Apple Products Launch 2026: టెక్ రంగంలో యాపిల్ ప్రొడెక్ట్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. యాపిల్ విడుదల చేసే మెుబైల్స్, ఐప్యాడ్స్, మ్యాక్స్, స్మార్ట్ హోమ్ డివైజ్ లను వినియోగించడాన్ని చాలా మంది ఒక గౌరవంగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఐఫోన్ మార్కెట్ లోకి వస్తుందంటే చాలు.. యాపిల్ స్టోర్స్ పేద, ధనిక అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున మెుబైల్ లవర్స్ క్యూ కడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ ఏడాదిని చాలా పెద్దగా యాపిల్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. iPhone 18 Pro, iPhone 17e, iPad Air M4 సహా ఈ ఏడాది ఏకంగా 20 యాపిల్ ప్రొడక్ట్స్ ను మార్కెట్ లో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్.. తన ప్రధాన ఉత్పత్తులు అన్నింటిని ఈ ఏడాది అప్ గ్రేడ్ చేసి.. వినియోగదారులకు మరింత చేరువ కావాలని భావిస్తోంది. ఈ క్రమంలో 2026లో ముందుగా లాంచ్ చేయబోయే డివైజ్ లలో యాపిల్ ఐఫోన్ 17ఇ (iPhone 17e) ఒకటి. ఇది చాలా సరసమైన మెుబైల్ గా గుర్తింపు పొందింది. సాధారణంగా ప్రీమియం ఐఫోన్స్ లో కనిపించే డైనమిక్ ఐలాండ్ (Dynamic Island), మాగ్‌సేఫ్ సపోర్ట్ (MagSafe support), శక్తివంతమైన ఏ19 చిప్ (Powerful A19 chip) వంటి ఫీచర్లను ఈసారి iPhone 17eలో తీసుకురాబోతున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2026 ఏడాదిలో మరింత అధునాతన ఐప్యాడ్ లను యాపిల్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. త్వరలో లాంచ్ చేయనున్న iPad Air అప్ గ్రేడ్ వెర్షన్ లో M4 చిప్ ను అమర్చనున్నట్లు టాక్. ఇది మల్టీ టాస్కింగ్, మెరుగైన పర్ ఫార్మెన్స్ కు దోహదం చేయనుంది. మరోవైపు ఐఫోన్ మ్యాక్ బుక్ యూజర్లు.. ఈ ఏడాది మేజర్ అప్ గ్రేడ్స్ చూసే అవకాశముంది. అప్ కమింగ్ M5 చిప్ సెట్ తో MacBook Air వచ్చే ఛాన్స్ ఉందని యూపిల్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు MacBook Pro లైనప్.. M5 Pro, M5 Max చిప్‌లతో రావొచ్చని లీక్స్ ఇస్తున్నాయి.
మెుబైల్స్, ఐపాడ్, మ్యాక్ బుక్స్ కు మాత్రమే పరిమితమైన ఆదరణను ఈ ఏడాది స్మార్ట్ హోమ్ పరికరాలకు సైతం విస్తరించాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. మెరుగైన సిరి ఫీచర్లను అందించడం కోసం రూపొందించబడిన స్క్రీన్ తో స్మార్ట్ హబ్ ను యాపిల్ ప్రారంభించవచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా యాపిల్ తన తొలి హోమ్ కిట్ ఎనేబుల్డ్ సెక్యూరిటీ కెమెరాను ఈ ఏడాది లాంచ్ చేసే అవకాశమున్నట్లు బజ్ వినిపిస్తోంది.
2026 ద్వితియార్థంలో A20 ప్రో చిప్‌తో నడిచే ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max)లను విడుదల చేయనుంది. ఈ ఫోన్స్ గత మోడల్స్ తో పోలిస్తే మెరుగైన కెమెరా పనితనం, వేగవంతమైన పనితీరు, అడ్వాన్స్డ్ డిజైన్ ను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు యాపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ను ఈ ఏడాదే లాంచ్ చేసే అవకాశమున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివరిలో అది విడుదల కావొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం టెక్ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారం నిజమైతే.. యాపిల్ కు 2026 అతిపెద్ద సంవత్సరంగా మారనుంది.
Also Read: Galaxy S26: గెలాక్సీ S26లో Exynos 2600 చిప్‌సెట్, ఫీచర్స్ ఇవే.. గీక్‌బెంచ్‌లో లిస్టింగ్