E-Paper
Advertisement

Psycho Youtuber: రూ.10 లక్షల స్టూడియోకి నిప్పంటించిన యుట్యూబర్.. సబ్‌స్క్రైబర్స్ పెరగడంలేదని కోపం.. కానీ

Psycho Youtuber: రూ.10 లక్షల స్టూడియోకి నిప్పంటించిన యుట్యూబర్.. సబ్‌స్క్రైబర్స్ పెరగడంలేదని కోపం.. కానీ
Advertisement

Psycho Youtuber| సోషల్ మీడియా ఒక డిజిటల్ మాధ్యమం మాత్రమే కాదు. డబ్బు సంపాదించేందుకు, పేరు, గుర్తింపు పొందేందుకు ఒక అద్భుత ప్లాట్‌ఫామ్ కూడా. ముఖ్యంగా యుట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్లు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఆసక్తికర కంటెంట్ అప్‌లోడ్ చేస్తే ఆ క్రియేటర్ల ఛానెల్స్ సబ్‌స్క్రైబర్లు పెరుగుతారు. ఆ వీడియోలు ఎక్కువ మంది చూస్తే సదరు యుట్యూబర్లకు ఆదాయం వస్తుంది.

ఇది సులవైన మార్గంలా అనిపించడంతో గత కొంత కాలంగా చాలామంది యువత సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్లుగా మారుతున్నారు. కానీ కొందరు మాత్రమే విజయం సాధిస్తున్నారు. అందుకే ఒక విఫలమైన ఒక యువ యుట్యూబర్ తన వైఫ్యాలన్ని జీర్నించుకోలేక ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

Advertisement

27 ఏళ్ల యూట్యూబర్ తన ఇంట్లోని స్టూడియోను నిప్పు పెట్టాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గఢ్వా జిల్లాలో జరిగింది. నిప్పు వల్ల రూ.10 లక్షలకు పైగా సామగ్రి కాలిపోయింది. పోలీసులు, పొరుగువారు కలిసి అతని కుటుంబాన్ని సురక్షితంగా ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. కానీ స్టూడియో పూర్తిగా నాశనమైంది.

యూట్యూబర్ ఎవరు?

అతని పేరు విధాయక్ ప్రజాపతి. అతను డిజిటల్ ఎడిటింగ్, ఫిల్మింగ్ స్టూడియో నడిపేవాడు. అతని ఇంట్లోనే స్టూడియో ఉండేది. యూట్యూబర్‌గా విజయం సాధించాలని అతను కలలు కన్నాడు. దీని కోసం చాలా డబ్బు ఖర్చు చేశాడు. పెట్టుబడి కోసం వారసత్వంగా లభించిన భూమిని కూడా అమ్మేశాడు. ఈ స్టూడియోతో తనకు మంచి పేరు, ఆదాయం వస్తుందని ఆశించాడు. కానీ అతని యుట్యూబ్ ఛానెల్‌తో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు.

యూట్యూబ్ వైఫల్యంతో డిప్రెషన్

Advertisement

విధాయక్ స్నేహితులు, పొరుగువారు ఇచ్చిన సమాచారం ప్రకారం.. అతని యుట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్స్‌కు ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్స్ పెరగలేదు. ఈ వైఫల్యం అతని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. అతను మాట్లాడకుండా, ఒంటరిగా ఉండేవాడు. చాలా రోజులు ఒంటరిగా గడిపేవాడు. అతని ప్రవర్తన మారిపోయిందని అందరూ గమనించారు. చాలా ఒత్తిడితో, నీరసంగా కనిపించేవాడు. ఒత్తిడి పెరిగి డిప్రెషన్‌కు గురయ్యాడు. ఆశలు తీరకపోవడంతో నిరాశకు లోనయ్యాడు.

ఇంట్లో నిప్పు

రాత్రి 10 గంటల సమయంలో అతను తనను తాను స్టూడియోలో లాక్ చేసుకున్నాడు. తర్వాత స్టూడియోలో నిప్పు పెట్టాడు. పొగ త్వరగా ఇల్లంతా వ్యాపించింది. కుటుంబ సభ్యులు లోపల చిక్కుకున్నారు. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యులు సాయం కోసం గట్టిగా అరిచారు.

కుటుంబాన్ని పొరుగువారు, పోలీసులు

వారి అరుపులు విని పొరుగింటి వారు వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు త్వరగా అక్కడి చేరుకొని ఒక సైడ్ గోడను బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎవరికీ తీవ్ర గాయాలు లేవు. కానీ లోపల ఉన్న సామగ్రి అంతా నాశనమైంది.

ఎంత నష్టం?

నిప్పు వల్ల ఖరీదైన కంప్యూటర్లు, కెమెరాలు, సౌండ్ సిస్టమ్స్, లైట్లు అన్నీ కాలిపోయాయి. స్టూడియోలో ఆధునిక వీడియో ప్రొడక్షన్ సామగ్రి ఉండేది. ఇప్పుడు అన్నీ బూడిద అయ్యాయి. మొత్తం నష్టం రూ.10 లక్షలకు పైగా ఉంది. ఈ ఘటనతో విధాయక్ కుటుంబం ఆర్థిక సమస్యల్లో పడింది. ఆర్థికంగా తీవ్ర నష్టం జరగడంతో విధాయక్ కుటుంబం.. ప్రభుత్వం నుంచి సాయం కోరింది.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

పారిపోయిన యుట్యూబర్

నిప్పు పెట్టిన తరువాత గందరగోళంలో విధాయక్ వెనక గోడ దాటి పారిపోయాడు. మరుసటి రోజు బంధువులు అతన్ని కనుగొన్నారు. విధాయక్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అతని రాజధాని నగరం రాంచీకి తీసుకెళ్లారు. అక్కడ సైకియాట్రిక్ చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు అతని మానసిక స్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరిక

ఈ ఘటనతో కంటెంట్ క్రియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. విధాయక్ చాలా కష్టపడి పనిచేసేవాడని అతని కుటుంబం, స్నేహితులు చెప్పారు. కానీ సోషల్ మీడియాలో వ‌ృత్తిపరంగా రాణించడం అంత సులభం కాదు. వైఫల్యంతో చాలా మంది క్రియేటర్లు ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటి వ్యక్తులు డిప్రెషన్ బారిన పడితే సహాయం తీసుకోవాలి. ఫేమస్ అవడం కంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×