E-Paper
Advertisement

Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ టార్గెట్ రీచ్ అయ్యిందాా..?

Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ టార్గెట్ రీచ్ అయ్యిందాా..?

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బోల్డు మంది నాయకులున్నారు.. సీనియర్ మోస్ట్ నేతలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్న ఔత్సాహిక నేతలకు వైసీపీలో కొదవలేదు. అయినా జిల్లాలో పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలు తూతూ మంత్రంగా సాగుతుండటం క్యాడర్‌ను నిరాశ పరుస్తోందంట, తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం విజయవంతమైందని కూడా పార్టీ ప్రకటించుకుంది. అయితే సిక్కోలు జిల్లాలో ఆ సంద్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ నేతలు చూపిస్తున్న సంతకాల లెక్కలపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయంట.

వైసీపీ కార్యక్రమాలకు కనిపించని స్పందన

ఓటమి తర్వాత వైసీపీ చేపట్టిన కార్యక్రమాలేవీ పెద్దగా జనాల్లోకి వెళ్లడం లేదు. కానీ, వ్యూహాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాత్రం కొంతమేర ప్రజలను ఆకర్షించింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పీపీపీల పద్దతి ద్వారా ప్రైవేటు ప్రభుత్వ పరం చేస్తున్నారంటూ వైసీపీ ప్రజామద్దతు కూడగట్టడానికి పాట్లు పడుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది నుంచి వైసీపీ సంతకాలను సేకరించానని చెప్పుకుంటోంది. అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం ముగిసిందంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం వైసీపీలోని వర్గపోరును మరోసారి బయటపెట్టిందంట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి శ్రీకాకుళంలో టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాలు కొరకరాని కొయ్యగా మారాయి. అయితే.. ఈ కార్యక్రమం ఆ నియోజర్గాల్లో ఏమాత్రం ప్రభావం చూపించకపోగా.. ప్రతికూల పవనాలు వీచేలా చేశాయంట.

సంతకాల సేకరణ ఫ్లాప్‌

విద్యార్థులను కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహించినపుడు కొంతమేరా మైలేజ్ వచ్చినా.. తర్వాత అది కేవలం పార్టీ కార్యక్రమంలా మారిపోయింది. కొన్ని రోజులకు పార్టీ శ్రేణులు కూడా దీన్ని లైట్ తీసుకున్నారు. టెక్కలి వైసీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ సొంత మండలం నందిగామలో మాత్రమే సుమారు ఓ 10 మంది నాయకులతో సంతకాల సేకరణ జరిగింది. మిగిలిన మండలాల్లో ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలియలేదు. టెక్కలి వైసీపీలో పేరాడ తిలక్ నాయకత్వాన్ని కనిపించకుండా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో ఏ ఈవెంట్ లో అయినా ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు.

కాలింగ సమాజం లీడర్ పై నేతల దృష్టి

దువ్వాడ వాణి కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్ గా లేరు. ఇక, ఇచ్చాపురం విషయానికి వస్తే అక్కడ వైసీపీలోని వర్గపోరే టీడీపీ ఎమ్మెల్యే అశోక్ బాబుకి శ్రీరామ రక్షగా మారింది. వైసీపీ ఇంచార్జ్ పిరియా విజయకు ప్రజల మద్దతు ఉన్నప్పటికీ నాయకుల సపోర్టు లేదు. ఓటు బ్యాంక్ పరంగా నియోజకవర్గంలో ఐదవ స్థానంలో ఉన్న కాలింగ సామాజిక వర్గానికి చెందిన ఆమె నాయకత్వాన్ని మొదటి రెండు స్థానాల్లో ఉన్న రెడ్డికి, యాదవ నాయకులు జీర్జించుకోలేకపోతున్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఫెయిలైతే.. ఆమెను ఇంచార్జ్ పగ్గాల నుంచి తప్పించొచ్చని వ్యతిరేకవర్గం ఆలోచించినట్టు తెలుస్తోంది. అందుకే ఆమెకు ఎవరూ సహకరించలేదని టాక్.

ఆముదాలవలసలో టీడీపీ ఆధిపత్యం

ఇచ్చాపురం, టెక్కలి తర్వాత ఆముదాలవలస కూడా టీడీపీకి ఇప్పుడు కంచుకోటగా మారింది. అక్కడి నుంచి ఎన్నికైన కూన రవికుమార్ తన దైన శైలిలో అవసరమైనపుడు ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాంటి కూన రవికుమార్ ను ఎదుర్కోవడంలో వైసీపీ విఫలం అవుతోంది. ఆమదాలవలసలో ఉన్న వర్గపోరే దానికి కారణం. తమ్మినేని వర్సెస్ చింతాడ రవి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇద్దరూ కలిసి నిర్వహించిన ఒక్క కార్యక్రమం కూడా నియోజకవర్గంలో లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన తమ్మినేని ఇంచార్జ్ నుంచి ఎలాంటి పిలుపు లేకపోవడంతో ఆమదాలవలసలో మాత్రం దూరంగా ఉన్నారు. పోనీ చింతాడ రవి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారా అంటే అదీ లేదు. సేకరించిన 45 వేలకు పైగా సంతకాల్లో ఎంతవరకు జెన్యూన్ అనేది చెప్పలేకపోతున్నామని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.

శ్రీకాకుళం లో వైసీపీ నాయకత్వం సవాళ్లు

జిల్లా పెద్దగా ఉన్న ధర్మాన ప్రసాద్ తప్పనిసరైతే తప్ప ఏ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. కొడుకుని భవిష్యత్ నేతగా తయారు చేసే పనిలో ఆయన ఉన్నారు. అందుకే ఈవెంట్ ఏదైనా ధర్మాన రాంమనోహన్ నాయుడే కనిపిస్తున్నారు. అయితే.. తనయుడి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమమూ చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ కావడం లేదు. ఈ కోటి సంతకాల సేకరణ కూడా అంతే. పాతపట్నంలో ఇంచార్జ్ గా ఉన్న రెడ్డి శాంతి కార్యకర్తలకే అందుబాటులో ఉండరు. ఢిల్లీ నుంచి చుట్టం చూపునకు వచ్చినట్టు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పోతారు. ఆమె నియోజకవర్గంలో లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ ను నడిపించే నాయకుడు మరొకరు లేరు. ఇక పాలకొండ, రాజాం, ఎచ్చర్లలో ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరిగాయో తెలియదు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ వార్, మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకుల్లో ఉత్సాహ లేమి వైసీపీని వేధిస్తున్నాయి.

Story by Ramireddy, Big Tv 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×