Apple WWDC 2026: యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2026 ఈరోజు నుంచే ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక ప్రసంగంతో మొదలవుతుంది. ఈ ఏడాది చివర్లో టిమ్ కుక్ స్థానంలో బాధ్యతలు చేపట్టబోతున్న కొత్త సీఈఓ జాన్ టెర్నస్ కూడా ఈ వేదికపై కనిపించే అవకాశం ఉంది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి పరికరాల కోసం రాబోయే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను ఈ ఈవెంట్‌లో ఆపిల్ పరిచయం చేయనుంది.
ఈ ఈవెంట్ కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా జరగనుంది. ఈ కీనోట్ ప్రసంగాన్ని యాపిల్ టీవీ యాప్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, విండోస్ పీసీలతో పాటు స్మార్ట్ టీవీల్లోనూ ఉచితంగా చూడొచ్చు. అలాగే యాపిల్ డెవలపర్ యాప్, అధికారిక వెబ్‌సైట్, యాపిల్ యూట్యూబ్ ఛానల్‌లో కూడా ఈ కార్యక్రమం లైవ్ వస్తుంది. దీని తర్వాత అర్ధరాత్రి 1:30 గంటలకు ‘ప్లాట్‌ఫార్మ్స్ స్టేట్ ఆఫ్ ది యూనియన్’ కార్యక్రమం ఉంటుంది.
గూగుల్, శాంసంగ్ వంటి ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా యాపిల్ ఈసారి తన ఏఐ సాంకేతికతను మరింత బలోపేతం చేయనుంది. ముఖ్యంగా రెండేళ్ల క్రితం ప్రకటించి, ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను, సరికొత్త Siri అప్‌డేట్స్‌ను ఈ వేదికపై ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈసారి ఏఐ ఫీచర్లు యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని అంచనా వేస్తున్నారు.
Also Read: అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు, 200MP కెమెరాతో వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!
ఈ ఈవెంట్‌లో యాపిల్ తమ తదుపరి తరం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను ప్రకటిస్తుంది. దీనిలో భాగంగా ఐఫోన్ వినియోగదారుల కోసం ఐఓఎస్ 27 (iOS 27), ఐప్యాడ్ కోసం ఐప్యాడ్‌ఓఎస్ 27తో పాటు విజన్ ఓఎస్, వాచ్ ఓఎస్, టీవీ ఓఎస్ కొత్త వెర్షన్లను పరిచయం చేయనున్నారు. ఇవన్నీ యాపిల్ డివైజ్‌ల పనితీరును మరింత సులభతరం చేయనున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలను యాపిల్ పార్క్‌కు ఆహ్వానించారు. వారితో పాటు 50 మంది విశిష్ట విజేతలకు మూడు రోజుల పాటు ప్రత్యేక అనుభూతిని అందించనున్నారు. వారం పొడవునా జరిగే 100కి పైగా టెక్నికల్ సెషన్లలో డెవలపర్లు నేరుగా యాపిల్ ఇంజనీర్లతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Also Read: సరికొత్త ‘మింట్’ కలర్‌లో Samsung Galaxy A27.. లాంచ్‌కు ముందే లీకైన వివరాలు!