E-Paper
Advertisement

Symphony Air Cooler: మధ్యతరగతికి.. వరం లాంటి కూలర్.. ఫీచర్లు, ధర, లాభాలు ఇవే!

Symphony Air Cooler: మధ్యతరగతికి.. వరం లాంటి కూలర్.. ఫీచర్లు, ధర, లాభాలు ఇవే!
Advertisement

Symphony Air Cooler: ప్రస్తుత వేసవి కాలంలో ప్రతీ ఇంటికి ఏసీ లేదా కూలర్ తప్పనిసరిగా మారిపోయింది. ఏసీని కొనుగోలు చేసేంత ఆర్థిక స్థోమత లేనివారు.. కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వారి కోసం ప్రస్తుతం Symphony 17 L అనే అద్భుతమైన కూలర్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో రూ.6,500కే లభిస్తోంది. దాని ప్రధాన ఫీచర్లు, కొనడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐ ప్యూర్ టెక్నాలజీ

ఈ కూలర్‌లో కేవలం చల్లని గాలి మాత్రమే కాకుండా, శుభ్రమైన గాలిని అందించే i-Pure టెక్నాలజీని అందించారు. ఇందులో డస్ట్ ఫిల్టర్, స్మెల్ ఫిల్టర్, అలర్జీ ఫిల్టర్, బ్యాక్టీరియా ఫిల్టర్ వంటి మల్టీ-స్టేజ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థ ఉంది.

హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్స్

Advertisement

దీనిలో హనీకోంబ్ ప్యాడ్స్ ఫిక్స్ చేశారు. సాధారణ గడ్డి ప్యాడ్ల కంటే ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీటిని ఎక్కువ సేపు నిల్వ ఉంచుకుని గాలిని వేగంగా చల్లబరుస్తాయి.

డ్యూరా పంప్ టెక్నాలజీ

కూలర్‌లోని వాటర్ పంప్ ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా ఈ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది పంప్ జామ్, వాటర్ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు లేకుండా జాగ్రత్త వహిస్తుంది.

విద్యుత్ ఆదా

Advertisement

ఇది రన్నింగ్ టైమ్ లో 105 Watts విద్యుత్తును మాత్రమే తీసుకుంటుంది. అంటే ఒక ఫిలమెంట్ బల్బు వెలిగినంత తక్కువ కరెంటుతో ఇది పనిచేస్తుందన్నమాట. దీనివల్ల కరెంటు బిల్లును చాలా వరకూ ఆదా చేసుకోవచ్చు.

ఐస్ ఛాంబర్

గాలి మరింత చల్లగా కోరుకునేవారి కోసం ఇందులో ఐస్ ఛాంబర్ ను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవడం ద్వారా.. సమ్మర్ లో మరింత కూలింగ్ ను ఆస్వాదించవచ్చు.

Also Read: Dishwasher Offers: ఆహా.. ఓహో ఏమన్నా ఆఫర్లా.. భలే చౌకగా డిష్ వాషర్లు ఇచ్చేస్తున్నారే..!

కొనడం వల్ల కలిగే లాభాలు..

17 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల బెడ్ రూమ్, స్టడీ రూమ్ లేదా చిన్న ఆఫీసులకు ఇది సరిగ్గా సరిపోతుంది. పైగా దీనిని ఒక చోటు నుంచి మరో చోటుకు చాలా తేలిగ్గా తీసుకెళ్లవచ్చు. ఒకవేళ కరెంటు పోతే ఇన్వర్టర్ కనెక్షన్ తోనూ దీనిని వాడుకోవచ్చు. ఇది సైలెంట్ గా పనిచేస్తుంది కాబట్టి.. రాత్రిపూట చాలా హాయిగా నిద్రపోవచ్చు.

Also Read: iQOO 15R vs POCO X8 Pro Max: మోస్ట్ ట్రెండింగ్ ఫోన్స్.. ఫీచర్ల పరంగా.. ఏది బెస్ట్ అంటే?

Related News

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

Big Stories

Advertisement
×