E-Paper
Advertisement

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ.2,400 లోపు ‘క్రోమా 2000W ఇండక్షన్’ కుక్‌టాప్!

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ.2,400 లోపు ‘క్రోమా 2000W ఇండక్షన్’ కుక్‌టాప్!

Flipkart Offers: ఒక్కసారిగా గ్యాస్ రేట్లు పెంచేసరికి సామాన్యులకు సిలిండర్ కొనడం ఆర్థిక భారంగా మారుతోంది. అందుకే చాలామంది ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి టైంలో ఇండక్షన్ కుక్‌టాప్‌లు మంచి బెస్ట్ ఆప్షన్‌గా మారుతున్నాయి. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ‘క్రోమా 2000W ఇండక్షన్ కుక్‌టాప్’ మీద ఊహించని రేంజ్‌లో ఆఫర్ నడుస్తోంది. దీని అసలు ధరతో పోలిస్తే ఏకంగా 50 శాతం కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. మంచి బ్రాండెడ్ కుక్‌టాప్ కోసం చూస్తున్న వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.

10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్:

క్రోమా ఇండక్షన్ కుక్‌టాప్ అసలు ధర మార్కెట్లో సుమారు రూ.5,000 వరకు ఉంటుంది. కానీ, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా దీనిపై భారీ తగ్గింపు ప్రకటించారు. అన్ని డిస్కౌంట్లు పోను ఇది కేవలం రూ.2,200 నుండి రూ.2,400 మధ్యలో లభిస్తోంది. అంటే.. సగం కంటే తక్కువ ధరకే  వచ్చేస్తోందన్న మాట. దీనికి తోడు మీ దగ్గర ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉంటే అదనంగా మరో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే ఛాన్స్ కూడా ఉంది.

Also Read: టీవీ అవసరం లేదు.. ఈ మినీ ప్రొజెక్టర్‌తో ఇంటి గోడనే సినిమా థియేటర్ చేసేయండి!

ఫుల్ టచ్ ప్యానెల్ ఫీచర్:

ఈ కుక్‌టాప్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా పనితీరులో కూడా టాప్ అనిపిస్తుంది. దీనికి పాత మోడల్స్ లాగా బటన్లు ఉండవు. మొబైల్ లాంటి ఫుల్ టచ్ ప్యానెల్ ఉంటుంది. దీనివల్ల వంట చేసేటప్పుడు సెట్టింగ్స్ మార్చుకోవడం చాలా ఈజీ. 2000 వాట్ల పవర్ ఉండటం వల్ల పాలు కాచడం, నీళ్లు వేడి చేయడం వంటి పనులు సెకన్ల మీద అయిపోతాయి. అలాగే దీనిలో వంట రకాన్ని బట్టి వేడిని అడ్జస్ట్ చేసుకోవడానికి రకరకాల ప్రీ సెట్ మెనూలు కూడా ఇచ్చారు. దీంతో మనం వండే ఐటమ్‌ను బట్టి జస్ట్ ఒక టచ్ చేస్తే చాలు, అదే కావాల్సిన ఉష్ణోగ్రతను సెట్ చేసేసుకుంటుంది.

మంచి క్వాలిటీ.. సేఫ్టీ కూడా:

క్రోమా బ్రాండ్ నుంచి వస్తున్న ఈ ప్రొడక్ట్ నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడలేదు. పైన ఉండే క్రిస్టల్ గ్లాస్ ఫినిషింగ్ చాలా గట్టిగా ఉండటమే కాకుండా వంట పూర్తయ్యాక తుడవటం కూడా చాలా సులభం. భద్రత కోసం దీనిలో ఆటో షట్‌ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. ఒకవేళ మీరు కుక్‌టాప్ ఆన్ చేసి గిన్నె పెట్టడం మర్చిపోయినా లేదా ఎక్కువ వేడి అయినా ఇది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. తద్వారా కరెంట్ ఆదా అవ్వడంతో పాటు మనం కూడా సేఫ్‌గా ఉండొచ్చు. వంట పనిని వేగంగా, స్మార్ట్‌గా మార్చుకోవాలనుకునే వారు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి.

Also Read: రూ.25 వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, IP69 రేటింగ్‌తో వివో Y51 ప్రో లాంచ్!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×