బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Advertisement

చాంతాడంత బ్యాటరీ.. మూడు రోజుల బ్యాకప్.. మార్కెట్లోని టాప్-4 బాహుబలి ఫోన్లు!

చాంతాడంత బ్యాటరీ.. మూడు రోజుల బ్యాకప్.. మార్కెట్లోని టాప్-4 బాహుబలి ఫోన్లు!

Battery Phones 2026: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్.. నిత్యవసరంగా మారిపోయింది. ఆఫీస్ వర్క్, సోషల్ మీడియా బ్రౌజింగ్, గేమింగ్, ఓటీటీ స్ట్రీమింగ్ ఇలా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌తోనే చాలా మంది గడుపుతున్నారు. ఈ స్థాయిలో ఫోన్ వాడితే బ్యాటరీ ఎంత వేగంగా తగ్గిపోతుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో చాలానే వచ్చాయి. 6000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఫోన్లు ప్రస్తుతం లభిస్తున్నాయి. వాటిలో అత్యుత్తమ టాప్ – 4 ఫోన్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

Vivo T4 5G

వివో తీసుకొచ్చిన ఈ ఫోన్.. ఏకంగా 7300mAh మెగా బ్యాటరీని కలిగి ఉంది. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను ఫోన్ కు అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో వర్క్ చేయనుంది. దీనికి ప్రీమియం క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, 50MP సోనీ ప్రైమరీ సెన్సార్ ను అందించారు.

Redmi 15 5G

ఈ ఫోన్‌లో 7000mAh సామర్థ్యమున్న ‘షామీ సర్జ్’ (EV-Grade) బ్యాటరీని వాడారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం. అంటే ఈ ఫోన్ ఒక పవర్ బ్యాంక్‌లా మారి స్నేహితుల ఫోన్లను కూడా ఛార్జ్ చేస్తుంది. ఫోన్ లో 1% బ్యాటరీ మిగిలి ఉన్నా.. గంటల పాటు స్టాండ్‌బైలో ఉండే స్మార్ట్ టెక్నాలజీని ఇది కలిగి ఉన్నట్లు షావోమీ వర్గాలు తెలిపాయి.

Moto G86 Power 5G

మోటో జీ86 పవర్ 6720mAh భారీ బ్యాటరీతో రూపొందింది. దీనికి 30W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టు అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 53 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల వర్షంలో తడిచినా, నీళ్లలో పడినా ఈ మెుబైల్ తట్టుకోగలదు. మరోవైపు 6.7-అంగుళాల 1.5K సూపర్ HD pOLED డిస్‌ప్లే, 4,500 నిట్స్ బ్రైట్ నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

Also Read: YouTube వాడుతున్నారా? ఇలా చేస్తే డేటా అయిపోదు.. రోజంతా హ్యాపీగా చూడొచ్చు!

Oppo K14x 5G

ఒప్పో K14x ఫోన్ 6500mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే.. రెండ్రోజుల బ్యాటరీ లైఫ్ ను పొందొచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 6.75-అంగుళాల డిస్‌ప్లేతో పాటు 50MP డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను ఇది కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో ఇది వర్క్ చేయనుంది. దీనికి ఇచ్చిన గ్లౌవ్ టచ్  టెక్నాలజీ వల్ల చేతికి గ్లౌజెస్ వేసుకున్నా కూడా స్క్రీన్ ను ఈజీగా ఆపరేట్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

Also Read: క్రోమా ఫ్లాష్ సేల్ ధమాకా.. గూగుల్ పిక్సెల్ 10 మెుబైల్‌పై.. ఏకంగా రూ.14,091 తగ్గింపు!

Related News

ధర తక్కువే కానీ ఫీచర్లు అద్భుతం.. వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్!

200MP కెమెరా, కేక పెట్టించే డిజైన్.. శాంసంగ్ సరికొత్త అల్ట్రా ఫోన్ ఫస్ట్ లుక్ చూశారా?

ఫ్రిజ్ డోర్‌పై బొమ్మలు అతికిస్తున్నారా? అసలు నిజం తెలిస్తే అస్సలు నమ్మలేరు!

Oppo K15 స్పెసిఫికేషన్స్ లీక్.. అమోలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న క్రేజీ స్మార్ట్‌‌ఫోన్!

ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా? కంప్రెసర్ పేలిపోతుంది జాగ్రత్త !

పవర్ బ్యాంక్ కొనేముందు తప్పక చెక్ చేయాల్సిన 5 ఫీచర్లు.. కెపాసిటీ ఒక్కటే సరిపోదు!

ఐఫోన్‌లో ఇకపై బిల్స్ స్ప్లిట్ చేయడం చాలా ఈజీ.. iOS 27 క్రేజీ ఫీచర్లు చూశారా?

×