E-Paper
Advertisement

Mosquito Machines: దోమలతో అల్లాడుతున్నారా? ఈ మస్కిటో మిషన్లు ట్రై చేయండి.. ఒక్క దోమ కనిపించదు!

Mosquito Machines: దోమలతో అల్లాడుతున్నారా? ఈ మస్కిటో మిషన్లు ట్రై చేయండి.. ఒక్క దోమ కనిపించదు!
Advertisement

Mosquito Machines: సాధారణంగా సమ్మర్ లో వచ్చే సమస్యల్లో దోమల బెడద ఒకటి. పగలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు.. రాత్రిళ్లు దోమలు రూపంలో మరో సమస్య ఎదురవుతుంటుంది. అయితే వీటిని నివారించే మస్కిటో మిషన్లు (Mosquito Killer Machines) చాలానే మార్కెట్ లో ఉన్నప్పటికీ అవి సరిగ్గా పనిచేయడం లేదన్న అభిప్రాయం వినియోగదారుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాలోనే టాప్ – 5 మస్కిటో మిషన్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిని ఉపయోగించడం ద్వారా దోమల బెడద నుంచి ఇట్టే బయటపడవచ్చు.

AutoMos Mosquito Repellent Machine

హైకేర్ (HiCare) సంస్థ నుండి వచ్చిన ఈ యంత్రం.. దేశంలోనే తొలి ఆటోమేటిక్ మిస్కిటో మిషన్. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని సెన్సార్లు మనం సెట్ చేసుకున్న సమయానికి అనుగుణంగా స్ప్రేని విడుదల చేస్తాయి. ఇది చాలా తక్కువ కెమికల్స్‌తో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. కిటికీలు తెరిచి ఉన్నా కూడా ఇది దోమలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. కాబట్టి రాత్రిళ్లు ఎలాంటి దోమల బెడద లేకుండా హాయిగా పడుకోవచ్చు.

Hygiene 30W Ultra UV Tube

Advertisement

ఇంట్లోని పెద్ద గదులు లేదా ఆఫీసుల కోసం చూస్తున్నట్లయితే ఈ మస్కిటో మిషన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇందులో ఉండే 30 వాట్ల అల్ట్రా వయొలెట్ ట్యూబ్ లైట్లు దోమలతో పాటు ఇతర చిన్న పురుగులను తనవైపునకు ఆకర్షిస్తాయి. ట్యూబ్ లైట్ కు ఉన్న ఎలక్ట్రిక్ గ్రిడ్ ను తాకగానే అవి చనిపోతాయి. ఇది ఎలాంటి కెమికల్స్ ను విడుదల చేయకుండానే దోమలను అడ్డుకుంటుంది.

MOSQIL Mosquito Killer Machine

చిన్న పిల్లలు లేదా గర్భిణీలు ఉన్న ఇళ్లకు ఈ మోస్కిల్ యంత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దోమలను ఆకర్షించడానికి బయోనిక్ టెక్నాలజీ, UV కాంతిని ఉపయోగిస్తుంది. దోమలు దగ్గరకు రాగానే ఇందులో ఉండే శక్తివంతమైన ఫ్యాన్ వాటిని లోపలికి లాగేసి ఒక బాక్స్‌లో బంధిస్తుంది. దీనివల్ల ఎలాంటి వాసన లేదా పొగ రాదు. కాబట్టి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

iBELL Insect Killer Machine

Advertisement

ఐబెల్ కంపెనీకి చెందిన ఈ యంత్రం కరెంటుతో పనిచేస్తుంది. ఇది గాలిలో తిరిగే దోమలను, ఈగలను అధిక వోల్టేజ్ ఉన్న మెటల్ గ్రిడ్ ద్వారా నిర్మూలిస్తుంది. దీని చుట్టూ రక్షణ కోసం గ్రిల్ లాంటి కవచం ఉండటం వల్ల ఇంట్లోని పెంపుడు జంతువులకు లేదా పిల్లలకు ఎలాంటి సమస్య ఉండదు.

Also Read: Garikapati Controversy: గరికపాటి గుడ్డు పంచాయితీ.. చివాట్లు తినడానికి కాకపోతే.. అవసరమా మీకిది పెద్దాయన!

All Out or Hit Mosquito Bat

దోమలను వెంటనే చంపాలనుకునే వారికి ‘ఆల్ అవుట్’ లేదా ‘హిట్’ కంపెనీల ఎలక్ట్రిక్ బ్యాట్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి రీఛార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తాయి. వీటి నిర్మాణం స్ట్రాంగ్ గా ఉండటంతో పాటు ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా రోజుల పాటు వచ్చేలా బ్యాటరీ బ్యాకప్ ను ఇవి కలిగి ఉంటాయి. తక్కువ ధరలో తక్షణ పరిష్కారం కోరుకునే వారికి ఈ దోమల బ్యాట్లు.. బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు.

Also Read: Jeevan Reddy: జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠ.. మంత్రులతో రేవంత్ రాయభారం.. బుజ్జగింపులు ఫలించేనా?

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×