E-Paper
Advertisement

Whatsapp New Feature: ఇక గ్యాలరీతో పని లేదు.. ఒక్క క్లిక్‌తో డైరెక్ట్‌గా వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు!

Whatsapp New Feature: ఇక గ్యాలరీతో పని లేదు.. ఒక్క క్లిక్‌తో డైరెక్ట్‌గా వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు!
Advertisement

Whatsapp New Feature: యూజర్ల మెసేజింగ్ అనుభవాన్ని మరింత సులభంగా, వేగంగా మార్చే దిశగా వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, వినియోగదారులను ఆకట్టుకునే వినూత్న ఫీచర్లను మెటా పరిచయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫొటోలు, వీడియోలను పంపే విధానాన్ని మరింత సింపుల్‌గా మార్చే కొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా తాజాగా వెల్లడించింది. ఈ అప్‌డేట్‌తో మీడియా షేరింగ్ మరింత ఈజీగా, వేగంగా మారనుంది.

ప్రస్తుతం బీటా వెర్షన్‌లో:

వాట్సప్ తీసుకురానున్న ఈ కొత్త అప్‌డేట్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో పరీక్ష దశలో ఉంది. ఈ ఫీచర్ అమల్లోకి వచ్చిన తర్వాత మీడియా షేర్ చేయడానికి ప్రత్యేకంగా గ్యాలరీ యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. యాప్‌లో నుంచే నేరుగా ఫొటోలు, వీడియోలను సెలెక్ట్ చేసి పంపేలా ఈ కొత్త సిస్టమ్‌ను రూపొందించారు. ప్రస్తుతం కొందరు బీటా యూజర్లకు మాత్రమే ఇది కనిపిస్తుండగా, త్వరలోనే సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి రావచ్చు.

Advertisement

Also Read: ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ఫోన్లో ఒకటి కంటే ఎక్కువ వాట్సప్ అకౌంట్లు!

ఒక్క క్లిక్‌తో షేరింగ్:

రాబోయే ఈ కొత్త ఫీచర్‌తో గ్యాలరీ యాప్‌కు వెళ్లాల్సిన పని లేకుండా.. వాట్సప్‌లోనే ఫొటోలు, వీడియోలను చూసి ఒక్క ట్యాప్‌తో షేర్ చేయవచ్చు. ముఖ్యంగా అత్యవసర సమయంలో లేదా వేగంగా కంటెంట్ పంపాల్సిన సందర్భాల్లో ఈ అప్‌డేట్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ న్యూ ఇంటర్‌ఫేస్ యూజర్లకు కనిపించేలా డిజైన్ చేశారు.

అందుబాటులోకి ఎప్పుడంటే? 

Advertisement

ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ను అన్ని పరీక్షలు పూర్తయ్యాక దశలవారీగా యూజర్లకు విడుదల చేయనున్నారు. అంచనాల ప్రకారం.. వచ్చే ఏడాది ప్రారంభంలో జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో రెగ్యులర్ వాట్సప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Also Read: మెసేజింగ్ యాప్స్‌కు కేంద్రం ఆదేశాలు.. సిమ్‌ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×