E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  కాంచన ఇంటికి వచ్చిన దక్షిణమూర్తి వాళ్లతో మాట్లాడుతుండగానే శివనారాయణ, దశరథ, సుమిత్ర వస్తారు. అక్కడ దక్షిణమూర్తిని చూసి శివనారాయణ వాళ్లు శివనారాయణ వాళ్లు రావడం చూసి కార్తీక్‌ వాళ్లు షాక్‌ అవుతారు. దక్షిణమూర్తి మాత్రం శివనారాయణను చూసి నేను ఎవరితో అయితే క్షమాపణ చెప్పించమని అడిగానో ఆ వ్యక్తే ఇక్కడకు వచ్చాడు.. నా పని నీ పని ఇంకా తేలిక అయిపోయింది కార్తీక్‌. నువ్వు ఆయనతో మాట్లాడి చెప్పించు కార్తీక్‌ నేను బయట వెయిట్‌ చేస్తుంటాను అంటూ వెళ్లిపోతాడు.

దక్షిణమూర్తి వాళ్లను తాము పిలవలేదని వాళ్లే వచ్చారని శ్రీధర్‌ చెబితే మేము ఎవరు పిలిచారని అడగలేదు కదా మీ ఆత్మీయులు కాబట్టి మీ ఇంటికి వస్తుంటారు పోతుంటారు. మీరు కాఫీలు టీ ఇస్తుంటారు అవన్నీ మాకెందుకు మేము వచ్చింది మీతో మాట్లాడటానికి కాదు బంధాలు తెంచుకోవడానికి అంటూ శివనారాయణ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.

Advertisement

కట్‌ చేస్తే.. బయట నిలబడి ఉన్న సూరజ్‌ జ్యోత్స్న గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే శౌర్య, కార్తీక్‌ ఫోన్‌ తీసుకుని జ్యోత్స్నకు వీడియో కాల్ చేసి నీకో సర్‌ప్రైజ్‌ ఉంది అంటూ వెళ్లి సూరజ్‌ను చూపిస్తుంది. ఫోన్‌ సూరజ్‌ చేతిలో పెట్టి ఇద్దరూ మాట్లాడుకోండి అంటూ వెల్లిపోతుంది. సూరజ్‌, జ్యోత్స్న ఒకరిని ఒకరు చూసుకుని షాక్‌ అవుతారు. అప్పుడే జ్యోత్స్న మా ఇంటికి తప్పిపోయి వచ్చినట్టే అక్కడకు తప్పిపోయి వెళ్లావా అని అడుగుతుంది. సూరజ్‌ కోపంగా చూస్తూ.. మా తాతకు సాయంగా వచ్చాను అంటూ వెళ్లి ఫోన్‌ శౌర్యకు ఇచ్చేస్తాడు సూరజ్‌. శౌర్య తమ ఇంటికి వచ్చిన దక్షిణమూర్తి, శివనారాయణ గురించి చెప్తుంది. వాళ్లిద్దరూ అక్కడకు వెళ్లారంటే ఏదో పెద్ద గొడవే జరుగుతున్నట్టు ఉంది అనుకుంటుంది జ్యోత్స్న.

శివనారాయణ తాను తీసుకొచ్చిన చెక్ తీసి దీపకు ఇస్తూ.. నిన్ను సీఈవోగా తీసేస్తున్నాము.. అగ్రిమెంట్‌ ప్రకారం ఎవరైనా నిన్ను సీఈవోగా తీసేస్తే పదికోట్లు ఇవ్వాలి కదా అదే ఈ చెక్‌ అంటూ చెప్పగానే.. దీప చెక్‌ తీసుకుంటుంది. కార్తీక్‌ తమకు డబ్బులు ఏమీ వద్దని చెక్‌ తీసుకుని చింపేస్తాడు. శివనారాయణ మాత్రం చెక్ చింపేసినా పర్వాలేదు. ఎప్పుడు డబ్బులు కావాలనిపిస్తే అప్పుడు వచ్చి అడుగు ఇస్తాను అంటూ చెప్పి దశరథ, సుమిత్రను తీసుకుని వెళ్లిపోతుంటే.. సూరజ్‌, దక్షిణమూర్తి ఎదురుపడతారు. సూరజ్‌ను చూడగానే.. సుమిత్ర దగ్గరకు వెళ్లి గల్లా పట్టుకుని చెంప పగులగొడుతుంది. తన కూతురుకు ఇంత అన్యాయం చేస్తావా..? అంటూ నిలదీస్తుంది.

Advertisement

సుమిత్ర తేరుకుని చూస్తే అదంతా కలలా ఉంటుంది. ఎదురుగా నిలబడిన సూరజ్‌, దక్షిణమూర్తి నవ్వుతూ ఉంటారు. దక్షిణమూర్తి వెంటనే ఏం కార్తీక్‌ మీ తాతకు చెప్పావా..? నాకు క్షమాపణ చెప్పాలని అలాగైతే మన రెండు కుటుంబాలు కలుస్తాయని అనగానే.. శివనారాయణ కోపంగా దక్షిణమూర్తిని తిడతాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరూ కాలర్లు పట్టుకుని తోసుకుంటారు. ఆ తోపులాటలో దక్షిణమూర్తి షర్ట్‌ చిరిగిపోతుంది. శివనారాయణ నవ్వుతూ జీవితాంతం గుర్తు పెట్టుకో ఇది నేను వేసిన శిక్ష అంటూ కార్తీక్‌ను తిట్టి మీరంతా ఒక్కటే అని ఇప్పుడు అర్థం అవుతుంది. ఆరోజు సూరజ్‌ నీకు ఎందుకు థాంక్స్‌ చెప్పాడో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అంటూ వెల్లిపోతాడు శివనారాయణ.

శివనారాయణ కోపంతో మీరంతా ఒక్కటే అంటూ తిట్టడంతో కార్తీక్‌ షాక్‌ అవుతాడు. నిల్చున్న చోటే కూలబడిపోతాడు. మౌనంగా బాధపడుతుంటాడు. శ్రీధర్‌ మాత్రం మన దరిద్రం చూశావా ఎలా ఉందో వాళ్ల ఇంటి దగ్గర చోటు లేనట్టు మన ఇంటి దగ్గర గొడవపడ్డారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు మనల్ని దోషుల్ని చేస్తున్నారు. కార్తీక్‌ మనకు ఇవన్నీ అవసరమా అన్ని వదిలేసి ప్రశాంతంగా ఉందాం అంటాడు. కాంచన మాత్రం వదలొద్దని ఎక్కడైతే నీకు అవమానం జరిగింతో అక్కడే ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్లే నిన్ను గౌరవించాలి. మళ్లీ సీఈవోగా నా కొడలు అక్కడ అడుగుపెట్టాలి. అంటూ కాంచన చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Podarillu Today Episode : జయంతి తమ్ముడు అవమానం.. చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. జయంతి ప్లాన్ ఇదా..?

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో తిరుపతి.. ధీరజ్ ను తిట్టిన రామరాజు.. వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..

Ninnu kori Serial Today Episode September 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జగదీశ్వరికి ఫోన్ చేసిన విరాట్ – షాక్ అయిన షాలిని

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..

Thursday Movies in Tv : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×