E-Paper
Advertisement

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!
Advertisement

OnePlus 16: రోజంతా నాన్‌స్టాప్‌గా ఫోన్ స్క్రోల్ చేయడం వలన ఏ క్షణంలో బ్యాటరీ అయిపోతుందోనని ప్రతిసారీ ఛార్జర్ వెతుక్కోవడం మనలో చాలామందికి అలవాటే. కానీ, ఇప్పుడీ ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టేందుకు చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి ఒక అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది. వన్‌ప్లస్ 16 పేరుతో రానున్న మోడల్ గురించి వస్తున్న లీక్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే.

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో 5000mAh బ్యాటరీ ఉంటేనే పెద్ద విషయంగా భావిస్తాం. కానీ ఈ సరికొత్త వన్‌ప్లస్ 16 మోడల్‌లో నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా 9000mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇస్తున్నారట. దీన్ని మేనేజ్ చేయడానికి ఓపెటో ప్రత్యేకంగా తక్కువ వోల్టేజ్ డిశ్చార్జ్ చిప్‌ను కూడా వాడుతోందని సమాచారం. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఏకంగా 185Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్న 6.78-అంగుళాల BOE డిస్‌ప్లే గేమర్స్‌కి, వీడియో లవర్స్‌కి సరికొత్త అనుభూతిని పంచుతుంది. స్క్రీన్ స్క్రీలింగ్ చాలా స్మూత్‌గా సాగిపోతుంది.

Advertisement

Also Read: టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

ఇక ఫోన్ ఇన్‌సైడ్ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. క్వాల్కమ్ బ్రాండ్ నుంచి వస్తున్న అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్‌ను ఇందులో వాడుతున్నారు. చైనాలో లాంచ్ అయ్యే వెర్షన్‌లో లేటెస్ట్ కలర్‌ఓఎస్ 17 సాఫ్ట్‌వేర్ ఉండనుంది. దీంతో ఫోన్ వేగం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని హెవీ యాప్స్ రన్ అవుతున్నప్పటికీ.. ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వకుండా అత్యంత వేగంగా పనిచేస్తుంది.

Advertisement

ఫొటోగ్రఫీ పిచ్చి ఉన్న కోసం కంపెనీ ఈసారి ఏ మాత్రం రాజీ పడకుండా ప్లాన్ చేసింది. ఫోన్ వెనుక భాగంలో ప్రధాన కెమెరాగా ఏకంగా 200MP సెన్సార్‌ను ఇస్తున్నారు. దీనికి తోడుగా మరో రెండు 50MP లెన్స్‌లు (అల్ట్రావైడ్, పెరిస్కోప్ టెలిఫోటో) జతవుతున్నాయి. ఇక సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు కూడా 50MP పవర్‌ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అత్యంత స్పష్టమైన, అద్భుతమైన ఫొటోలు ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ 16 ఫోన్ లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ.. అక్టోబర్ నెలలో ఇది ముందుగా చైనా మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా కరెన్సీలో దీని ప్రారంభ ధర సుమారు 4,999 యువాన్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో ఇది రూ.71,000 వరకు ఉండవచ్చు. అయితే భారత్‌లో అధికారికంగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనే దానిపై క్లారిటీ రావడానికి మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Also Read: భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

Tags

Related News

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

Big Stories

Advertisement
×