E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కారులో బాంబు పెట్టించిన రాహుల్  

Brahmamudi Serial Today February 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కారులో బాంబు పెట్టించిన రాహుల్  
Advertisement

Brahmamudi serial today Episode: 

శ్రీశైలం వెళ్లడానికి వ్యాన్‌ వచ్చిందట వెళ్లి చూడు అని రాహుల్‌కు రాజ్‌ చెప్పగానే.. రేఖను తీసుకుని బయట వ్యాన్‌ దగ్గరకు వెళ్తాడు రాహుల్‌. డ్రైవర్‌ను భోజనం చేయమని చెప్పి లోపలికి పంపించి కీస్‌ తీసుకుని రాహుల్‌ రుద్రాణికి కాల్ చేస్తాడు. మమ్మీ యమదూత వచ్చేసింది అని చెప్పగానే.. యమకింకరులు కూడా బయట సిద్దంగా ఎదురుచూస్తున్నారు. అని చెప్పగానే.. అవునా ఎక్కడా అని అడగ్గానే.. అక్కడే ఉంటారు చూడు వస్తారు అని చెప్తుంది రుద్రాణి. ఇంతలో ఒక రౌడీ రాహుల్‌కు సైగ చేస్తాడు. దీంతో మమ్మీ యమకింకరలు వచ్చేశారు. పని పూర్తి చేసి ఫోన్‌ చేస్తాను అని చెప్తాడు. దీంతో రుద్రాణి ఓరేయ్‌ రాహుల్‌ జీవితంలో మనకు దొరికిన లాస్ట్‌ చాన్స్‌ ఇది. ఏ చిన్నపొరపాటు జరిగినా మన జీవితాలు తలకిందులు అయిపోతాయి అని హెచ్చరించగానే..

డోంట్‌ వర్రీ మామ్‌.. అన్ని నేను చూసుకుంటాను. ఇంతవరకు వాళ్ల టైం నడిచింది. ఇప్పుడు మన టైం వచ్చింది అని చెప్పగానే.. సరే కానీ నువ్వు ఆ వ్యాన్‌లో ఉండకుండా ఉండటానికి నువ్వు ఏం ప్లాన్‌ చేశావు.. అని అడగ్గానే.. ఈ పాటికి స్వప్నకు ఫోన్‌ వచ్చి ఉంటుంది. తనే నన్ను ఈ వ్యాన్‌లో కూర్చోకుండా చేస్తుంది. చెప్పాను కదా మామ్‌ ఈ సారి మన ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుంది. నేను చూసుకుంటాను అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. అప్పుడే రౌడీ దగ్గరకు వచ్చి బాంబు పెట్టాల్సింది ఈ వ్యాన్‌లోనేనా..? అని అడగ్గానే.. రాహుల్‌ అవునని చెప్తాడు. రౌడీ ఇప్పుడే పెట్టనా..? అని అడగ్గానే.. రేఖ ఇప్పుడెందుకు..?       కాసేపయ్యాక అందరూ వస్తారు. వాళ్ల ఒపినీయన్‌ కూడా తీసుకుని అప్పుడు పెట్టు అనగానే.. రౌడీ కోపంగా ఏంటి మీకు కామెడీగా ఉందా..? అంటాడు. దీంతో రాహుల్‌ బాబు తన మాటలు వదిలేసెయ్‌  బాంబు ఎక్కడ అని అడగ్గానే.. రౌడీ బాంబు చూపిస్తాడు.

Advertisement

బాంబు చూసిన రాహుల్ సరే నీ పని మొదలు పెట్టు అని చెప్పగానే.. రౌడీ వ్యాన్‌ కిందకు పడుకుని బాంబు పెడుతుంటాడు. అప్పుడే లోపల నుంచి స్వప్న వస్తుంటుంది. స్వప్నను చూసిన రాహుల్‌ షాక్‌ అవుతాడు. దగ్గరకు వచ్చిన స్వప్న ఇక్కడేం చేస్తున్నావు రాహుల్‌ అని అడుగుతుంది. రాహుల్‌, స్వప్న టెన్షన్‌ పడుతుంటారు. స్వప్న ఏమైంది ఎందుకు అంత టెన్షన్‌ పడుతున్నారు అని అడగ్గానే.. శ్రీశైలం వెళ్లాలి కదా వ్యాన్‌ చెక్‌ చేయడానికి వచ్చాము.. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు అని అడగ్గానే.. విజయవాడ మేనేజర్ కాల్ చేశారు రాహుల్‌.. ఏదో టాక్స్‌ విషయంలో ప్రాబ్లమ్‌ అయిందట. నువ్వు వెళ్లి మాట్లాడాలట.. అని చెప్పగానే.. అవునా..? అయితే టైం చూసకుని వెళ్లి మాట్లాడతానులే అనగానే.. లేదు రాహుల్‌ రేపే వెళ్లి మున్సిపాలిటీ వాళ్లతో మాట్లాడాలట అని స్వప్న చెప్తుంది. దీంతో రాహుల్‌ సరే ఎలాగూ శ్రీశైలం వెళ్తాము కదా..? అక్కడి నుంచి విజయవాడ వెళ్దాం అని చెప్పగానే..

అయ్యో శ్రీశైలం మనం వ్యానులో వెళ్తాము కదా అక్కడి నుంచి ఎలా వెళ్లగలం అని స్వప్న అనగానే.. అయితే మనం కారులో శ్రీశైలం వెళ్లి అక్కడి నుంచి విజయవాడ వెళ్దాం అని రాహుల్ చెప్పగానే.. స్వప్న సరే అంటుంది. కాసేపట్లో నామకరణం అవుతుంది. అంతవరకు నీ కూతురును నువ్వే పట్టుకో అని చెప్పి పాపను రాహుల్‌కు ఇచ్చి స్వప్న లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో రౌడీ బాంబును ఫిక్స్‌ చేసి బయటకు వచ్చి పనైపోయింది సార్‌ అని చెప్తాడు. కరెక్టుగానే పని చేస్తుంది కదా..? తేడా రాకూడదు అని రాహుల్‌ అడగ్గానే.. చెప్పిన టైం కి ఫిక్స్‌ చేశాను. ఆ టైంకి ఘాట్‌ రోడ్‌లో ఉండేలా మీరు ప్లాన్‌ చేసుకోవాలి అని చెప్తాడు రౌడీ.

Advertisement

అది మేము చూసుకుంటాను ఇక నువ్వు వెళ్లు అని చెప్పగానే.. రౌడీ వెళ్లిపోతాడు. రేఖ నవ్వుతూ మొత్తానికి నీ భార్య చేతే మన ప్రాణాలను కాపాడే పని చేశావు అన్నయ్య అనగానే.. రాహుల్‌ నవ్వుతూ మనం సెపరేట్‌గా వెళ్తున్నామంటే ఎవ్వరికీ డౌటు రాకూడదు కదా చూశవా బంగారం ఇదంతా నీ కోసమే చేస్తున్నానురా..? ఈ కుటుంబం నన్ను మీ నాన్నమ్మను బానిసల్లా చూశారు. కానీ నేను నీకు అలాంటి గతి పట్టకూడదని ఈ ఫ్యామిలీ మొత్తాన్ని పైకి పంపిస్తున్నాను.. నువ్వు మహరాణిలా పెరగడానికే ఇదంతా చేస్తున్నాను.. అంటాడు. రేఖ కూడా కంగారు పడకు అన్నయ్య ఈరోజు సూర్యుడు అస్తమించడంతో ఆ దుగ్గిరాల వంశం కూడా అంతరిస్తుంది. మన రుద్రాణి కుటుంబమే చక్రం తిప్పబోతుంది అంటూ నవ్వుకుంటుంది.

మరోవైపు లోపల బారసాల, నామకరణ మహోత్సవం గ్రాండ్‌గా జరుగుతుంటుంది. ఆ ఫంక్షన్‌లో జూనియర్‌ రాజ్‌ అల్లరి అల్లరి చేస్తుంటాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత అందరూ శ్రీశైలం వెళ్లడానికి వ్యాన్‌ ఎక్కగానే.. రాహుల్‌, స్వప్న, రేఖ మాత్రం కారులో వెళ్లబోతుంటే రాజ్‌, కావ్య వెళ్లి అందరం వ్యాన్‌లో వెళ్దాం అని చెప్తారు. అందుకు స్వప్న విజయవాడ పని గురించి చెప్తుంది. దీంతో సరే అంటూ రాజ్‌, కావ్య కూడా వ్యాన్‌లోకి వెళ్లిపోతారు. తర్వాత రేఖ, రుద్రాణికి కాల్‌ చేసి అందరూ వ్యాన్‌ ఎక్కారని చెప్తుంది. అయితే  ఆ బాంబు చాలా పవర్‌ఫుల్‌ మీరు మినిమం 200 మీటర్ల దూరం ఉండండి అని చెప్తుంది రుద్రాణి సరే అంటూ కట్‌ చేసి కారెక్కి బయలుదేరుతారు. వ్యాన్‌లో అందరూ ఎంజాయ్‌ చేస్తూ వెళ్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×