E-Paper
Advertisement

Philips vs Samsung: టీవీ బ్రాండ్ చూసి మోసపోతున్నారా? శాంసంగ్, ఫిలిప్స్‌లో ఏది వాల్యూ ఫర్ మనీ?

Philips vs Samsung: టీవీ బ్రాండ్ చూసి మోసపోతున్నారా? శాంసంగ్, ఫిలిప్స్‌లో ఏది వాల్యూ ఫర్ మనీ?
Advertisement

Philips vs Samsung: మంచి స్మార్ట్ టీవీ కొనాలంటే బడ్జెట్ ఎంత ముఖ్యమో, టీవీలో ఉండే ఫీచర్లు కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో ఫిలిప్స్ 55 ఇంచుల 4K ఆండ్రాయిడ్ టీవీ, శాంసంగ్ 55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ టీవీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ రెండిటిలో ఏది కొనాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు టీవీల మధ్య ఉన్న తేడాలు ఏమిటి? ఏ టీవీలో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి? ఏది కంటే తక్కువ ఖర్చవుతుంది.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది?

టీవీ కొనేదే అందులో వచ్చే బొమ్మ స్పష్టంగా ఉండాలని. అలాంటప్పుడు ఫిలిప్స్ టీవీని కళ్లు మూసుకుని కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే ఇది 4K అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. దీంతో పిక్చర్ చాలా క్లారిటీగా, కలర్స్ నేచురల్‌గా కనిపిస్తాయి. పైగా దీనిలో HDR సపోర్ట్ ఉంది కాబట్టి, చీకటిగా ఉండే సీన్లు కూడా చాలా నీట్‌గా కనిపిస్తాయి. అదే శాంసంగ్ విషయానికి వస్తే.. ఈ టీవీ కేవలం ఫుల్ హెచ్‌డీ మాత్రమే. ఫిలిప్స్‌తో పోలిస్తే క్లారిటీలో కొంచెం తక్కువనే చెప్పాలి.

Advertisement

Also Read: వంట మనిషి అక్కర్లేదు, వడ్డించనవసరం లేదు.. అంతా ఈ మెషీన్ చూసుకుంటుంది!

యాప్స్ వాడుకోవడం సులువేనా?

ఫిలిప్స్ టీవీ పక్కా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. మన ఫోన్‌లో వాడుకున్నట్టే గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్‌ని ఈజీగా వాడుకోవచ్చు. శాంసంగ్ కూడా స్మార్ట్ టీవీయే కానీ, అది వారి సొంత సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఆండ్రాయిడ్‌తో పోలిస్తే శాంసంగ్‌లో మనకు నచ్చినన్ని యాప్స్ దొరకకపోవచ్చు. మీరు ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు ఎక్కువగా చూసేవారైతే ఫిలిప్స్ బెటర్.

సౌండ్, కనెక్టివిటీ సంగతేంటి?

Advertisement

ఫిలిప్స్ మోడల్‌లో 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు ఉన్నాయి. దీంతో గేమింగ్ కన్సోల్స్ లేదా సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. శాంసంగ్‌లో కూడా ఇవన్నీ ఉన్నా, ఫిలిప్స్ లోని లేటెస్ట్ టెక్నాలజీ వల్ల కనెక్టివిటీ ఆప్షన్స్ కొంచెం మెరుగ్గా ఉన్నాయి. సౌండ్ విషయంలో రెండూ గట్టిగానే ఉన్నా, ఆ 4K పిక్చర్ క్వాలిటీకి సినిమాటిక్ ఫీల్ రావాలంటే ఫిలిప్స్ టీవీ తీసుకోవడం సరైన నిర్ణయం.

ధరలు ఎలా ఉన్నాయంటే?

ఫిలిప్స్ 4K ఆండ్రాయిడ్ టీవీ ప్రస్తుతం ఆఫర్లలో రూ.42,990 నుండి రూ.48,900 మధ్యలో వచ్చేస్తుంది. దీనిపై HDFC, ICICI బ్యాంక్ కార్డ్స్ వాడితే అదనంగా మరో రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అదే శాంసంగ్ ఫుల్ హెచ్‌డీ టీవీ విషయానికి వస్తే, ఇది పాత మోడల్ అవ్వడం వల్ల స్టాక్ తక్కువగా ఉంది. పైగా దీని ధర రూ.89,000 పైనే ఉంది. ఈ బడ్జెట్‌లో శాంసంగ్‌లోనే కొత్తగా వచ్చిన 4K మోడల్స్ రూ.40,000 లోపే వచ్చేస్తాయి. కాబట్టి.. ఇప్పుడున్న రేట్లను బట్టి చూస్తే, ఫీచర్లు ఎక్కువగా ఉండి తక్కువ ధరకు వస్తున్న ఫిలిప్స్ టీవీనే బెస్ట్ డీల్ అనిపిస్తోంది.

Also Read: మళ్లీ వచ్చేస్తోంది అమెజాన్ ట్రాన్స్‌ఫార్మర్.. ఈ ఏఐ ఫోన్‌లో యాప్స్ అక్కర్లేదు!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×