E-Paper
Advertisement

Apple 2025 Cleanup: 2025లో భారీ క్లీనప్ ప్రకటించిన ఆపిల్.. ఇక ఈ ఐఫోన్స్, ఐప్యాడ్స్ తయారీ బంద్

Apple 2025 Cleanup: 2025లో భారీ క్లీనప్ ప్రకటించిన ఆపిల్.. ఇక ఈ ఐఫోన్స్, ఐప్యాడ్స్ తయారీ బంద్

Apple 2025 Cleanup| 2025 సంవత్సరం చివరిలో ఆపిల్ తన ప్రొడక్ట్ లైనప్‌లో పెద్ద మార్పులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 డివైసెస్, యాక్సెసరీల తయారీని శాశ్వత ఆపేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఆపిల్ స్టోర్లలో సేల్స్ ఉండవు. పాత స్టాక్ థర్డ్ పార్టీ స్టోర్స్ లో మాత్రమే లభిస్తుంది. ఈ నిర్ణయం ఆపిల్ ఎకోసిస్టమ్‌ను సింపుల్, షార్ప్ చేయాలనే స్ట్రాటజీని చూపిస్తుంది. అయితే తయారీ, సేల్స్ నిలిపివేసిన (డిస్‌కంటిన్యూడ్) చాలా ప్రొడక్ట్స్ లో పాత మోడల్స్ స్థానాన్ని కొత్త వెర్షన్స్‌ భర్తీ చేయనున్నాయి.

తయారీ నిలిపివేసిన పరికరాల జాబితాలో కొన్ని లాంగ్ రన్నింగ్ పాపులర్ డివైజ్‌లు కూడా ఉన్నాయి. ఆపిల్ ఓవర్‌ల్యాపింగ్ ప్రొడక్ట్స్, అవుట్‌డేటెడ్ హార్డ్‌వేర్ తొలగించడంపై ఫోకస్ చేసింది. ఇకపై మార్కెట్లో తక్కువ మోడల్స్‌తో క్లియర్ పొజిషనింగ్ కావాలని కంపెనీ అనుకుంటోంది. ఐఫోన్ లైనప్‌లోనే 2025లో అతి పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది.

2025లో ఐఫోన్ లైనప్‌లో పెద్ద క్లీనప్ ఇదే

ఆపిల్ ఈ ఏడాది అనేక ఐఫోన్ మోడల్స్‌ను ఎండ్ చేసింది. అతి పెద్ద మార్పు ఐఫోన్ SE సిరీస్‌లో వచ్చింది. ఫిబ్రవరి 2025లో మూడో జెనరేషన్ ఐఫోన్ SE తయారీని నిలిపివేసింది. ఇది 2016లో ప్రారంభమైన SE లైనప్‌కు అధికారిక ముగింపు. ప్లస్ మోడల్స్‌ను కూడా నెమ్మదిగా ఫేజ్ అవుట్ చేసింది. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 ప్లస్ స్టోర్స్ నుంచి తొలగించారు. ప్లస్ బ్రాండింగ్ పూర్తిగా డ్రాప్ చేయవచ్చని సూచనలు.  రిపోర్ట్స్ ప్రకారం.. ప్లస్ మోడల్స్ స్థానంలో థిన్నర్ ఐఫోన్ ఎయిర్ డిజైన్స్ రావచ్చు. 2025లో మొత్తం ఏడు ఐఫోన్ మోడల్స్ డిస్‌కంటిన్యూ అయ్యాయి. ఈ జాబితా స్టాండర్డ్, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ వేరియంట్స్ కూడా ఉండడం గమనార్హం. కొత్త జెనరేషన్స్ లాంచ్ అయ్యాక పాత మోడల్స్ అదృశ్యమయ్యాయి.

డిస్‌కంటిన్యూడ్ ఐఫోన్స్, ఐప్యాడ్స్ లిస్ట్

ఆపిల్ సేల్ నుంచి తొలగించిన ఐఫోన్స్: ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ SE (3rd generation).
ఐప్యాడ్ లైనప్‌లో కూడా రిఫ్రెష్ జరిగింది. కొత్త చిప్ అప్‌గ్రేడ్స్ పాత మోడల్స్‌ను అవుట్ చేశాయి.
డిస్‌కంటిన్యూడ్ ఐప్యాడ్స్: ఐప్యాడ్ ప్రో (M4), ఐప్యాడ్ ఏయిర్ (M2), ఐప్యాడ్ (10th generation).

ఆపిల్ వాచ్ లైనప్ స్ట్రీమ్‌లైన్

ఆపిల్ 2025లో అనేక ఆపిల్ వాచ్ మోడల్స్‌ను కూడా రిటైర్ చేసింది. మేజర్ కొత్త చిప్ ఇంట్రడక్షన్ లేకపోయినా ఇది జరిగింది. స్మార్ట్‌వాచ్ లైనప్ క్లీనర్‌గా ఉండాలని కంపెనీ కోరుకుంటోంది. పాత అల్ట్రా, SE, సిరీస్ వెర్షన్స్ డిస్‌కంటిన్యూ అయ్యాయి. ఆపిల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి కన్ఫ్యూజన్ తగ్గించడానికి ఈ నిర్ణయం తీసకున్నట్లు సమాచారం.

డిస్‌కంటిన్యూడ్ వాచ్‌లు, మ్యాక్ ప్రొడక్ట్స్ ఇవే

ఆపిల్ ఈ ప్రొడక్ట్స్ అధికారికంగా డిస్‌కంటిన్యూ చేసింది. ఇక వీటి సేల్స్ ఉండవు.
ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఆపిల్ వాచ్ ఎస్‌ఈ 2, ఆపిల్ వాచ్ సిరీస్ 10, మ్యాక్ స్టూడియో విత్ M2 మాక్స్, M2 అల్ట్రా, 13 అంగుళాల మ్యాక్‌బుక్ ఏయిర్ విత్ M3, 15 అంగుళాల మ్యాక్‌బుక్ ఏయిర్ విత్ M3, 13 అంగుళాల మ్యాక్‌బుక్ ఏయిర్ విత్ M2, 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో విత్ M4.

ముఖ్యంగా పాత చిప్ కాంబినేషన్స్ ఉన్న మ్యాక్ మోడల్స్ తొలగించారు. ఇకపై కొత్త సిలికాన్ చిప్స్ వైపునకు ఆపిల్ మొగ్గుచూపుతోంది.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో టైప్ సి కేవలం ఛార్జింగ్ కోసం కాదు.. ఫోన్‌ని పవర్‌బ్యాంక్, పిసీగా మార్చే ట్రిక్స్

ఎయిర్‌పాడ్స్, విజన్ ప్రో, యాక్సెసరీలపై కూడా ప్రభావం

ఆపిల్ అప్‌డేటెడ్ వెర్షన్స్ లాంచ్ అయ్యాక పాత ఎయిర్‌పాడ్స్ డిస్‌కంటిన్యూ చేసింది. కొత్త రిలీజ్‌ల తర్వాత కొన్ని విజన్ ప్రో మోడల్స్ కూడా అదృశ్యమయ్యాయి. లైట్నింగ్ బేస్డ్ యాక్సెసరీలను శాశ్వతంగా ఎండ్ చేసింది. ఇకపై అంతా డివైసెస్‌లో యూఎస్‌బీ-సీకి ట్రాన్సిషన్ సపోర్ట్ ఉంటుంది.

ఆపిల్ భవిష్యత్ స్ట్రాటజీ

ఆపిల్ 2025 క్లీనప్ ఫోకస్డ్ ప్రొడక్ట్ స్ట్రాటజీని హైలైట్ చేస్తుంది. తక్కువ, మరింత వెరైటీ ప్రొడక్ట్స్ కావాలని కంపెనీ కోరుకుంటోంది. భవిష్యత్ లైనప్‌లు, డిజైన్ క్లారిటీ, పర్ఫామెన్స్ అప్‌గ్రేడ్స్‌పై ప్రయారిటీ ఇస్తాయి.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×