E-Paper
Advertisement

యాపిల్ ఫ్యాన్స్‌కు పండగే.. iPhone 17పై ఊహించని డిస్కౌంట్, ఎక్కడో తెలుసా?

యాపిల్ ఫ్యాన్స్‌కు పండగే.. iPhone 17పై ఊహించని డిస్కౌంట్, ఎక్కడో తెలుసా?
Advertisement

iPhone 17 Price Drops: చాలామందికి ఐఫోన్ తీసుకోవాలని ఆశ ఉన్నా.. దాని రేటు చూసి అబ్బో.. మనకెందుకులే అని ఆగిపోతుంటారు. ఇలాంటి వారి కోసమే విజయ్ సేల్స్ ఒక క్రేజీ ఆఫర్‌ను పట్టుకొచ్చింది. గతేడాది మార్కెట్లోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్న iPhone 17 ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఫీచర్లు అదిరిపోవడం ఒకెత్తయితే.. ఈ రేటుకు రావడం మరో విశేషం. మరి ఆ ఆఫర్ ఏంటి? ఎలా కొంటే తక్కువకు వస్తుందో చూద్దామా..

ఆఫర్ల వివరాలు ఇలా..

సాధారణంగా iPhone 17 (256GB మోడల్) అసలు ధర రూ.82,900 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు విజయ్ సేల్స్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఇది రూ.80,390కే లిస్టైంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మీరు గనుక HSBC క్రెడిట్ కార్డ్ కొనుగోలు చేస్తే.. అదనంగా మరో రూ.4,500 డిస్కౌంట్ కొట్టేయొచ్చు. ఇప్పుడు అన్ని ఆఫర్లు కలిపితే ఈ ఫోన్ జస్ట్ రూ.75,890కే వచ్చేస్తుంది. ఇందులో వైట్, బ్లాక్ కాకుండా.. సేజ్, లావెండర్ లాంటి కొత్త రంగులు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: 144Hz డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ సెన్సార్‌తో రానున్న Vivo X500 సిరీస్.. ఫీచర్లు అదరహో!

3000 నిట్స్ బ్రైట్‌నెస్..

iPhone 17 డిస్‌ప్లే విషయంలో యాపిల్ ఎక్కడా తగ్గలేదు. ఇందులో 6.3 అంగుళాల స్క్రీన్‌ను వాడారు. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక 3000 నిట్స్ బ్రైట్‌నెస్ అంటే మామూలు విషయం కాదు.. మిట్ట మధ్యాహ్నం ఎండలో బయట నిలబడి ఫోన్ చూసినా కూడా అక్షరాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. వీడియోలు చూసేటప్పుడు ఆ కలర్స్, క్వాలిటీకి ఆశ్చర్యపోవాల్సిందే.

వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం..

Advertisement

ఫోన్ వాడేటప్పుడు అది హ్యాంగ్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటాం కదా. ఇందులో ఉండే A19 ప్రాసెసర్ ఆ పనిని చక్కబెడుతుంది. గేమ్స్ ఆడినా, పెద్ద పెద్ద యాప్స్ వాడినా ఈ ఫోన్ అస్సలు స్లో అవ్వదు. ఇక ఐఓఎస్ 26 సాఫ్ట్‌వేర్ ఉండటంతో ఫీచర్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే ఒకసారి ఛార్జింగ్ పెడితే రోజంతా వాడుకోవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం మరో ప్లస్ పాయింట్.

తక్కువ ధరలో బ్రాండెడ్ ఫోన్..

ఐఫోన్ 17లో వెనుక వైపు రెండు 48MP కెమెరాలను ఇచ్చారు. దీంతో ఫొటోలు తీసేటప్పుడు చెయ్యి కొంచెం వణికినా సరే.. దీనిలో ఉన్న OIS ఫీచర్ వల్ల ఫొటోలు చాలా నీట్‌గా, షార్ప్‌గా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఫోన్, అది కూడా ఐఫోన్ కావాలనుకునే వారికి ఇది నిజంగా సూపర్ డీల్ అని చెప్పొచ్చు.

Also Read: యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. iPhone 18 Pro కెమెరా చూస్తే షాక్ అవ్వాల్సిందే, ఫొటోలు లీక్!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×