E-Paper
Advertisement

Chanakya Niti: భార్య చేసే ఆ ఐదు పనుల వల్లే భర్త జీవితం నాశనం అవుతుందట. చాణక్యనీతిలో ఇంకా ఏముందంటే

Chanakya Niti: భార్య చేసే ఆ ఐదు పనుల వల్లే భర్త జీవితం నాశనం అవుతుందట. చాణక్యనీతిలో ఇంకా ఏముందంటే
Advertisement

Chanakya Niti: భార్యలు చేసే ఆ ఐదు పనుల వల్లే భర్తల జీవితాలు నాశనం అవుతాయట. ఆర్థికంగా సామాజికంగా భర్తలు కుంగిపోతారట. ఆ పనులు చేసే భార్యలున్న మగవాళ్లు ఎంత కష్టపడినా జీవితంలో అభివృద్దిలోకి వెళ్లలేరట. ఇంకా చాణక్య నీతిలో ఏముందో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

చాణక్య నీతి మరియు విదుర నీతి వంటి గ్రంథాలలో కుటుంబ సౌఖ్యం గురించి, దంపతుల మధ్య ఉండవలసిన అవగాహన గురించి అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒకరి అలవాట్లు మరొకరి జీవితంపై ప్రభావం చూపుతాయని ఈ శాస్త్రాలు చెబుతుంటాయట. అయితే భార్యలు చేసే కొన్ని పనులు వల్ల భర్తల జీవితాలు నాశనం అవుతాయని.. ఆ పనుల వల్ల భర్తలు ఎంత కష్టపడినా వృద్దిలోకి రాలేరని.. ముఖ్యంగా ఆ ఐదు పనుల వల్ల కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుందని.. ఆయా గ్రంథాల్లో పేర్కోన్నారట. అయితే భార్యలు చేయకూడని ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

భార్య అతిగా ఖర్చు చేయడం (దుబారా):  భర్తల ఆదాయానికి మించిన ఖర్చులు భార్యలు చేయడం వల్ల ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుందట.  భార్యలకు పొదుపు చేసే గుణం లేకపోతే భర్త ఎంత సంపాదించినా అది నిలవదట. ఇది మానసిక ఒత్తిడికి దారితీసి భర్త ఎదుగుదలను అడ్డుకుంటుందట.

భర్తల మీద గౌరవం లేకపోవడం: భార్యలకు తమ భర్తల మీద గౌరవం లేకపోవడం కూడా ఒక కారణమట. భర్తలను ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటం లేదా హేళన చేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందట. సమాజంలో భర్తలకు దక్కే గౌరవం వారికి భార్యలు ఇచ్చే మర్యాదపై కూడా ఆధారపడి ఉంటుందట.

Advertisement

భర్తను కఠినమైన మాటలు మాట్లాడటం (వాక్చాతుర్యం లేకపోవడం): భార్యలు ఎప్పుడూ తమ భర్తలకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం.. ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం ఇంట్లో ఎప్పుడూ అసహనంగా ఉండటం వల్ల గృహ వాతావరణం అశాంతిగా మారుతుందట. పరుష పదజాలం వాడటం వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుందట.

అబద్ధాలు చెప్పడం లేదా విషయాలు దాచడం: విశ్వాసం అనేది ఏ బంధానికైనా పునాది. భర్తలకు తెలియకుండా రహస్యాలు దాచడం లేదా అబద్ధాలు చెప్పడం వల్ల ఇద్దరి మధ్య రిలేషన్‌ అనేది దెబ్బతింటుందట. దీంతో భార్యభర్తల మధ్య నమ్మకం అనేది ఉండదట. ఇది సంసారంలో అనుమానాలకు, గొడవలకు దారితీస్తుందట.

సోమరితనం మరియు బాధ్యతారాహిత్యం: భార్యలు కుటుంబ బాధ్యతలను విస్మరించడం, ఇంటిని అస్తవ్యస్తంగా ఉంచడం వల్ల సానుకూల శక్తి తగ్గుతుందట. భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరం బాధ్యతలను పంచుకోనప్పుడు, ఆ భారం ఒకరిపైనే పడి జీవితం అస్తవ్యస్తం అవుతుందట.

ఇక ఏ బంధమైనా విజయవంతం కావాలంటే కేవలం ఒకరి ప్రవర్తన మాత్రమే కారణం కాదు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, గౌరవించుకున్నప్పుడే ఆ సంసారం సుఖమయంగా ఉంటుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పంచ మహా కన్యలు అని ఎవరిని పిలుస్తారు..? వారికున్న ప్రత్యేకలు ఏంటి..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×