E-Paper
Advertisement

iPhone 17e: కొత్త మ్యాక్‌బుక్, ఐప్యాడ్, ఐఫోన్ 17e త్వరలోనే లాంచ్.. సరికొత్త ప్రొడక్ట్స్‌తో ఆపిల్ ఈవెంట్

iPhone 17e: కొత్త మ్యాక్‌బుక్, ఐప్యాడ్, ఐఫోన్ 17e త్వరలోనే లాంచ్.. సరికొత్త ప్రొడక్ట్స్‌తో ఆపిల్ ఈవెంట్

iPhone 17e| దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే పెద్ద ఈవెంట్‌ ప్లాన్ చేసింది. మార్చి 2026 ప్రారంభంలో జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్ కనీసం 5 కొత్త ప్రొడక్ట్స్ పరిచయం చేయనుంది. టెక్ రిపోర్ట్స్ ప్రకారం ఆపిల్ ఈ అప్‌డేట్స్ గురించి మరో మూడు రోజుల్లో వివరంగా తెలియజేయనుంది.

బ్లూమ్‌బెర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్మాన్ ప్రకారం సాధారణ లైవ్‌స్ట్రీమ్ కీనోట్ బదులుగా మల్టిపుల్ ప్రైవేట్ బ్రీఫింగ్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఈవెంట్ పేరు “స్పెషల్ ఆపిల్ ఎక్స్‌పీరియన్స్” అని తెలిసింది. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు పబ్లిక్ లైవ్‌స్ట్రీమ్ గురించి వివరాలు లేవు.

ఈవెంట్ తేదీ, లొకేషన్లు

ఆపిల్ ఎక్స్‌పీరియన్స్ మార్చి 4, 2026న జరగనుంది. స్థానిక సమయం ప్రకారం ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్‌లో సాయంత్రం 7:30 గంటల సమయంలో అప్‌డేట్స్ చూడవచ్చు. న్యూయార్క్, లండన్, షాంఘైలో ఈ సెషన్లు జరుగుతాయి. ఎంపిక చేసిన మీడియా సభ్యులు మాత్రమే ఈ ప్రైవేట్ సెషన్లకు హాజరవుతారు. పబ్లిక్ పాల్గొనడం గురించి ఆపిల్ ఇంకా ధృవీకరించలేదు.

రాబోతున్న కొత్త మ్యాక్‌బుక్

ఈ ఈవెంట్‌లో కొత్త మోడల్ మ్యాక్‌బుక్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్విటేషన్‌లో డిజైన్ మార్పుల సూచనలు ఉన్నాయి. కొత్త కలర్ ఆప్షన్లు రావచ్చు. మరింత పవర్‌ఫుల్ ప్రాసెసర్, స్పీడ్, ఎఫిషియెన్సీ, బ్యాటరీ లైఫ్ మెరుగుపడవచ్చు.

ఐఫోన్ 17e లాంచ్ అవకాశం

ఐఫోన్ 17 సిరీస్‌లో బడ్జెట్ మోడల్ అయిన ఐఫోన్ 17e కూడా మార్చి షోకేస్‌లో లాంచ్ కాబోతోందని సమాచారం. గత ఏడాది ఫిబ్రవరి 2025లో వచ్చిన ఐఫోన్ 16eని అప్‌గ్రేడ్ వెర్షన్ మోడల్ ఇది. పర్‌ఫామెన్స్, కెమెరాలో మెరుగుదలలు ఉండవచ్చు. డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీలో మార్పులు రావచ్చు. ధర వివరాల గురించి ఇంకా స్పష్టత లేదు.

కొత్త ఐప్యాడ్ మోడల్స్

రెండు కొత్త ఐప్యాడ్ మోడల్స్ రాబోతున్నాయి. అప్‌డేటెడ్ ఐప్యాడ్ ఎయిర్‌లో పవర్‌ఫుల్ M4 చిప్‌సెట్ రావచ్చు. ఇది మల్టీటాస్కింగ్, క్రియేటివ్ పనులకు బాగా సహాయపడుతుంది. ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌లో A18 ప్రాసెసర్ రావచ్చు. టాబ్లెట్‌లలో లేటెస్ట్ సిలికాన్ టెక్నాలజీ ఇస్తుంది. గేమింగ్, ప్రొడక్టివిటీ మెరుగవుతాయి.

Also Read: వేసవి వచ్చేసింది.. కరెంట్ కోతలకు బెస్ట్ ఇన్‌వర్టర్ బ్యాటరీలు.. ఆన్‌లైన్‌లో బెస్ట్ డీల్స్

మ్యాక్‌బుక్ ప్రో, ఎయిర్ అప్‌డేట్స్

ప్రీమియం ల్యాప్‌టాప్ లైనప్ రిఫ్రెష్ అవుతుంది. 14-ఇంచ్, 16-ఇంచ్ మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్‌లో ప్రాసెసర్, గ్రాఫిక్స్ అప్‌గ్రేడ్స్ రావచ్చు. థర్మల్ పనితీరు, బ్యాటరీ లైఫ్ మెరుగవుతాయి. మ్యాక్‌బుక్ ఎయిర్‌లో ఇంటర్నల్ మెరుగుదలలు, డిజైన్ మార్పులు రావచ్చు. అధికారిక స్పెసిఫికేషన్స్ ఇంకా రాలేదు.

కొత్త డివైజ్‌లలో ఆపిల్ పర్‌ఫామెన్స్ మెరుగుదలపై ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా లేటెస్ట్ సిలికాన్ టెక్నాలజీని హైలైట్ చేయనుంది. డిజైన్ అప్‌డేట్స్ కూడా ముఖ్యమైనవి. ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లలో బలమైన అప్‌డేట్స్ రావచ్చు. టెక్ ఔత్సాహికులు ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవెంట్ తేదీ సమీపించే కొద్దీ మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×