E-Paper
Advertisement

భారత్‌ లో MG మాస్టర్ ప్లాన్.. హైబ్రిడ్‌ తో పాటు 3 ఎలక్ట్రిక్ కార్లు విడుదల!

భారత్‌ లో MG మాస్టర్ ప్లాన్.. హైబ్రిడ్‌ తో పాటు 3 ఎలక్ట్రిక్ కార్లు విడుదల!
Advertisement

MG India 2026 Plan: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్న JSW MG మోటార్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. 2026లో మూడు కొత్త ఎలక్ట్రిఫైడ్ కార్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో MG బ్రాండ్ నుంచి భారత్ లో అడుగు పెట్టే తొలి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారు కూడా ఉంది.

ఎలక్ట్రిక్ కార్లపై MG ఫోకస్

ప్రస్తుతం MG ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. అయితే, ఇప్పుడు పూర్తిస్థాయి EVలతో పాటు హైబ్రిడ్ టెక్నాలజీని కూడా భారత వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది.EVకి పూర్తిగా మారేందుకు ఇంకా సిద్ధంగా లేని కస్టమర్లను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. కొత్త మోడళ్ల పేర్లు, టెక్నికల్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ, 2026లో MG నుంచి మూడు కొత్త వాహనాలు మార్కెట్లోకి రావడం ఖాయమని స్పష్టం చేసింది.

ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ

Advertisement

అటు MG తన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా వేగంగా విస్తరిస్తోంది. కంపెనీ MG Charge కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 1,000 కమ్యూనిటీ EV ఛార్జర్లను ఏర్పాటు చేసింది. ఈ ఘనత సాధించిన తొలి ప్యాసింజర్ వాహన తయారీ సంస్థగా MG నిలిచింది. ప్రస్తుతం ఈ ఛార్జర్లు 470కి పైగా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. అపార్ట్‌ మెంట్స్, హోటళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఐటీ పార్కులు లాంటి ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారిలో ఛార్జింగ్ సదుపాయాలపై ఉండే సందేహాలను తగ్గించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తుంది.

MG వెల్లడించిన వివరాల ప్రకారం, కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటివరకు ఇండియాలో 290 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. దీనివల్ల సుమారు 4.17 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో EVల పాత్ర ఎంత కీలకమో అర్థం అవుతోంది. స్థిరమైన అభివృద్ధిపై కూడా MG ప్రత్యేక దృష్టి పెడుతోంది. గుజరాత్‌ లోని హలోల్ తయారీ కేంద్రంలో కంపెనీ ఉపయోగిస్తున్న విద్యుత్‌ లో ఎక్కువ భాగం రీజెనరేటివ్ ఇంధన వనరుల నుంచే వస్తోంది. ప్లాంట్ అవసరాల్లో దాదాపు 95 శాతం వరకు గ్రీన్ ఎనర్జీ వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీని ఫలితంగా 9,300 మెట్రిక్ టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగినట్లు MG వెల్లడించింది.

Advertisement

కొత్త ఎలక్ట్రిక్ కార్లు, తొలి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్, దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఛార్జింగ్ నెట్‌ వర్క్‌ తో MG భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2026లో రానున్న కొత్త మోడళ్లపై ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి నెలకొంది.

Read Also: నిస్సాన్ టెక్టన్ లాంచ్ కు కౌంట్‌ డౌన్.. క్రెటా, డస్టర్‌ కు కొత్త సవాల్?

Related News

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×