E-Paper
Advertisement

బెంబేలెత్తిస్తున్న ఎండలు.. 22 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్, ఈ టైంలో జాగ్రత్త!

బెంబేలెత్తిస్తున్న ఎండలు.. 22 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్, ఈ టైంలో జాగ్రత్త!

తెలంగాణను భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. సోమవారం నాడు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటేశాయి. రెండు జిల్లాల్లో అయితే ఏకంగా 43 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల నమోదు అయ్యింది. మిగిలిన 11 జిల్లాల్లో 41 నుండి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యల్పంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం.

నిజామాబాద్ జిల్లా ఆలూరులో అత్యధికంగా 43.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు  అయ్యింది. ఇది సోమవారం రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా నిలిచింది. నల్గొండ జిల్లా గుడిపల్లిలో 43.1 డిగ్రీలతో రెండో స్థానంలో నిలిచింది. కామారెడ్డి జిల్లా భిక్నూర్ 42.9 డిగ్రీలతో తీవ్రమైన ఉక్కపోతకు గురైంది. అడవి ప్రాంతాలు అధికంగా ఉండే జిల్లాల్లో సైతం ఎండ తీవ్రత తగ్గలేదు. ఆదిలాబాద్ లోని ఇచ్చోడ జగిత్యాల జిల్లా కత్లాపూర్ జోగులాంబ గద్వాల జిల్లా కాలూరు తిమ్మానదొడ్డి ములుగు జిల్లా వాజేడు నిర్మల్ జిల్లా కడెం పెద్దూర్ ప్రాంతాల్లో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మెదక్ జిల్లా చేగుంట నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సిద్దిపేట జిల్లా కోహెడ ప్రాంతాల్లో 42.7 డిగ్రీల వేడి ప్రజలను బెంబేలెత్తించింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 42.6 డిగ్రీలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద ప్రాంతాల్లో 42.4 డిగ్రీల మేర ఎండలు కాయడం గమనార్హం. వనపర్తి జిల్లా చిన్నంబావి, హన్మకొండ జిల్లా దామెరలో 42.3 డిగ్రీలు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లా మధిరలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 42 డిగ్రీల వేడి నమోదైంది.

ఈ టైంలో బయటకు రావొద్దు.. 

పట్టణ ప్రాంతాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రంగారెడ్డి జిల్లాలో 41.9 డిగ్రీలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41.6 డిగ్రీలు హైదరాబాద్‌లోని నాంపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో.. ముఖ్యంగా 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

ALSO READ: Layoffs to Business: లేఆఫ్‌లో రెండుసార్లు ఉద్యోగం ఫట్.. కట్ చేస్తే నెలకు రూ.1.3 కోట్లు సంపాదన, అదెలా?

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×