E-Paper
Advertisement

తక్కువ ధరలో ప్రీమియం మ్యూజిక్..బెస్ట్ 5 సోనీ హెడ్‌ఫోన్స్ ఇవే!

తక్కువ ధరలో ప్రీమియం మ్యూజిక్..బెస్ట్ 5 సోనీ హెడ్‌ఫోన్స్ ఇవే!
Advertisement

Best budget Sony headphones 2026: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ మంచి హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ ఫోన్ అవసరం కచ్చితంగా ఉంటుంది. అయితే.. ప్రీమియం ఫీచర్లు ఉన్న హెడ్ సెట్ కావాలంటే వేలకు వేలు ఖర్చు ,చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ, ఆడియో దిగ్గజం సోనీ కంపెనీ తక్కువ బడ్జెట్‌లోనే హై-ఎండ్ ఫీచర్లు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. యూజర్ రివ్యూల ఆధారంగా మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ ఎఫర్డబుల్ సోనీ హెడ్‌ఫోన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

5 బెస్ట్ హెడ్ సెట్ మోడల్స్:

1. Sony WH-CH520:

బడ్జెట్ ధరలో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకునే.. వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ ఆన్-ఇయర్ వైర్‌ లెస్ హెడ్‌ ఫోన్స్ కేవలం చూడటానికి మాత్రమే కాదు,ఫర్మామెన్స్‌లో అదుర్స్. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఏకంగా 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంటే.. దాదాపు వారం రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా.. మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. అంతేకాదు.. లైట్‌వెయిట్ డిజైన్ కారణంగా రోజంతా పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి ఉండదు. దీనిలో మల్టీపాయింట్ కనెక్షన్ ఫీచర్ ఉండటం వల్ల ఒకేసారి రెండు డివైజెస్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

2. Sony WH-CH720N:

మీకు తక్కువ ధరలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కావాలంటే దీనిని మించిన ఆప్షన్ లేదు. సోనీ ప్రీమియం హెడ్‌ఫోన్స్ టెక్నాలజీని పోలిన ఫీచర్లు ఇందులో తక్కువ ధరకే లభిస్తాయి. బయటి ప్రపంచపు శబ్దాలను పూర్తిగా కట్ చేసి, కేవలం మ్యూజిక్‌పై ఫోకస్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. అంతే కాకుండా దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చాలా స్పీడ్‌గా పని చేస్తుంది. ఆఫీస్ మీటింగ్స్ లేదా ప్రయాణాల్లో ఇది మీకు బెస్ట్ ఫీల్ ఇస్తుంది.

3. Sony WF-C500:

Advertisement

ఒక వేళ మీకు ఓవర్-ఇయర్ లేదా ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ కంటే.. చెవుల్లో ఈజీగా ఇమిడిపోయే చిన్న ఇయర్‌ బడ్స్ ఇష్టమైతే, సోనీ డబ్ల్యూఎఫ్‌-సీ500 మీకు కచ్చితంగా నచ్చుతాయి. ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కాంపాక్ట్ సైజ్‌లో వస్తాయి. అంతే కాకుండా సౌండ్ క్వాలిటీ పరంగా చాలా రిచ్‌గా ఉంటాయి. వీటిలో వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండటం వల్ల జిమ్ చేసేటప్పుడు, వర్కౌట్లు చేసేటప్పుడు.. లేదా జాగింగ్‌కు వెళ్లేటప్పుడు వాడటానికి ఇవి సూపర్‌గా సెట్ అవుతాయి.

4. Sony WF-C700N:

చిన్న సైజులో పవర్ ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్ కోరుకునే వారి కోసమే ఈ మోడల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీని ఎర్గోనామిక్ డిజైన్ చెవుల్లో ఇమిడిపోతుంది. దీనిలోని యాంబియంట్ సౌండ్ మోడ్ ద్వారా చుట్టుపక్కల ఏం జరుగుతుందో వింటూనే పాటలు ఎంజాయ్ చేయెచ్చు. సోనీ హెడ్ కనెక్ట్ యాప్ సపోర్ట్ ద్వారా మీ టేస్ట్‌కు తగ్గట్టుగా ఈక్వలైజర్ సెట్టింగ్స్ మార్చుకునే అవకాశం కూడా ఇందులో లభిస్తుంది.

Also Read: పండగ సేల్‌లో భారీ షాక్..కొనుగోళ్లకు దూరంగా ఉంటున్న జనాలు!

5.Sony MDR-ZX110:

ఎలాంటి ఛార్జింగ్ టెన్షన్ లేకుండా..అత్యంత తక్కువ బడ్జెట్‌లో కేవలం వైర్డ్ కనెక్షన్‌తో పనిచేసే క్లాసిక్ మోడల్ ఇది. స్టూడెంట్స్ కోసం, రోజూ సాధారణ ఆడియో అవసరాల కోసం ఇది చాలా బాగుంటుంది. ఫోల్డబుల్ డిజైన్ ఉండటం వల్ల బ్యాగులో ఎక్కడికైనా ఈజీగా సర్దుకుని తీసుకెళ్లొచ్చు. సోనీ బ్రాండ్ నమ్మకం , బేసిక్ సౌండ్ క్లారిటీ కోరుకునే వారికి ఇది ఎప్పటికీ బెస్ట్ బడ్జెట్ ఆప్షనే.

మ్యూజిక్ లవర్స్ అందరికీ బడ్జెట్ , అవసరాలకు తగ్గట్టుగా సోనీ ఈ హెడ్‌ఫోన్స్‌ను బెస్ట్ ఫీచర్లతో రూపొందించింది.ఈ బడ్జెట్ గాడ్జెట్లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ బడ్జెట్‌కు సరిపోయే సోనీ హెడ్‌ఫోన్‌ను ఇప్పుడే ఎంచుకుని మ్యూజిక్ ప్రపంచంలో తేలిపోండి!

Related News

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్..మీ ఇంటి అవసరాలకు ఏది బెస్ట్?

అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టార్టప్ విప్లవం..స్పేస్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు..!

ఈ ఫోన్ డిస్‌ప్లే రిపేర్ ఖర్చుతో iPhone 18 Pro కొనేయొచ్చు.. యాపిల్ కొత్త ఫోల్డబుల్ రేట్లు తెలుసా?

ఎండ తగలగానే కలర్ మారే లెన్స్.. నథింగ్ AI గ్లాసెస్ ఫీచర్లు చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది!

పండగ సేల్‌లో భారీ షాక్..కొనుగోళ్లకు దూరంగా ఉంటున్న జనాలు!

లేటెస్ట్ అప్‌డేట్..మొబైల్ ఫోన్లలో ఏఐ ‘ఆస్క్ యూట్యూబ్’ ఫీచర్ లాంచ్!

ఇకపై అనౌన్ కాల్స్ ఉండవు.. ఫోన్‌లో కాలర్ అసలు పేరు చూపే CNAP సేవలు ప్రారంభం!

Big Stories

Advertisement
×