E-Paper
Advertisement

BSNL Plans: రూ.1000లోపు బడ్జెట్లో.. అత్యుత్తమ BSNL ప్లాన్స్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే ఇక వదిలిపెట్టరు!

BSNL Plans: రూ.1000లోపు బడ్జెట్లో.. అత్యుత్తమ BSNL ప్లాన్స్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే ఇక వదిలిపెట్టరు!
Advertisement

BSNL Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ బడ్జెట్ లో తన యూజర్లకు మెరుగైన ప్లాన్స్ ను అందిస్తుంటుంది. ముఖ్యంగా రూ.1000లోపు బడ్జెట్ లో అపరిమిత కాలింగ్, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునేవారికి చాలా ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో అత్యుత్తమ ప్లాన్ ను ఈ కథనంలో అందించడం జరిగింది. ప్లాన్ ధరలు, వాటి ఫీచర్లు, ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 997 ప్లాన్

రూ.1000 లోపు బడ్జెట్ లో అత్యధిక వ్యాలిడిటీ కలిగిన ఆల్ రౌండర్ ప్లాన్ కోరుకుంటే దీనిని పరిశీలించవచ్చు. రూ.997 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 164 రోజులు వ్యాలిడిటీతో రోజుకు 2GB హై స్పీడ్ డేటా పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఏదైనా నెట్‌వర్క్‌కు అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి.

రూ. 599 ప్లాన్

Advertisement

తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డేటా కావాలనుకునేవారి కోసం బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.599తో రీఛార్జ్ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతీరోజు 3GB డేటా పొందవచ్చు. ప్లాన్ పూర్తయ్యే సరికి 252GB లభిస్తుంది. దీనితో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు.

రూ. 485 ప్లాన్

27 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ప్రతీరోజూ 2GB హై స్పీడ్ డేటా, పరిమితి అయినపోయిన వెంటనే 40 – 80 Kbps స్పీడ్ తో అపరిమిత డేటాను పొందవచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు యూజర్లకు లభిస్తాయి.

Advertisement

Also Read: Supreme Court: క్రైస్తవంలో చేరితే.. ఎస్సీ హోదా కోల్పోయినట్లే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రూ. 347 ప్లాన్

తక్కువలో మంచి బడ్జెట్ ప్లాన్ కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. ఇది 50 రోజుల వ్యాలిడిటీతో రూపొందింది. రోజుకు 2GB డేటా, దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS లభిస్తాయి.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న ప్లాన్లు, వాటి ప్రయోజనాలు ప్రాంతం, రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. రీఛార్జ్ చేసే ముందు BSNL సెల్ఫ్ కేర్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మంచిది.

Also Read: LPG Weight: సిలిండర్ బరువు 14.2 కేజీలే ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? మ్యాటర్ తెలిస్తే అవాక్కవుతారు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×