E-Paper
Advertisement

Kamakshi Bhaskarla: నిరాశగా అనిపిస్తే చాలు.. శవాల మధ్యలో కూర్చుంటా.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!

Kamakshi Bhaskarla: నిరాశగా అనిపిస్తే చాలు.. శవాల మధ్యలో కూర్చుంటా.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!
Advertisement

Kamakshi Bhaskarla: కొంతమంది హీరోయిన్లు సినిమాలతోనే కాకుండా తమ సోషల్ మీడియా వీడియోల ద్వారా కూడా తెగ ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు.. కామాక్షి భాస్కర్ల. చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో చేసిన పాత్రలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరోపక్క ఆమె సోషల్ మీడియాలో చేసే కొన్ని వీడియోలు అలానే ఆమె చెప్పే కొన్ని మాటలు ఎప్పటికప్పుడు అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా ఆకట్టుకుంటూ ఉంటాయి.

కామాక్షి భాస్కర్ల అసలు వృత్తి డాక్టర్. ఆమె చైనాలో ఎంబీబీఎస్ చదివింది. చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేసింది. అయితే చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండటంతో తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

Advertisement

ఆమె 2019లో విడుదలైన ప్రియురాలు అనే సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రలు చేసింది. కానీ ఆమెకు అసలు గుర్తింపు తెచ్చింది మా ఊరి పొలిమేర సినిమా. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. తర్వాత వచ్చిన పొలిమేర 2 సినిమాలో కూడా ఆమె లక్ష్మీ పాత్రలో నటించి మరింత పేరు సంపాదించింది.

ఈ సినిమాలో చేసిన నటనకు గాను కామాక్షి భాస్కర్లకు 2024లో న్యూ ఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. దీంతో ఆమె పేరు మరింతగా వినిపించింది.

Advertisement

ఇటీవల కామాక్షి నటించిన “12A రైల్వే కాలనీ” అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చేసింది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అక్కడికే వెళ్తా..!

తనకు చాలా ఒత్తిడి లేదా నిరాశగా అనిపించినప్పుడు ఒక ప్రత్యేకమైన పని చేస్తానని ఆమె తెలిపింది. మనసుకు ప్రశాంతత కావాలనిపించినప్పుడు తాను స్మశానానికి వెళ్తానని చెప్పింది. అక్కడికి వెళ్లినప్పుడు జీవితం గురించి చాలా విషయాలు గుర్తుకు వస్తాయని ఆమె చెప్పింది.

స్మశానంలో కొంతసేపు నిశ్శబ్దంగా ఉండటం వల్ల మనసుకు ఒక రకమైన శాంతి లభిస్తుందని కామాక్షి తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత తనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు.. అనిపిస్తుందని కూడా చెప్పింది.కానీ అలా శవాల మధ్యలో కూర్చుంటే తనకు మనశాంతి వస్తుంది అని ఈ హీరోయిన్ అనధం అందరిని ఆశ్చర్యపరిస్తోంది.

కామాక్షి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె ఆలోచనను ఆసక్తికరంగా చూస్తుండగా, మరికొందరు ఆశ్చర్యంగా భావిస్తున్నారు.

ALSO READ: Rajendra Prasad: వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్…తమిళంలో సారీ చెప్పిన నటుడు..!

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×