E-Paper
Advertisement

Chittoor district: పెద్దిరెడ్డి పెత్తనం తగ్గుతుందా..?

Chittoor district: పెద్దిరెడ్డి పెత్తనం తగ్గుతుందా..?

Chittoor district: కేసులు అరెస్టులు..విచారణలు ..మరో వైపు ముంచుకు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు .. పార్టీ ఓటమి తర్వాత పార్టీ మారిన క్యాడర్.. ఇలాంటి సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో మాత్రం సఖ్యత కనిపించడం లేదు . ప్రతి వర్గం నేతలు సైతం తాము కూడా తక్కువ తినలేదన్నట్లు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. జిల్లాలోని పెద్దాయనకు వ్యతిరేకంగా గొంతు విప్పుతుండగా పెద్దాయన వర్గం సైతం అవసరమైన చోట తమ బలం చూపిస్తున్నారు.. ప్రతిపక్షంలో సైతం తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారంట.

చిత్తూరు జిల్లాలో వైసీపీకి కాకాలు తీరిన నాయకులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీలో కాకలు తీరిన నాయకులు,,పార్టీ వ్యవస్థాపకులు కూడా ఉన్నారు. లిస్టు కూడా చాంతాడంతా ఉంటుంది. అందులో జగన్‌కు దగ్గర వారైన..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యం మధుసూదన్ రెడ్డి, నారాయణ స్వామి, విజయానందారెడ్డి .. ఈ విధంగా చూస్తే ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ఓకటి రెండు నియోజకవర్గాలలో తప్ప మిగతా అన్నిచోట్ల అభ్యర్థుల కోసం కసరత్తు చేయాల్సిన పనిలేదు..

పదవుల కోసం చిత్తూరులో అంతర్గత పోటీ

వైసీపీకి అంత సౌలభ్యం ఉన్న జిల్లా ఉమ్మడి చిత్తూరు .. 2019-24 మధ్య కాలంలో ఇక్కడ నుంచి డిప్యూటీ సీయంగా నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా మంత్రులుగాపనిచేసారు..ఇక మిగతా పదవులకు కూడా లెక్కలేదు..అయితే అప్పట్లో జిల్లాలో కోల్డ్ వార్ నడిచింది..పెద్దిరెడ్డి వర్సెస్ రోజా,, పెద్దిరెడ్డి వర్సెస్ విజయానందారెడ్డి, పెద్దిరెడ్డి వర్సెస్ డిప్యూటీ సియం నారాయణ స్వామి మద్య పరోక్ష యుద్దమే నడిచింది .. ఒకానొక సమయంలో కొంతమంది కి టికెట్లు కూడా రావనే ప్రచారం జరిగింది.. దానికి తగ్గట్లే నారాయణస్వామికి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా చిత్తూరు ఎంపి కేటాయించడంతో పెద్ద గొడవ జరిగింది. చివరకు నారాయణ స్వామి కూమార్తె కృపాలక్ష్మి జీడి నెల్లూరు అభ్యర్థి అయింది..అదే విధంగా సత్యవేడులో ఆదిమూలంను తిరుపతి ఎంపికా ప్రకటించడంతో అతను పెద్దిరెడ్డిని విమర్శించి టికెట్ వదిలేసుకోని టిడిపి తరపున పొటీచేసి ఎమ్మెల్యే అయ్యారు..

పెద్దిరెడ్డి అధిపత్యం పై రోజా వ్యతిరేకత

పెద్దిరెడ్డి వ్యవహార శైలిని అయన అధిపత్యాన్ని ఎక్కువగా వ్యతిరేకించిన వారిలో రోజా ముందు వరసలో ఉన్నారు. రోజాను నియోజకవర్గం నగరిలో ఆమెను వ్యతిరేకించిన కేజె కూమార్ , రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, అమ్ములు, మురళిదర్ రెడ్డి, రాజు పదవులు ఇప్పించడంలో పెద్దిరెడ్డి పాత్ర ఉందని రోజా వర్గం అంటుంది. దీంతో ఈ విషయంలో అమె కొన్ని సార్లు బహిరంగంగా కూడా అరోపణలు చేసారు. అయితే పెద్దిరెడ్డికి పై స్థాయి వరకు ఉన్న పవర్ తో ఏమి రోజో ఏమీ చేయలేకపోయారు.

చిత్తూరు రాజకీయాల్లో పెద్దిరెడ్డి వర్గం ప్రభావం

చివరకు రోజాకు టికెట్ రానివ్వకుండా నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి వర్గం చివరి వరకు పనిచేసింది .ఒకనొక దశలో గాలిముద్దు కృష్ణమనాయుడు చిన్న కూమారుడు జగదీష్ ను రంగంలోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే అది ఫలించక పోవడంతో మొత్తం వీరంతా ఎన్నికలకు మూడు నెలల ముందు టిడిపిలో చేరిపోయారు. ఇదే విధంగా చిత్తూరు ఇన్చార్జ్ విజయానందరెడ్డిని కూడా పెద్దిరెడ్డి వర్గం వ్యతిరేకించడం జరిగింది..దీంతో విజయానందరెడ్డి కూడా తన ఓటమికి కారణం పెద్దిరెడ్డి అని ఇప్పటికి సన్నిహితుల వద్ద చెబుతున్నారంట..ఎన్నికల తర్వాత ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియామకం జరిగింది. దానిపై విజయానందరెడ్డి, రోజా, నారాయణ స్వామి తీవ్రంగా జగన్ ముందు వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు.

అడుగు అడుగున కేసుల్లో చిక్కిన రియల్ పాలిటిక్స్

తర్వాత పరిణామాలతో లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి , చెవిరెడ్డిల అరెస్టులు జరగడటంతో పాటు .. మదనపల్లి ఫైల్స్, అటవీ భూముల అక్రమణ, తిరుపతిలో మఠం భూముల అక్రమణల కేసులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ కేసుల ఊబిలో చిక్కుకుపోయింది. అయితే ఇదే సమయంలో లిక్కర్ కేసులో నారాయణ స్వామిని విచారించింది సిట్.. మరో వైపు టీడీఅర్ బాండ్స్ , నకిలీ ఓట్లర్ల కార్డులు, కల్తీ నెయ్యి,పరకామణి కేసుల ఇష్యూలో భూమన కరుణాకర్ రెడ్డి, తుడా అక్రమాల కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఆడుదాం ఆంధ్రా అక్రమాలలో రోజా ఇలా అందరిపై కేసుల విచారణలు జరుగుతున్నాయి..అయితే ఇలాంటి సమయంలో కూడా వారిలో విభేదాలు కొనసాగుతుండటం క్యాడర్‌కు మింగుడు పడటం లేదంట.

నాగరిలో టిడిపి సక్సెస్, రోజా విమర్శలు

తాజాగా నగరి నియోజకవర్గంలో రెండు ఎంపీపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వారు విజయం సాధించారు. నిండ్ర నుంచి రెడ్డివారి భాస్కర్ రెడ్డి, విజయపురం నుంచి రాజు గెలుపోందారు. అయితే దీనికి సంబంధించి ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, లాటరీ సందర్భంగా అక్రమాలు జరిగాయని రోజా ఆరోపిస్తూ ఇలాంటి వారికి గతంలో ఓ పెద్దాయన మద్దతు ఇచ్చారని, వారి విషయంలో ఇకనైనా జాగ్రతగా ఉండాలంటూ అన్యాపదేశంగా పెద్దిరెడ్డిని విమర్శించారు.. చిత్తూరు లో పెద్దిరెడ్డి వర్గం అయిన డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ జగన్ జన్మదిన వేడుకలను ఇన్చార్జితో కాకుండా సొంతంగా నిర్వహించారు..తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని డిప్యూటీ మేయర్ అంటున్నారు.

వైసిపిలో పెద్దిరెడ్డి వర్గం అసహనంతో వైవిధ్యాలు

గత ఎన్నికలలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తో పాటు పెద్దిరెడ్డి అనుచరుడు అయిన బుల్లెట్ సురేష్ లు తనకు వ్యతిరేకంగా పనిచేసారని విజయానందరెడ్డి భావిస్తున్నారు. దాంతో వారిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారంట.. ఇదే విధంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో కూడా గతంలో పెద్దిరెడ్డి వర్గం గా ఉన్నబ్యాచ్ మొత్తం జీడీ నెల్లూరు ఇన్చార్జ్ కృపాలక్ష్మికి వ్యతిరేకంగా రోడ్డుకెక్కారు.. ఇలా అవకాశం వస్తే ప్రతిపక్షమా అధికార పక్షమా అన్న తేడా లేకుండా వైసిపిలోని లుకలుకలు బయడపడుతున్నాయంట. దానికితోడు ఇప్పుడు పుంగనూరు ను పూర్తిగా అన్నమయ్య జిల్లాలో కలపడంతో ఇక పెద్దిరెడ్డి ప్యామిలి పెత్తనం తమకు ఉండదని భావిస్తున్నారంట తిరుపతి, చిత్తూరు జిల్లాల నేతలు.

Story By Ramireddy, Big Tv 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×