Croma Republic Day 2026 Sale: జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ Croma తన కస్టమర్లను ఆకట్టుకునేలా బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే మొదలైన ఈ ప్రత్యేక Republic Day సేల్‌లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అప్లయన్సెస్‌పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు, యాపిల్ ప్రియులకు ఈ సేల్ గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.
క్రోమా రిపబ్లిక్ డే సేల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది యాపిల్ ఉత్పత్తులపై ఉన్న ఆఫర్లు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా MacBook Air M4 కేవలం రూ.53,913కే లభిస్తోంది. దీనిలో బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, పాత ల్యాప్‌టాప్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి కూడా ఉన్నాయి. ఇక ఐఫోన్ ప్రియుల కోసం.. iPhone 17 Pro, Pro Max వంటి మోడళ్లను Apple Care Plusతో కలిపి కొంటే.. రూ.12,900 విలువైన AirPods ఫ్రీగా పొందవచ్చు. టాటా నియో HDFC కార్డ్ వాడేవారికి అదనంగా 10% వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
Also Read: సెప్టెంబర్ సెంటిమెంట్‌కు బ్రేక్? ఐఫోన్ 18 లాంచ్ టైమ్ మారింది.. పూర్తి వివరాలు ఇవిగో!
బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే కరెక్ట్ టైమ్. శాంసంగ్ 65 అంగుళాల Neo QLED టీవీ ధర రూ.1,75,000 నుండి ఏకంగా రూ.94,990కి పడిపోయింది. అలాగే TCL 55 అంగుళాల క్యూలెడ్ టీవీ కేవలం రూ.36,990కే వచ్చేస్తుంది. ఎల్‌జీ కంపెనీకి చెందిన ప్రీమియం మినీ ఎల్‌ఈడీ టీవీలు, సౌండ్‌బార్లపై కూడా క్రోమా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఇంటి అవసరాల కోసం కొత్త ఫ్రిజ్ కొనాలనుకునే వారికి క్రోమా బ్రాండ్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లపై మంచి డీల్స్ అందిస్తోంది. 300 లీటర్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోడల్స్ రూ.29,490 ధరకే అందుబాటులో ఉన్నాయి. సామాన్యులు కూడా తమ ఇంటిని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి Croma ఈ ప్రత్యేక ధరలను అందుబాటులోకి తెచ్చింది.
మొబైల్స్ విభాగంలో Oppo, Samsung ఫోన్లపై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Oppo Reno 15 కొనుగోలుపై రూ.3,999 విలువైన OPPO Enco Budsను ఫ్రీగా పొందొచ్చు. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే ఈ ఫోన్ ధర రూ.21,399కి తగ్గుతుంది. అలాగే Samsung Galax A56 ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.28,499కే లభిస్తోంది.
Also Read: 7200mAh బ్యాటరీ, 200MP కెమెరా.. ఫోల్డబుల్ ఫోన్ల రికార్డులు తిరగరాయనున్న హానర్ మ్యాజిక్ V6!