E-Paper
Advertisement

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే
Advertisement

Wife Loan Default Husband Forced Pay| భార్య తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో భర్తకు వచ్చే పెన్షన్ డబ్బు నుంచి బ్యాంకు ఏకంగా రూ.5 లక్షలు కట్ చేసింది. అయితే, తన పెన్షన్ డబ్బును బ్యాంకు అనుమతి లేకుండా తీసుకోవడంపై ఆ రిటైర్డ్ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణ చేసిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

అసలు ఏం జరిగింది?

ఒడిశాలోని మాంచేశ్వర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిన భరత్ చంద్ర మల్లిక్‌కు నెలకు సుమారు రూ.35,000 పెన్షన్ వస్తుంది. ఆయన భార్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి వాహనాల కొనుగోలుకు రుణాలు తీసుకున్నారు. ఈ రుణాల్లో కొన్ని వాహన రుణాలకు మల్లిక్ హామీదారుగా సంతకాలు చేశారు. రుణగ్రహీత డబ్బు చెల్లించకపోతే హామీదారుపై కూడా బాధ్యత పడే అవకాశం ఉంటుంది.
అయితే, ఆయన భార్య రెండు వాహన రుణాల చెల్లింపుల్లో విఫలమయ్యారు. దీంతో బ్యాంకు ఆ రుణ ఖాతాలను 2018 నవంబర్‌లో నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది.

భర్త జాయింట్ అకౌంట్ నుంచి రూ.5 లక్షలు వసూలు

Advertisement

2024 ఫిబ్రవరి 17న మల్లిక్ దంపతుల జాయింట్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.2.3 లక్షలు స్టేట్ బ్యాంక్ తీసుకుంది. రెండు రోజుల తర్వాత మరో రూ.2.7 లక్షలు డెబిట్ చేసింది. ఇలా మొత్తం రూ.5 లక్షలను బ్యాంకు వసూలు చేసింది. అయితే, ఆ ఖాతాలో మల్లిక్‌కు వచ్చే పెన్షన్ డబ్బు కూడా ఉంది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా డబ్బు తీసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, వాహన రుణాలను 2023లో క్రెడిట్ గ్యారంటీ పథకం కింద పరిష్కరించినట్లు ఆయన వాదించారు. తన కుమార్తె వివాహం కోసం ఆ డబ్బు అవసరమని చెబుతూ, 2025 జనవరిలో బ్యాంకును సంప్రదించారు. కానీ తనకు పరిష్కారం లభించలేదని ఆయన పేర్కొన్నారు.

Also Read: క్రెడిట్ కార్డు ఓవర్‌లిమిట్ సదుపాయం వల్ల లాభాలు, నష్టాలు.. భారీ ఫైన్ పడకుండా ఈ టిప్స్ పాటించండి

పెన్షన్ డబ్బుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Advertisement

ఈ కేసును విచారణ చేసిన జస్టిస్ సంజీబ్ కుమార్ పాణిగ్రాహి 2025 అక్టోబర్ 17న తీర్పు వెలువరించారు. పెన్షన్ అనేది పదవీ విరమణ చేసిన వ్యక్తి జీవన భద్రతకు కీలకమైన ఆదాయమని కోర్టు పేర్కొంది. సివిల్ ప్రొసీజర్ కోడ్, 1908లోని సెక్షన్ 60(1)(g) ప్రకారం ప్రభుత్వ పెన్షన్‌కు నిర్దిష్ట చట్టపరమైన రక్షణ ఉంటుంది. పెన్షన్ డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేసినంత మాత్రాన ఆ రక్షణ పూర్తిగా తొలగిపోదని కోర్టు స్పష్టం చేసింది.
జాయింట్ అకౌంట్‌లో పెన్షన్ ఉన్నందుకు బ్యాంకు తన ఇష్టానుసారంగా డబ్బు కట్ చేయడానికి తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. ముందస్తు నోటీసు లేదా తగిన చట్టపరమైన ప్రక్రియ లేకుండా డబ్బు వసూలు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది.

Also Read: ఉద్యోగం వదిలి వ్యవసాయం.. ఎకరాకు రూ.30 లక్షలు ఆదాయం.. ఆంధ్రా యువకుడి భలే ఐడియా

పెన్షనర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం

ఈ తీర్పు పెన్షన్ పొందే వ్యక్తుల హక్కుల ప్రాధాన్యతను తెలియజేస్తుంది. రుణాల వసూళ్ల కోసం బ్యాంకులు చట్టపరమైన నిబంధనలను పాటించాలి. అయితే, రుణానికి హామీదారుగా ఉన్న వ్యక్తికి చెల్లింపు బాధ్యతలు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ తీర్పు ప్రతి రుణ వసూళ్లను నిషేధించిందని భావించకూడదు. పెన్షన్‌కు వర్తించే రక్షణను, వసూళ్లకు అనుసరించాల్సిన చట్టపరమైన విధానాన్ని బ్యాంకులు గౌరవించాలని ఈ కేసు స్పష్టం చేస్తుంది.

Related News

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

చదువుతూనే సంపాదన.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారిన లా స్టూడెంట్.. తొలిరోజు సంపాదన ఎంతంటే?

లింక్డ్‌ఇన్ డేటాతో యువతికి వేధింపులు.. జాబ్ కోసం నంబర్ ఇస్తే.. ఇదా పరిస్థితి?

బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోళ్లదారుల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంత?

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

Big Stories

Advertisement
×