E-Paper
Advertisement

Medak: మంటల్లో కంటైనర్.. తగలబడిన 10 కార్లు, మెదక్ జిల్లాలో ఘటన

Medak: మంటల్లో కంటైనర్.. తగలబడిన 10 కార్లు, మెదక్ జిల్లాలో ఘటన
Advertisement

Medak: మెదక్‌ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. భారీ కంటైనర్‌ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులోని 10 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన గురించి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కంటైనర్ వాహనం, అందులోని కార్లు కాలిపోయాయి. ఘటన ఎలా జరిగింది?

మెదక్ జిల్లాలో ఘటన.. మంటల్లో కంటైనర్

Advertisement

మెదక్ జిల్లా తుప్రాన్ మండలం నాగులపల్లి గ్రామ శివార్లలో గురువారం మధ్యాహ్నం క్యారియర్ ట్రక్కులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ ట్రక్కు.. జాతీయ రహదారి 44పై వెళ్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. కంటైనర్‌లోని ఎనిమిది కార్లు పూర్తిగా కాలిపోయాయి.

అగ్నిప్రమాదం ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బందికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. రోడ్డు మధ్యలో ఘటన జరగడంతో జాతీయ రహదారి -44పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో స్థానిక యంత్రాంగం, పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Advertisement

తగలబడిన 10 కార్లు.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కొద్దిసేపు నిలిపి వేశారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రక్కు, డ్రైవర్ క్యాబిన్ కాలిపోయినట్టు అందులో కనిపించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదృష్టవశాత్తూ డ్రైవర్, క్లీనర్ వాహనం నుండి బయటపడ్డారు.

షోరూమ్‌కు కొత్త కార్లు డెలివరీ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కోట్లలో నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన వెనుక షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపంగా జరిగిందా? తెలియాల్సివుంది. అగ్నిప్రమాదం కారణంగా జరిగి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.

ALSO READ: తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×