E-Paper
Advertisement

కొత్త కూలర్ కొంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే మీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే!

కొత్త కూలర్ కొంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే మీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే!
Advertisement

Cooler Buying Guide: ఎండలు ముదురుతున్న వేళ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఎయిర్ కూలర్లను కొంటుంటారు. మార్కెట్లో ఏసీల ధరలు, వాటి కరెంట్ బిల్లులు భరించలేని వారికి కూలర్ అనేది ఒక బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. అయితే.. ప్రస్తుత రోజుల్లో మార్కెట్లోకి వందల రకాల బ్రాండ్లు, రకరకాల టెక్నాలజీలతో కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. ఏ కూలర్ కొనాలి, ఏది మన ఇంటికి సరిపోతుందనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. సరైన అవగాహన లేకుండా కొంటే డబ్బులు వృధా అవ్వడమే కాకుండా ఆశించిన కూలింగ్ కూడా రాదు. అందుకే కొత్త కూలర్ కొనే ముందు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కూలర్ కొనేవారికి చిట్కాలు:

1.రూమ్ సైజును బట్టి కూలర్ :
కూలర్ కొనేటప్పుడు అందరూ చేసే మొదటి తప్పు రూమ్ సైజును పట్టించుకోకపోవడం. మార్కెట్లో ప్రధానంగా పర్సనల్ కూలర్లు, డెజర్ట్ కూలర్లు అని రెండు రకాలు ఉంటాయి. మీ బెడ్‌రూమ్ లేదా చిన్న గది కోసం అయితే పర్సనల్ లేదా టవర్ కూలర్ సరిపోతుంది. ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అంతే కాకుండా శబ్దం కూడా తక్కువగా చేస్తాయి. అదే మీ లివింగ్ రూమ్ (హాల్) లేదా పెద్ద గది కోసం అయితే డెజర్ట్ కూలర్‌ను మాత్రమే ఎంచుకోవాలి. ఇవి పెద్ద ఫ్యాన్ , ఎక్కువ ఎయిర్ త్రో కలిగి ఉండి పెద్ద స్థలాన్ని కూడా త్వరగా చల్లబరుస్తాయి.

Advertisement

2.వాటర్ ట్యాంక్ కెపాసిటీ :
కూలర్ కొనేటప్పుడు దాని వాటర్ ట్యాంక్ సామర్థ్యం ఎంత ఉందో చూసుకోవడం చాలా ముఖ్యం. చిన్న ట్యాంక్ ఉన్న కూలర్ కొంటే.. రాత్రి పూట మధ్యలోనే నీళ్లు అయిపోయి, నిద్ర చెడిపోతుంది. మళ్లీ లేచి నీళ్లు పోయాల్సి వస్తుంది. కాబట్టి.. చిన్న రూమ్‌ల కోసం కనీసం 25 నుంచి 40 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం ఉన్న కూలర్ సరిపోతుంది. అదే పెద్ద హాల్స్ లేదా డెజర్ట్ కూలర్ల విషయానికి వస్తే కనీసం 50 నుంచి 70 లీటర్ల వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న మోడళ్లను ఎంచుకోవడం మంచిది.దీని వల్ల పదే పదే నీళ్లు నింపే శ్రమ తప్పుతుంది.

3.కూలింగ్ ప్యాడ్స్ రకం :
కూలర్ ఎంత చల్లటి గాలిని ఇస్తుందనేది అందులో వాడే కూలింగ్ ప్యాడ్స్‌పైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో సాధారణంగా రెండు రకాల ప్యాడ్స్ లభిస్తాయి. ఒకటి సాంప్రదాయక గడ్డి ప్యాడ్స్, రెండు హనీకోంబ్ ప్యాడ్స్. గడ్డి ప్యాడ్స్ ధర తక్కువగా ఉన్నప్పటికీ.. ఇవి త్వరగా పాడైపోతాయి. వీటిని ప్రతి సంవత్సరం మార్చాల్సి ఉంటుంది. కానీ హనీకోంబ్ ప్యాడ్స్ సెల్యులోజ్ మెటీరియల్‌తో తయారవుతాయి. ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఉండటమే కాకుండా.. ఎక్కువ నీటిని పట్టి ఉంచి అత్యంత చల్లటి గాలిని అందిస్తాయి. కాబట్టి కొంచెం ధర ఎక్కువైనా హనీకోంబ్ ప్యాడ్స్ ఉన్న కూలర్లనే ఎంచుకోండి.

Advertisement

4.కరెంట్ ఆదా, ఇన్వర్టర్ సపోర్ట్:
మారుతున్న కాలంతో పాటు కూలర్లలో కూడా మోటార్ టెక్నాలజీ మారింది. కొత్త కూలర్ కొనేటప్పుడు అది ఎంత కరెంట్ వినియోగిస్తుందో రేటింగ్స్ చెక్ చేయాలి. ముఖ్యంగా వేసవిలో పవర్ కట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. మీ ఇంట్లోని హోమ్ ఇన్వర్టర్‌పై పనిచేసే కూలర్లను కొనడం చాలా మంచిది. ప్రస్తుతం మార్కెట్లోకి బ్రాండెడ్ కంపెనీలు తక్కువ పవర్ తీసుకునే సమర్థవంతమైన మోటార్లతో కూలర్లను అందిస్తున్నాయి. ఇవి మీ కరెంట్ బిల్లును భారీగా తగ్గిస్తాయి.

Also Read: వైఫై స్లో కారణంగా విసిగిపోతున్నారా ? ఈ చిన్న ట్రిక్స్‌తో.. మీ ఇంటర్నెట్ స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్తుంది!

5.నాయిస్ లెవెల్, అదనపు ఫీచర్లు:
చాలా కూలర్లు ఆన్ చేసినప్పుడు విపరీతమైన శబ్దం చేస్తాయి. దీని వల్ల రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోవడం కష్టమవుతుంది. అందువల్ల తక్కువ శబ్దం చేసే మోడళ్లను పరిశీలించండి. దీంతో పాటు ప్రస్తుత మోడ్రన్ కూలర్లలో రిమోట్ కంట్రోల్, ఐస్ ఛాంబర్ (ఐస్ ముక్కలు వేసేందుకు ప్రత్యేక అర), టైమర్ సెట్టింగ్స్ , దోమలు లేదా దుమ్ము లోపలికి వెళ్లకుండా ఉండే మస్కిటో/డస్ట్ ఫిల్టర్లు వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు వస్తున్నాయి. ఇవి కూలర్ వాడకాన్ని మరింత ఈజీ చేస్తాయి.

కూలర్ అనేది ఏసీ లాగా మూసి ఉన్న గదిలో పనిచేయదు. కూలర్ నుంచి మంచి కూలింగ్ రావాలంటే గదిలో ప్రాపర్ వెంటిలేషన్ (గాలి బయటకు వెళ్లే మార్గం) ఉండాలి. కూలర్ వెనక భాగం కిటికీ వైపు ఉండి, గదిలోని వేడి గాలి బయటకు వెళ్లడానికి మరో కిటికీ లేదా తలుపు కొద్దిగా తెరిచి ఉంచినప్పుడే కూలర్ అద్భుతంగా పని చేస్తుంది. కొనేటప్పుడు సదరు బ్రాండ్ వారంటీ , మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×