Best Mini Projectors: ప్రస్తుత కాలంలో ఓటీటీ కంటెంట్, యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లను పెద్ద స్క్రీన్‌పై చూడాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే.. పెద్ద సైజు స్మార్ట్ టీవీల ధరలు వేలల్లో ఉండటంతో అందరూ వాటిని కొన లేకపోతున్నారు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారమే.. “స్మార్ట్ మినీ ప్రొజెక్టర్లు”. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లగలగడం, తక్కువ ధరలో.. పెద్ద స్క్రీన్ విజువల్స్ ఇవ్వడం వీటి ప్రత్యేకత. తక్కువ బడ్జెట్లో.. లభిస్తున్న టాప్ 5 స్మార్ట్ మినీ ప్రొజెక్టర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
జెబ్రోనిక్స్ బ్రాండ్ అనగానే మనకు బడ్జెట్ ప్రైస్‌లో.. బెస్ట్ ప్రొడక్ట్స్ గుర్తుకొస్తాయి. ఈ జీ-పిక్సప్లే 15 మోడల్ వైఫై ,బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. దీన్ని నేరుగా మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి ఓటీటీ యాప్స్ ఎంజాయ్ చేయెచ్చు.
ధర: సుమారు రూ.8,999 నుంచి రూ.10,500 వరకు ఉంటుంది.
ప్రత్యేకత: బిల్ట్-ఇన్ స్పీకర్లు, ఫుల్ హెచ్డీ సపోర్ట్.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు తగిన బడ్జెట్లో ఎలిస్టా ప్రొజెక్టర్ ఒక మంచి ఛాయిస్. ఇది కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉండి, తక్కువ వెలుతురు ఉన్న గదుల్లో కూడా చక్కటి పిక్చర్ .. క్వాలిటీని అందిస్తుంది. దీనిని ఆపరేట్ చేయడం చాలా ఈజీ.
ధర: సుమారు రూ.6,500 నుంచి రూ.7,999 మధ్య లభిస్తోంది.
ప్రత్యేకత: తక్కువ బరువు, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్.
బడ్జెట్ సెగ్మెంట్లో విజాట్కో బ్రాండ్ నుంచి వస్తున్న ఈ ప్రొజెక్టర్ యూజర్ల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయడం వల్ల మీరు నేరుగా ప్రొజెక్టర్‌లోనే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్‌ను రన్ చేయెచ్చు.
ధర: సుమారు రూ.9,499 నుంచి రూ.11,000 వరకు ఉంది.
ప్రత్యేకత: ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఫీచర్లు, వైర్లెస్ స్క్రీన్ మిర్రరింగ్.
పోర్ట్రోనిక్స్ బ్రాండ్ పోర్టబుల్ గాడ్జెట్లకు చాలా ఫేమస్.ఈ మినీ ప్రొజెక్టర్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, పర్ఫార్మెన్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తుంది. ప్రయాణాలు చేసే వారికి లేదా హాస్టళ్లలో.. ఉండే విద్యార్థులకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.
ధర: సుమారు రూ. 7,000 నుంచి రూ.8,500 మధ్య లభిస్తుంది.
ప్రత్యేకత: జేబులో పట్టేంత సైజు, ఈజీ కనెక్టివిటీ.
Also Read: రియల్ మీ నుంచి బిగ్గెస్ట్ టీవీ..100 ఇంచుల క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ వచ్చేసింది!
బడ్జెట్లో బెస్ట్ బ్రైట్నెస్ కోరుకునే.. వారికి ఐయోయో మినీ ప్రొజెక్టర్ మంచి ఆప్షన్. దీని ద్వారా మీ గోడపై ఈజీగా.. 100 ఇంచుల వరకు పెద్ద స్క్రీన్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. పిల్లల ఆన్ లైన్ క్లాసులు లేదా ఎంటర్ టైన్మెంట్కు ఇది ఎంతో ఉపయోగ పడుతుంది.
ధర: సుమారు రూ.5,999 నుంచి రూ.7,499 వరకు.
ప్రత్యేకత: అత్యంత తక్కువ ధరలో లభించే డీసెంట్ బ్రైట్నెస్ ప్రొజెక్టర్.
మీరు ప్రొజెక్టర్ కొనే ముందు దాని లుమెన్స్ బ్రైట్నెస్, రిజల్యూషన్, వైఫై/బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. చీకటి రూముల్లో సినిమాలు చూడటానికి ఇవి అద్భుతంగా పని చేస్తాయి.