E-Paper
Advertisement

డిజిట్ జనగణన షురూ.. ఆన్ లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

డిజిట్ జనగణన షురూ.. ఆన్ లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Census Self Enumeration: జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది. దీంతో వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

సెల్ఫ్ ఎన్యుమరేషన్..

జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ సీహెచ్. ప్రియాంకతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Also read: Telangana Govt: తెలంగాణలో మహిళలకు శుభవార్త.. ఉచితంగా కుట్టు మిషన్లు

నమోదు విధానం ఇలా.. 

సెన్సెస్ ప్రక్రియ దశలవారీగా సాగనుంది. తొలుత ‘హౌస్‌ లిస్టింగ్‌’ చేపడతారు. ఇల్లు, గుడిసె, అపార్ట్‌మెంట్‌, విద్యాసంస్థలు ఇలా అన్నింటినీ గుర్తించి ప్రత్యేక నెంబర్లను కేటాయిస్తారు. ఆ తర్వాతే వ్యక్తి గత సమాచార సేకరణ ఉంటుంది. స్వీయ నమోదు చేసుకున్న వారు తమకు వచ్చే ఐడీని ఎన్యూమరేటర్లకు అందజేస్తే, వారు పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలకమని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలు

Advertisement

హైదరాబాద్‌ నగరాన్ని మొత్తం 21,866 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించినట్లు తెలిపారు. నగరంలో విద్యావంతులు ఎక్కువ కాబట్టి, అధిక శాతం మంది ఆన్‌లైన్‌లో స్వీయ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రక్రియలో ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, అదనపు అధికారులుగా సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు పర్యవేక్షించనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలంటే జనగణన విజయవంతం కావడం అవసరమని, ప్రజలంతా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Also Read: Gundeninda GudiGantalu Weekly episode: ప్రభాకు మైండ్ బ్లాక్.. సత్యం కోసం బాలు కన్నీళ్లు.. రోహిణి గతం బయటపడిందా..?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×