E-Paper
Advertisement

MP Chamala: అమృత్ 2.0 సమీక్షలో ఎంపీ చామల.. హైదరాబాద్ అభివృద్ధి ఫైళ్లపై కీలక చర్చ

MP Chamala: అమృత్ 2.0 సమీక్షలో ఎంపీ చామల.. హైదరాబాద్ అభివృద్ధి ఫైళ్లపై కీలక చర్చ
Advertisement

MP Chamala: భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ నిర్వహించిన ‘అమృత్ & అమృత్ 2.0’ పథకాల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణలోని పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు తక్షణమే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా హైదరాబాద్ నగర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ గురించి ఆయన ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుమారు 7,444 కి. మీ పొడవైన ఈ డ్రైనేజీ నెట్‌వర్క్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 17,212 కోట్లుగా ఉందని.. ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించడం అత్యవసరమని ఆయన వివరించారు.

Advertisement

దీంతో పాటు, ప్రతిష్టాత్మకమైన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ గురించి కూడా ఎంపీ చర్చించారు. సుమారు రూ. 4వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు , నిధుల మంజూరులో జాప్యం జరుగుతోందని, దీనివల్ల పనుల పురోగతికి ఆటంకం కలుగుతోందని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, కేంద్రం రాజకీయాలకు తావులేకుండా ఈ భారీ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ ముందు రాష్ట్ర అవసరాలను బలంగా వినిపించిన ఆయన, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరని స్పష్టం చేశారు.

Advertisement

Also Read:సినిమాను తలపించే సీన్.. మనుషులు చేయలేని పనిని ఈ కుక్కలు చేసి చూపించాయి!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×