E-Paper
Advertisement

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!
Advertisement

Flipkart Minutes: నేటి ఆధునిక యుగంలో ఏ చిన్న సామాను కావాలన్నా గంటల తరబడి ఎదురుచూసే రోజులు పోయాయి. క్షణాల్లో ఆర్డర్ ఇంట వాలిపోయేలా క్విక్ కామర్స్ దూసుకుపోతోంది. ఇప్పటికే మార్కెట్‌లో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్‌ల హవా నడుస్తుండగా.. తాజాగా ఈ పోటీలోకి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సరికొత్త అస్త్రంతో రంగంలోకి దిగింది. ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఒక చిన్న ఫీచర్‌గా ఉన్న Minutes సర్వీస్‌ను, ఇప్పుడు ఏకంగా ఒక సెపరేట్ యాప్‌గా లాంచ్ చేసింది. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే కస్టమర్ల డోర్‌స్టెప్‌కి సరుకులు చేరవేయడమే టార్గెట్‌గా ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లోకి వచ్చేసింది.

ప్రత్యేక యాప్‌గా Flipkart Minutes ఎంట్రీ:

ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్ మెయిన్ యాప్‌లో లోపలికి వెళ్లి మినిట్స్ సర్వీస్‌ను వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ ఇబ్బంది లేదు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా కేవలం 20MB సైజులో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. మెయిన్ యాప్‌తో సంబంధం లేకుండా కేవలం క్విక్ డెలివరీ కోసం మాత్రమే దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రాత్రిపూట ఎప్పుడైనా అత్యవసరంగా ఏదైనా కావాలంటే ఈ యాప్ ద్వారా క్షణాల్లో తెప్పించుకోవచ్చు.

Advertisement

Also Read: వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

కూరగాయలే కాదు.. గ్యాడ్జెట్స్ కూడా:

సాధారణంగా క్విక్ కామర్స్ యాప్‌లు అంటే పాలు, కూరగాయలు, కిరాణా సామాను మాత్రమే వస్తాయని అనుకుంటాం. కానీ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ దీనికి పూర్తిగా భిన్నంగా ఆలోచించింది. కూరగాయలు, బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌తో పాటు పార్టీలకు కావాల్సిన గిఫ్ట్‌లు, చాక్లెట్లు, ఫ్లవర్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎల్ఈడీ లైట్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సైతం కేవలం పది నిమిషాల్లో డెలివరీ చేయడం ఈ యాప్ ప్రత్యేకత.

భారీ నెట్‌వర్క్‌తో దూకుడు:

Advertisement

మార్కెట్లోకి కొత్తగా వచ్చినా సరే.. ఫ్లిప్‌కార్ట్ దీనికోసం చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 130కి పైగా నగరాల్లో వెయ్యికి పైగా మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దాదాపు 8 వేలకు పైగా పిన్ కోడ్ ప్రాంతాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. కేవలం కొన్ని రకాల వస్తువులతో ఆగిపోకుండా ఏకంగా 250కి పైగా కేటగిరీల ఉత్పత్తులను ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంచారు.

బ్లింకిట్, జెప్టోలకు అసలైన పోటీ:

మార్కెట్లో ఇప్పటికే పాతుకుపోయిన బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి పెద్ద కంపెనీలకు ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. క్షణాల్లో డెలివరీ కావాలని కోరుకునే నేటి తరం కస్టమర్ల నాడిని పట్టుకుని ఫ్లిప్‌కార్ట్ ఈ ముందడుగు వేసింది. రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇస్తుండటంతో యూజర్లు కూడా ఈ కొత్త యాప్‌ను తెగ వాడేస్తున్నారు.

Also Read: ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

Tags

Related News

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

Big Stories

Advertisement
×