E-Paper
Advertisement

iPhone 17e: 2026లో యాపిల్ నుంచి షాకింగ్ సర్‌ప్రైజ్.. భారత్‌లో రూ.65,000కే ఐఫోన్ 17e లాంచ్!

iPhone 17e: 2026లో యాపిల్ నుంచి షాకింగ్ సర్‌ప్రైజ్.. భారత్‌లో రూ.65,000కే ఐఫోన్ 17e లాంచ్!
Advertisement

iPhone 17e: యాపిల్ నుంచి 2026లో విడుదల కానున్న తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 17e టెక్ ప్రపంచంలో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘e’ వేరియంట్‌ను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో యాపిల్ ఉందని తాజా లీకులు సూచిస్తున్నాయి. ప్రీమియం ఐఫోన్ అనుభవాన్ని బడ్జెట్‌కు దగ్గరగా తీసుకురావడమే ఈ మోడల్ లక్ష్యమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ధర, విడుదలపై అంచనాలు:

తాజా లీకుల ప్రకారం.. iPhone 17e ధర సుమారు రూ. 65,000 వరకు ఉండొచ్చని సమాచారం. ఇది ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లతో పోలిస్తే, కొంత అఫోర్డబుల్‌గా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక లాంచ్ విషయానికొస్తే.. 2026 ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఫోన్‌ను యాపిల్ ఆవిష్కరించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలే కావడంతో, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Also Read: ఇక గ్యాలరీతో పని లేదు.. ఒక్క క్లిక్‌తో డైరెక్ట్‌గా వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు!

కెమెరా ఫీచర్లు:

ఐఫోన్ 17eలో 48MP రియర్ కెమెరా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. దీనికి OIS (Optical Image Stabilization) సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒకే కెమెరా సెటప్ ఉన్నప్పటికీ, యాపిల్ ఇమేజ్ ప్రాసెసింగ్ కారణంగా ఇది ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వగలదని అంచనా. అలాగే ముందుభాగంలో 18MP ఫ్రంట్ కెమెరా అందించే అవకాశముందని టెక్ వర్గాల అంచనా.

డిస్‌ప్లే, బ్యాటరీ విషయానికొస్తే..

Advertisement

2026లో రాబోతున్న ఈ అఫోర్డబుల్‌ ఐఫోన్.. 6.1 అంగుళాల OLED స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో రావొచ్చని సమాచారం. అలాగే పనితీరును మరింత బలంగా మార్చేందుకు A19 చిప్‌సెట్, 8GB RAM, 256GB స్టోరేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఐఫోన్‌లో సుమారు 4005mAh బ్యాటరీ ఇవ్వొచ్చని అంచనా. ముఖ్యంగా, ఈసారి MagSafe ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులోకి రానుందన్న వార్తలు ఐఫోన్ అభిమానులను మరింత ఆకర్షిస్తున్నాయి.

Also Read: ఐఫోన్ చరిత్రలోనే అతిపెద్ద మార్పు.. 2027లో ఫుల్ స్క్రీన్ డిజైన్‌తో కొత్త ఐఫోన్‌ను తీసుకురానున్న యాపిల్!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×