E-Paper
Advertisement

Film Chamber Elections 2025: రేపే ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు… బలాలు ఎలా ఉన్నాయంటే?

Film Chamber Elections 2025: రేపే ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు… బలాలు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Film Chamber Elections 2025: తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఈసారి హోరా హోరీగా సాగనున్నాయి. ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ తో పాటు మన ప్యానెల్ కూడా సిద్ధమవుతోంది. 2025 – 27 సంవత్సరానికి గాను జరగబోతున్న ఈ ఎన్నికలు రేపు అనగా డిసెంబర్ 28న జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు ప్యానల్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన ప్యానెల్ కు ప్రాతినిథ్ వహిస్తున్న సీనియర్ నిర్మాతలు మరియు ఛాంబర్ ప్రముఖులు మద్దతు ఇస్తున్నారు.

మన ప్యానెల్

మన ప్యానెల్ ఈసీ అభ్యర్థులుగా అమ్మిరాజు కనుమిల్లి, వై వి ఎస్ చౌదరి, శ్రీ కళ్యాణ్, కేశవరావు పల్లి, లక్ష్మీ కరుణ నట్టి, మోహన్ వడ్లపట్ల, పద్మిని నాగులపల్లి, ప్రసన్న కమార్ తుమ్మల, రామకృష్ణ గౌడ్ ప్రతాని, రామ సత్యనారాయణ తుమ్మలపల్లి, చదలవాడ శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు ఎస్ ఈ అభ్యర్థులు మన పానెల్ తరఫున పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మన ప్యానెల్ సభ్యులకు సీనియర్ నిర్మాతలు అయిన చెదడవాడ శ్రీనివాసరావు శ్రీ కళ్యాణ్ ప్రసన్నకుమార్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మన ప్యానెల్ నుంచి ఛాంబర్ లోని నాలుగు విభాగాల ప్రతినిధులు పోటీ చేస్తున్నారు. ఈ ప్రచారం కార్యక్రమాలలో భాగంగా తమ ఏజెండాల గురించి కూడా వివరిస్తున్నారు.

ప్రధాన ఎజెండా..

Advertisement

చిన్న సినిమాల ప్రయోజనాలను కాపాడటమే ప్రధాన ఎజెండగా మన ప్యానెల్ సభ్యులు తెలియజేస్తున్నారు. గిల్డ్ పేరుతో కొంతమంది నిర్మాతలు పరిశ్రమను శాసిస్తున్నారని దానికి వ్యతిరేకంగా సామాన్య నిర్మాతలకు న్యాయం చేయడమే తమ ఏజెండాగా భావిస్తున్నారు. పరిశ్రమలో తిరిగి క్రమశిక్షణను తీసుకురావడం థియేటర్ల సమస్యలను పరిష్కరించడమే మన ప్యానెల్ ప్రధాన లక్ష్యం.

* ప్రతి సినిమాకు 25 థియేటర్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు .చిన్న సినిమాలకు క్యూబ్, యు ఎఫ్ ఓ లాంటి చార్జీలను తొలగిస్తామని తెలిపారు ఒకేరోజు పది సినిమాలు విడుదల కాకుండా శని ఆదివారాలలో కూడా సినిమాలను విడుదల చేసేలా ఏర్పాట్ల చేస్తామని ప్యానెల్ సభ్యుల ప్రధాన లక్ష్యాలను తెలియజేస్తూ తమ ప్యానెల్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Advertisement

ప్రోగ్రెసివ్ ప్యానెల్:

ప్రోగ్రెసివ్ ప్యానెల్ ప్రధాన అంశాలు ఎజెండా విషయానికి వస్తే.. గిల్డ్ మరియు ఇతర సంఘాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి చిన్న పెద్ద నిర్మాతలకు సమన్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాన ఎజెండా..

ఓటీటీలో సినిమాల విడుదల విషయంపై స్పష్టమైన నిబంధనలను తీసుకురావడం. సినిమా నిర్మాణం వ్యయం తగ్గించడానికి అవసరమైన చర్యలను చేపట్టడం, థియేటర్ల యాజమానిలో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం. సేవ్ ఫీలిం ఛాంబర్ అనే నినాదంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ బరిలోకి దిగారు. ఈ ప్యానెల్ లో ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు ,అల్లు అరవింద్, అశోక్ కుమార్, ప్రియాంక దత్ వంటి ప్రముఖులు ఉన్నారు. మరి రేపు జరగబోయే ఈ ఫిలిం చాంబర్ ఎన్నికలలో గెలుపు మన ప్యానెల్ సొంతమవుతుందా? లేదా ప్రోగ్రెసివ్ ప్యానెల్ సొంతం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Drugs Case: రకుల్ తమ్ముడు రెగ్యులర్ డ్రగ్స్ కస్టమర్… వార్నింగ్ ఇచ్చినా మారలేదు

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×