎవరూ ఊహించని బ్యాటరీ లైఫ్:

ఐఫోన్ బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉంటుందనే అపవాదును ఈసారి యాపిల్ పూర్తిగా తొలగించే ప్రయత్నం చేసింది. ఇప్పటివరకు ఐఫోన్లలో లేని అతిపెద్ద బ్యాటరీలను ఈ మోడళ్లలో వాడారు. iPhone 18 Pro సింగిల్ ఛార్జ్‌తో దాదాపు 36 గంటల పాటు నిరంతరం వీడియో ప్లేబ్యాక్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. ఇక Pro Max మోడలైతే ఏకంగా 45 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. సాధారణ వాడకంలో ప్రో 24 గంటలు వస్తే.. ప్రో మాక్స్ ఏకంగా 30 గంటల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా పనిచేస్తుంది.

Also Read: వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

Tags

Related News

యాపిల్ బిజినెస్ స్ట్రాటజీ.. iPhone 18 రాకతో పాత ఫోన్ల రేట్లను రూ.65,000 వరకు పెంచేసింది!

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

Big Stories

Advertisement
×