E-Paper
Advertisement

వైఫై స్లో కారణంగా విసిగిపోతున్నారా ? ఈ చిన్న ట్రిక్స్‌తో.. మీ ఇంటర్నెట్ స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్తుంది!

వైఫై స్లో కారణంగా విసిగిపోతున్నారా ? ఈ చిన్న ట్రిక్స్‌తో.. మీ ఇంటర్నెట్ స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్తుంది!
Advertisement

WiFi Speed Tips: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో.. ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఆఫీస్ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, ఓటీటీలో సినిమాలు చూడటం, లేదా గేమింగ్.. ఇలా దేనికైనా హై-స్పీడ్ ఇంటర్నెట్ ఎంతో అవసరం. అయితే.. చాలా మంది ఇళ్లలో వైఫై కనెక్షన్ ఉన్నప్పటికీ.. స్పీడ్ సరిగ్గా రాక, పదే పదే బఫరింగ్ అవుతూ ఇబ్బంది పెడుతుంటుంది. ఇంటర్నెట్ ప్లాన్ బాగున్నా.. కూడా కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల వైఫై స్లో అవుతుంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే వైఫై స్పీడ్‌ను ఎలా పెంచుకోవచ్చో కొన్ని చిట్కాల ద్వారా ఇప్పుడు చూద్దాం.

వైఫై స్పీడ్ పెంచే చిట్కాలు: 

రూటర్ ప్లేస్‌మెంట్ చాలా ముఖ్యం:
చాలా మంది వైఫై రూటర్ ను ఇంటి మూలల్లోనో, లేదా టీవీ వెనక.. కరెంట్ బోర్డుల పక్కన పెడుతుంటారు. ఇది చాలా తప్పు. వైఫై సిగ్నల్స్ రేడియో తరంగాల రూపంలో అన్ని వైపులా ప్రయాణిస్తాయి. కాబట్టి.. రూటర్‌ను ఎల్లప్పుడూ ఇంటికి మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అలాగే, రూటర్‌ను నేలపై పెట్టకుండా కనీసం ఐదు అడుగుల ఎత్తులో టేబుల్ లేదా షెల్ఫ్ పైన అమర్చాలి. దీని వల్ల సిగ్నల్స్ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇల్లంతా సమానంగా వ్యాపిస్తాయి.

Advertisement

ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంచండి:
ఇంట్లో ఉండే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు వైఫై సిగ్నల్స్‌ను అడ్డుకుంటాయి. ముఖ్యంగా మైక్రోవేవ్ ఓవెన్లు, బ్లూటూత్ స్పీకర్లు, బేబీ మానిటర్లు, ల్యాండ్‌లైన్ కార్డ్‌లెస్ ఫోన్లు వైఫై తరంగాలను డిస్టర్బ్ చేస్తాయి. ఈ పరికరాలు కూడా వైఫై లాగే 2.4 GHz ఫ్రీక్వెన్సీపై పని చేస్తాయి. అందుకే మీ వైఫై రూటర్‌ను ఇలాంటి హోమ్ అప్లయెన్సెస్ కు వీలైనంత.. దూరంగా ఉంచడం ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది.

5GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌కు మారండి:
ప్రస్తుతం వస్తున్న దాదాపు అన్ని రూటర్లు ‘డ్యూయల్ బ్యాండ్’టెక్నాలజీతో వస్తున్నాయి. అంటే ఇవి 2.4 GHz, 5 GHz అనే రెండు రకాల సిగ్నల్స్ ఇస్తాయి. సాధారణంగా అందరి ఫోన్లు 2.4 GHz కే కనెక్ట్ అయి ఉంటాయి. దీని వల్ల అక్కడ రద్దీ ఎక్కువై స్పీడ్ తగ్గుతుంది. మీరు రూటర్ కి దగ్గరగా ఉన్నప్పుడు మీ మొబైల్ లేదా లాప్‌టాప్‌ను 5 GHz బ్యాండ్‌కు కనెక్ట్ చేయండి. ఇందులో పరిధులు కొద్దిగా తక్కువైనా.. ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం అత్యంత వేగంగా, ఎలాంటి అంతరాయం లేకుండా వస్తుంది.

Advertisement

అనవసరమైన డివైజ్‌ల కనెక్షన్లను తొలగించండి:
మీ వైఫై పాస్‌వర్డ్ పక్కింటి వారికి లేదా స్నేహితులకు తెలిసి ఉంటే.. వారు బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం లేదా వీడియోలు చూడటం వల్ల మీ ఇంటర్నెట్ స్లో అయిపోతుంది. మీ రూటర్ సెట్టింగ్స్ లేదా మొబైల్ యాప్‌లోకి వెళ్లి కనెక్ట్ అయిన డివైజ్‌ల లిస్ట్‌ను ఒక సారి చెక్ చేయండి. మీకు తెలియని డివైజ్‌లు ఉంటే.. వెంటనే వాటిని బ్లాక్ చేయండి. అలాగే.. మీ వైఫైకి కస్టమ్ , స్ట్రాంగ్ పాస్‌వర్డ్ (WPA3 ఎన్‌క్రిప్షన్) సెట్ చేయడం వల్ల బ్యాండ్‌విడ్త్ హ్యాక్ అవడాన్ని అరికట్టవచ్చు.

రూటర్ రీబూట్ , ఫర్మ్‌వేర్ అప్‌డేట్:
కంప్యూటర్లు, మొబైల్స్ లాగే వైఫై రూటర్లకు కూడా విశ్రాంతి అవసరం. వారానికి కనీసం ఒక్కసారైనా రూటర్‌ను ఆఫ్ చేసి, ఒక 30 సెకన్లు ఆగి మళ్లీ ఆన్ చేయాలి. ఇలా చేయడం వల్ల రూటర్‌లో ఉన్న క్యాచీ మెమొరీ క్లియర్ అయి, ఇంటర్నెట్ కనెక్షన్ రిఫ్రెష్ అవుతుంది. దీంతో పాటు రూటర్ కంపెనీలు అప్పుడప్పుడు పంపే ఫర్మ్‌వేర్ ను అప్‌డేట్ చేయడం ద్వారా నెట్‌వర్క్ సేఫ్టీ పెరగడమే కాకుండా.. పాత బగ్‌లు తొలగిపోయి స్పీడ్ మెరుగవుతుంది.

Also Read: ఇల్లే ఏసీలా మారుతుంది! లివింగ్ రూమ్ కోసం.. తక్కువ ధరలో సీలింగ్ ఫ్యాన్లు

పెద్ద ఇళ్ల కోసం మెష్ సిస్టమ్ లేదా ఎక్స్‌టెండర్:

ఒకవేళ మీ ఇల్లు పెద్దదిగా లేదా రెండు అంతస్తులుగా ఉంటే.. ఒకే రూటర్ నుంచి అన్ని గదులకు సిగ్నల్ అందడం కష్టం. గోడలు, తలుపుల దాటుకుని సిగ్నల్ వెళ్లేసరికి స్పీడ్ పడిపోతుంది. ఇలాంటి సమయంలో ‘వైఫై రేంజ్ ఎక్స్‌టెండర్’లేదా ‘మెష్ వైఫై సిస్టమ్’ఉపయోగించడం మంచిది. ఇవి రూటర్ నుంచి వచ్చే సిగ్నల్‌ను రీబ్రాడ్‌కాస్ట్ చేసి, సిగ్నల్ లేని డెడ్ జోన్లలో కూడా ఫుల్ నెట్‌వర్క్ వచ్చేలా చేస్తాయి.

గమనిక: పైన పేర్కొన్న చిట్కాలను పాటించిన తర్వాత కూడా మీ ఇంటర్నెట్ స్పీడ్ పెరగకపోతే.. ఒకసారి ‘Fast.com’ లేదా ‘Speedtest.net’ లో స్పీడ్ టెస్ట్ చేయండి. మీ ప్లాన్ ప్రకారం స్పీడ్ రాకుంటే..  ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ను సంప్రదించి లైన్ చెక్ చేయించుకోవడం లేదా మీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం మంచిది.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×