E-Paper
Advertisement

కొత్త ఏసీ కొనుగోలు చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృధానే!

కొత్త ఏసీ కొనుగోలు చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృధానే!
Advertisement

Budget ACs 2026: వేసవిలో ఇతర నగరాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్ వంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో విపరీతమైన ఉక్కపోతకి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఈ నేపథ్యంలో చాలామంది ఎలాగైనా ఏసీ కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే, ఒకప్పుడు ఏసీ అంటే ధనవంతుల ఇంట్లోనే ఉండేది కానీ, ఇప్పుడు తక్కువ ధరకే బ్రాండెడ్ ఏసీలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి. ప్రతి ఇంట్లోనూ ఏసీలు దర్శనమిస్తున్నాయి. మంచి ఏసీని కొనాలని షాప్‌కు వెళ్లినప్పుడు కరెంట్ బిల్లు భారం పడకుండా ఉండే దానిని ఎంచుకోండం ఉత్తమం. ఇప్పుడు రూ.30వేల నుండి రూ.50వేల లోపు దొరికే కొన్ని ఏసీల గురించి తెలుసుకుందాం.

తక్కువ ధరలో మంచి ఏసీ కావాలా?

తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన ఏసీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు ‘వోల్టాస్’. రూ.30,000 లోపు కావాలనకుంటే.. వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ చాలా బాగుంటుంది. దీనికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఊళ్లలో కూడా దీని సర్వీస్ సెంటర్లు ఉంటాయి. ఏ చిన్న రిపేర్ వచ్చినా మెకానిక్స్ ఇట్టే దొరుకుతారు. ఒకవేళ మీరు అద్దె ఇళ్లలో ఉంటే లేదా చిన్న గది కోసం చూస్తుంటే ‘హయర్’ 1 టన్ ఏసీని ఎంచుకోవచ్చు. ఇది తక్కువ కరెంటుతో గదిని ఇట్టే చల్లబరుస్తుంది. ఇక బడ్జెట్ విషయంలో అస్సలు తగ్గకూడదు అనుకుంటే ఫ్లిప్‌కార్ట్ ‘మార్క్యూ’ బ్రాండ్ కూడా తక్కువ ధరకే బేసిక్ ఫీచర్లను అందిస్తోంది.

గాలిని శుభ్రం చేసే ఏసీలు..

Advertisement

ఏసీ అంటే కేవలం చల్లదనం ఇవ్వడమే కాదు.. మనం పీల్చే గాలి కూడా బాగుండాలి. అందుకు ‘పానాసోనిక్’ ఏసీలు ఈ విషయంలో దిట్ట అంటుంటారు. వీటిలో ఉండే ప్రత్యేకమైన ఫిల్టర్లు గాలిలోని దుమ్ము ధూళిని కూడా క్లీన్ చేస్తాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక ‘గోద్రెజ్’, ‘బ్లూ స్టార్’ విషయానికి వస్తే.. ఇవి చాలా గట్టి ఏసీలు. వీటిలో 100 శాతం కాపర్ కాయిల్స్ వాడతారు కాబట్టి.. త్వరగా తుప్పు పట్టవు. ఎండలు 45 డిగ్రీలు దాటినా కూడా బ్లూ స్టార్ ఏసీలు గదిని చల్లగా ఉంచుతాయని మంచి పేరుంది.

Also Read: ఫోన్ కెమెరాకు లెన్స్ పెట్టుకోవచ్చు.. ఈ Vivo X300 FE కొత్త టెక్నాలజీ గురించి తెలుసా?

ప్రశాంతమైన నిద్ర కోసం..

Advertisement

ఏసీ వేసుకున్నప్పుడు గురక పెట్టినట్లు శబ్దం వస్తే నిద్ర పట్టడం కష్టం. మీకు అలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ఈ ‘డైకిన్’ ఏసీలు ది బెస్ట్. ఇవి ఎంత సైలెంట్‌గా పనిచేస్తాయంటే అసలు ఏసీ ఆన్‌లో ఉందో లేదో కూడా అర్థం కాదు. బెడ్ రూమ్ ఉండేవారికి డైకిన్ లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. వీటి డిజైన్ కూడా చాలా సింపుల్‌గా, చూడగానే నచ్చేలా ఉంటుంది.

కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే..

చాలామంది ఏసీ కొనేటప్పుడు తక్కువ ధరలో వస్తుందో లేదో చూస్తారు కానీ, వాడేటప్పుడు వచ్చే కరెంట్ బిల్లు గురించి మర్చిపోతారు. ఒకవేళ మీరు రోజుకు 10 నుంచి 12 గంటలు ఏసీ వాడేవారైతే, కళ్లు మూసుకుని ‘ఎల్‌జీ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్’ ఏసీ తీసుకోవచ్చు. దీని రేటు కొంచెం ఎక్కువే అనిపించినా, నెల నెలా వచ్చే కరెంట్ బిల్లు చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంత డబ్బు ఆదా చేస్తుందో. అలాగే వర్ల్‌పూల్ ఏసీలు కూడా త్వరగా గదిని చల్లబరుస్తాయి.

ఏసీ కొనేముందు ఇవి చూసుకోండి..

మీరు ఏ బ్రాండ్ ఏసీ కొన్నా సరే.. మీ గది సైజును బట్టి టన్నును నిర్ణయించుకోండి. 150 చదరపు అడుగుల లోపు గది ఉంటే 1.5 టన్ ఏసీ సరిపోతుంది. అలాగే కొనే ముందు మీ ఇంటి దగ్గర ఆ కంపెనీ సర్వీస్ సెంటర్ ఉందో లేదో ఒకసారి తెలుసుకోండి. అలాగే ఏసీ ఫిల్టర్లను నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే కూలింగ్ తగ్గదు. కరెంట్ బిల్లు కూడా అదుపులో ఉంటుంది.

Also Read: 165Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 9500 చిప్‌సెట్.. వన్‌ప్లస్ నుంచి పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్ వచ్చేస్తోంది!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×