E-Paper
Advertisement

Chrome Privacy Risk: క్రోమ్ చెత్త బ్రౌజర్.. యూజర్ ప్రైవెసీకి డేంజర్.. ఆపిల్, మైక్రోసాఫ్ట్ వార్నింగ్

Chrome Privacy Risk: క్రోమ్ చెత్త బ్రౌజర్.. యూజర్ ప్రైవెసీకి డేంజర్.. ఆపిల్, మైక్రోసాఫ్ట్ వార్నింగ్
Advertisement

Chrome Privacy Risk| ఐఫోన్ యూజర్లు గూగుల్ క్రోమ్ ఉపయోగించడం పూర్తిగా మానేయాలని టెక్ దిగ్గజం ఆపిల్ పదే పదే హెచ్చరిస్తోంది. దానికి బదులు సఫారి బ్రౌజర్ ఉపయోగించమని సూచిస్తోంది. సఫారి మరింత ప్రైవసీ ప్రొటెక్షన్ ఇస్తుందని ఆపిల్ చెప్పింది. యూజర్ డేటాను క్రోమ్ సరిగా ప్రొటెక్ట్ చేయదని ఆపిల్ తీవ్ర ఆరోపణలు చేసింది. క్రోమ్‌లో ట్రాకింగ్ ఎక్కువగా జరుగుతుందని ఆపిల్ హైలైట్ చేస్తోంది. ఇటీవల జారీ చేసిన హెచ్చరికలో డైరెక్ట్‌గా గూగుల్ బ్రౌజర్‌ను టార్గెట్ చేయడం ఆశ్చర్యకరం. ఆపిల్ ఒక్కటే కాదు మరో దిగ్గజ కంపెనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

గూగుల్ క్రోమ్‌ను విమర్శించిన మైక్రోసాఫ్ట్

ఆపిల్ తోపాటు మైక్రోసాఫ్ట్ కూడా క్రోమ్ ప్రైవసీ సమస్యలను విమర్శిస్తోంది. మైక్రోసాఫ్ట్ తన ఎడ్జ్ బ్రౌజర్‌ను సేఫ్ ఆప్షన్‌గా ప్రమోట్ చేస్తోంది. రెండు కంపెనీలు క్రోమ్ ఉపయోగించొద్దని చెబుతున్నాయి. అయితే ఈ రెండు కంపెనీల సూచనలలో మార్కెటింగ్ యాంగిల్ దాగి ఉంది. ఆపిల్ తన యూజర్లను తన ఎకోసిస్టమ్‌లో ఉంచాలని కోరుకుంటోంది. మైక్రోసాఫ్ట్ కూడా తన మార్కెట్ షేర్ పెంచాలని చూస్తోంది. అందుకే బిజినెల్ గూగుల్ క్రోమ్ కు బదులు తమ యూజర్లు ఎడ్జ్ బ్రౌజర్ ఉపయోగించాలని చెబుతోంది.

కొత్త రిపోర్ట్ లో ప్రైవసీ సమస్యలను హైలైట్

Advertisement

డిజిటైన్ అనే కంపెనీ నుంచి కొత్త ప్రైవసీ రిపోర్ట్ వచ్చింది. ఇందులో యూజర్ల ప్రైవసీ పరంగా గూగుల్ కు చాలా తక్కువ ర్యాంక్ లభించింది. పాపులర్ బ్రౌజర్లలో క్రోమ్ ట్రాకింగ్‌కి సరిగా చేయడం లేదని ఈ రిపోర్ట్ లో తేలింది. అయితే ఈ రిపోర్ట్ లో క్రోమ్ కంటే చెత్త బ్రౌజర్ గా చాట్‌జీపీటీ అట్లస్ నిలిచింది. కానీ అట్లాస్ ఇటీవలే వచ్చిన బ్రౌజర్ కావడంతో దానిపై విమర్శలు రావడం లేదు. ఈ స్టడీ పాపులర్ బ్రౌజర్ల ప్రైవసీ రిస్క్‌లను ఎవాల్యుయేట్ చేసింది. చెత్త బ్రౌజర్ల జాబితాలో చాట్‌జీపీటీ అట్లస్ టాప్ 1 ఉండగా.. రెండవ స్థానంలో గూగుల్ క్రోమ్ నిలిచింది.

ప్రైవసీ టెస్ట్‌లలో క్రోమ్ ఎలా పని చేసింది?

రిపోర్ట్ ప్రకారం క్రోమ్ ప్రైవసీ రిస్క్ స్కోర్ 76 (100కు). స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే రిస్క్ అంత ఎక్కువ. ట్రాకర్లను బ్లాక్ చేయడంలో క్రోమ్ జీరో స్కోర్ తీసుకుంది. బ్రౌజర్ ఫింగర్‌ప్రింట్ ప్రివెన్షన్‌లో మోడరేట్‌గా ఉంది. మొత్తం ట్రాకింగ్ ప్రొటెక్షన్ చాలా వీక్. విండోస్ రిపోర్ట్ కూడా క్రోమ్‌ను ట్రాకింగ్‌కి చెత్త బ్రౌజర్ అని పిలిచింది.

ఇతర బ్రౌజర్లు ఎలా పని చేశాయి?

Advertisement

చాట్‌జీపీటీ అట్లస్ అత్యంత చెత్త బ్రౌజర్ గా ర్యాంక్ అయింది. వివాల్డి 75 స్కోర్‌తో క్రోమ్ తర్వాతి స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కూడా 63 స్కోర్ తో విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే క్రోమ్ కంటే ఎడ్జ్ బెటర్ కానీ ఆపిల్ కంపెనీకి చెందిన సఫారి బ్రౌజర్ కు మంచి ర్యాంక్ సాధించింది. డక్‌డక్‌గో 44, టార్ బ్రౌజర్ 40 స్కోర్‌లతో బెస్ట్ ప్రైవసీ బ్రౌజర్లుగా నిలిచాయి.

సఫారి ఊహించిన దాని కంటే మెరుగ్గా పని చేసింది

సఫారి ప్రైవసీ రిస్క్ స్కోర్ 49 మాత్రమే. మెయిన్‌స్ట్రీమ్ బ్రౌజర్లలో సేఫ్‌గా ఉంది. ప్రైవసీ ఫోకస్డ్ బ్రౌజర్ల జాబితాలో ర్యాంక్ అయింది. ఇది ఆపిల్ ప్రైవసీ క్లెయిమ్స్‌కు సపోర్ట్ ఇస్తుంది.

సొంత ప్రైవసీ స్కోర్‌కార్డ్ ఉపయోగించిన ఆపిల్

ఆపిల్ సఫారి vs క్రోమ్ పోల్చి చూపిస్తూ.. ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరించింది. సఫారి అన్ని ట్రాకింగ్ కేటగిరీలలో పర్ఫెక్ట్ స్కోర్ తీసుకుంది. క్రోమ్ అన్నింటిలో ఫెయిల్ అయింది. అందుకే ఈ రిజల్ట్స్‌ చూపిస్తూ సఫారిని ఆపిల్ ప్రమోట్ చేస్తోంది.

ఆపిల్ ఆర్గ్యుమెంట్‌ను బలపరుస్తూ iOS అప్‌డేట్

ఆపిల్ ఇటీవల పెద్ద iOS అప్‌డేట్ ఇచ్చింది. ఈ అప్‌డేట్ ఫింగర్‌ప్రింటింగ్ ప్రొటెక్షన్ మెరుగుపడింది. సఫారి ఇప్పుడు దాన్ని మరింత ఎఫెక్టివ్‌గా బ్లాక్ చేస్తుంది. ఇది క్రోమ్‌కు వ్యతిరేకంగా ఆపిల్ హెచ్చరికకు సపోర్ట్ గా కనిపిస్తోంది.

ఇంతవరకు స్పందించని గూగుల్

ఈ రిపోర్ట్ టెక్ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. అయినా ఇంతవరకు గూగుల్ అధికారికంగా క్రోమ్ చెత్త ర్యాంక్ పై అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.

Related News

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Big Stories

Advertisement
×